📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

Fauji Teaser Loading!? Prabhas | Hanu Raghavapudi || NTVENT

NTV Entertainment 1:37

Transcription

రెవెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఒక అద్దిరిపోయే గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతానికి మేకర్స్ నుంచి ఎలాంటి హడావిడి లేకపోయినా, మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. ప్రభాస్ లుక్ ను కూడా ఫుల్ గా రివీల్ చేయలేదు. జస్ట్ ప్రీ లుక్ మాత్రమే బయటకు వదిలారు. దీంతో అసలైన 'ఫౌజీ' ఎలా ఉంటాడనే ఆతృత అందరిలోనూ ఉంది.

సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు హను రాగుపుడి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చిన ఈ నేపథ్యంలో, త్వరలోనే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం. వచ్చే కొన్ని వారాల్లో 'ఫౌజీ' నుంచి పవర్ఫుల్ టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని టాక్.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే ఏడాదిలో సినిమా రిలీజ్ కు సన్నహాలు చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం 'ఫౌజీ' చిత్రాన్ని 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా భారి ఎత్తున విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే టీజర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఈ టీజర్ సినిమా పై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని టాలీవుడ్ టాక్.

టీజర్ విడుదలతో పాటు సినిమా ప్రమోషన్స్ వేగాన్ని కూడా పెంచాలని చిత్రబృందం భావిస్తుందట. బ్యాక్ టు బ్యాక్ పాటలు, చిత్రంలోని కీలక పాత్రలను పరిచయం చేసే గ్లిమ్స్ వీడియోలను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుందట. మరి మేకర్స్ అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.