📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

మీకు తెలియని నెహ్రూగారు చేసిన తప్పులు | Nehru's mistakes explained in telugu | telugu facts | telugu

Telugu Facts Menu24:50

Transcription

జవహర్లాల్ నెహ్రూ మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి. చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన గురించి మన స్కూల్ పుస్తకాల్లో చాలా గొప్పగా రాసి ఉంటుంది. కానీ ఆయన చేసిన తప్పుల గురించి మాత్రం రాసి ఉండవు. ఆయన అప్పుడు చేసిన తప్పుల వల్ల ఇప్పటికీ మన దేశం ప్రపంచం ముందు తల వంచుకోవాల్సి వస్తుంది.

అది 1962. చైనా భారత్ భూభాగాన్ని వేగంగా ఆక్రమించుకుంటూ వస్తుంది. అప్పటికే చైనా భారతదేశం యొక్క 32,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించేసుకుంది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఆయన అప్పుడు చేసిన ఆ తప్పుల వల్లే భారత్ లోని మణిపూర్, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, లదక్ లోని కొంత భూభాగాలని చైనా హస్తగతం చేసుకోగలిగింది. ఆ చైనా భారత్ యొక్క అతి భీకరమైన యుద్ధంలో భారత్ కి సహాయం చేయడానికి ఏ ఒక్క నాన్ అలయన్స్ దేశం కూడా ముందుకు రాలేదు. అప్పటివరకు భారత్ కి ఫ్రెండ్ గా ఉన్న రష్యాని సహాయం చేయమని భారత్ అడిగితే రష్యా ఏమి చెప్పిందో తెలుసా? "మీకు ఎలా అయితే మిత్రులు, చైనా కూడా అంతే మిత్రుడు, కాబట్టి నేను మీకు సహాయం చేయలేను" అని తేల్చి చెప్పింది.

కానీ భారత్ కు ఆ పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిన అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జానఫ్ కెన్నడీ మాత్రం భారత్కి సహాయం చేయడానికి స్వయంగా తన చేతిని ముందుకు చాపాడు. కానీ నెహ్రూ గారు ఆ స్నేహాన్ని తిరస్కరించారు. నెహ్రూ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన కెనడీతో మాట్లాడడం బదులుగా ఆయన భార్య జాక్లిన్ కెన్నడీ తోనే మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడేవారని ఏ వ్యక్తి అయితే చైనా పైన భారత్కి సహాయం చేద్దామని అనుకున్నాడో ఆ వ్యక్తి కుటుంబంలోని స్త్రీల పట్ల మన అప్పటి భారత ప్రధాని నెహ్రూ గారు అలా వ్యవహరించిన తీరు అనేది కరెక్టేనా? అప్పుడు నెహ్రూ గారు చేసిన ఆ తప్పులు అశ్రద్ధ వల్ల ఇప్పటికీ ప్రపంచం ముందు భారత్ తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు అప్పుడు నెహ్రూ గారు గనుక మన దేశానికి ప్రధానిగా లేకుండా సర్దార్ వల్లభాయి పటేల్ గారు గనక మన దేశానికి ప్రధానిగా ఉంటే ఇప్పుడు మన దేశ భవిష్యత్తు ఇంకోలాగా ఉండేది అనేది చాలామంది అభిప్రాయం. మనందరికీ తెలుసు 1962లో భారత్ చైనా యుద్ధంలో భారత్ చైనాతో అతి ఘోరంగా ఓడిపోయి భారత్ తన భూభాగంలోని కొన్ని వేల భూభాగాన్ని కోల్పోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే అలా కోల్పోవడానికి ఎవరి అశ్రద్ధ, ఎవరి అలవాట్లు కారణమో అంతే కాదు నెహ్రూ గారు మన దేశాన్ని పరిపాలించిన తీరుని కూడా ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్డ్ గా వివరిస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను నెహ్రూ గురించి తప్పుగా మాట్లాడడం లేదు. చరిత్రలో జరిగిన వాస్తవాలని మీకు తెలియజేస్తున్నాను అంతే.

ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం ఎక్కువగా లెంగ్త్ ఉండవచ్చు. బట్ ఈ వీడియోలో నెహ్రూ గారి గురించి నేను ఎంతో రీసెర్చ్ చేసి మీకు తెలియని కొన్ని వాస్తవాలని మీకు తెలియజేస్తున్నాను. మేము ఈ ఇన్ఫర్మేషన్ ని ఎక్కడి నుండి తీసుకున్నామో కూడా కింద డిస్క్రిప్షన్ లో రిఫరెన్స్ లింక్స్ ని కూడా పెట్టాము. వాటి ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కలకి షేర్ చేయండి.

అది అక్టోబర్ 20, 1962. చైనా భారత్ పైన దాడి చేసింది. చైనాతో యుద్ధంలో భారత్ ఓడిపోవడానికి కారణం కేవలం నెహ్రూ గారు మాత్రమే బాధ్యులు అనడంలో ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. నెహ్రూ గారు అప్పుడు చేసిన ఆ తప్పుల వల్ల భారతదేశం అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి 1962 లో చైనా భారత్ యుద్ధ సమయంలో భారత్ వైపున ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను భారత్ కి సహాయం చేస్తానని తన చేతిని స్వయంగా ముందుకు చాచాడు. కానీ నెహ్రూ ఆ స్నేహాన్ని తిరస్కరించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన జానఫ్ కెనడీ.

1961లో జానఫ్ కెన్నెడీ భారత్ అనుబాంబు తయారు చేసుకోవడానికి సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ నెహ్రూ గారు అతని నుండి అందే ఆ సహాయాన్ని తిరస్కరించారు. ఇదే చైనా మన ఇండియాలో కొంత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఈజీగా దారి తీసింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1962 లో భారత్ చైనా సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. చైనా భారత్ పైన దాడి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని నెహ్రూ గమనించిన గమనించకపోయినా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ ఆఫ్ కెనడీ గ్రహించాడు. ఇటు నెహ్రూ ఒక పక్క కమ్యూనిస్టు రష్యాని తన మిత్రుడిగా అమెరికాని తన శత్రువుగా భావించేవారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే భారత్ పైన చైనా దాడి చేస్తే సోవియట్ యూనియన్ అయిన రష్యా భారత్ కి సహాయం చేయదు అని తన స్నేహితుడైన చైనాకే సహాయం చేస్తుంది అని అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీకి తెలుసు. కానీ ఈ విషయాన్ని నెహ్రూ గారు గ్రహించలేకపోయారు.

1961లో జానఫ్ కెన్నెడీ భారత్ అనుబాంబు తయారు చేసుకునే ఒక ప్రాధిపతికను తీసుకువచ్చాడు. ఎందుకంటే భారత్ దగ్గర అనుబాంబులు ఉంటే చైనా ఎప్పటికీ భారత్ పైన యుద్ధానికి దిగదు అని జాన్ ఎఫ్ కెన్నెడీకి తెలుసు. ఈ విషయాన్ని స్వయంగా అప్పట్లో విదేశాంగ మంత్రి ఎంకే రసకోస్త్ర 'ఏ లైఫ్ ఇన్ని డెమోక్రసీ' అనే పుస్తకంలో క్లియర్ గా వెల్లడించాడు. ఎప్పుడైతే చైనా భారత పైన దాడి చేయడానికి అనుబాంబులను సిద్ధం చేసుకుంటుంది అని జాన్ ఎఫ్ కెన్నెడీకి తెలిసిందో అప్పుడే వెంటనే జాన్ ఎఫ్ కెన్నెడీ తనే స్వయంగా నెహ్రూకి ఒక లెటర్ ను రాశాడు. "చైనా కంటే ముందు భారత అనుపరికరాలను చేసేందుకు అమెరికా సహరిస్తుంది. అనుబాంబులను తయారు చేసి భారతలోని రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ప్రయోగించవచ్చు" అనే ప్రస్తావనని తీసుకువచ్చాడు. ఆసియాలో భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశం అందరికంటే ముందు అనుశక్తిని సంపాదించుకొని ఉండాలి అనేది కెనడీ ఆలోచన. కానీ నెహ్రూ కెనడీ తెచ్చిన ఈ ప్రస్తావనని తిరస్కరించాడు.

అలా అప్పుడే 1961 లో జాన్ ఆఫ్ కెనడీ తెచ్చిన ఆ యొక్క ప్రస్తావనని నెహ్రూ గారు అనుసరించి ఉంటే 1962 లో చైనా భారత్ పైన యుద్ధానికి దిగేది కాదు. అంతే కాదు 1965 లో పాకిస్తాన్ కూడా భారత్ పైన యుద్ధానికి దిగడానికి ముందుకు వచ్చేది కాదు. అలానే కొన్ని వేల మంది సైనికులు చనిపోయేవారు కాదు. అలానే మన భారత్ కొన్ని వేల కిలోమీటర్ల భూమిని కోల్పోయేది కాదు.

అసలు అప్పుడు నెహ్రూ కెనడీ యొక్క సలహాని పాటించకపోవడమే కాకుండా కెనడీ పట్ల చాలా అవమానంగా ప్రవర్తించాడు. 1961 నవంబర్ లో నెహ్రూ గారు గారు అమెరికా యాత్రకి వెళ్లారు. అక్కడ జానఫ్ కెనడీతో సమావేశం అయ్యాడు. కానీ కెనడీ వంటి శక్తివంతమైన వ్యక్తిని అక్కడ చాలా చిన్న చూపు చూశాడు. ఈ విషయం గురించి 'అంబాసిడర్ జనరల్' అనే బుక్ లో క్లియర్ గా వ్రాయబడి ఉంది. అమెరికా పర్యటనలో నెహ్రూ గారు చాలా అశ్రద్ధగా ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ క్యాండీ తో ఒకటి రెండు మాటలే మాట్లాడి ఆ విషయాన్ని అక్కడితో ముగించేసేవాడు. నెహ్రూ ఆయన యొక్క ఒక్క విషయాన్ని కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో అమెరికా ప్రెసిడెంట్ చాలా చేదు నిరాశ చెందాడు. అందుకనే జానఫ్ కెనడీ "ఇది నా సమయంలో ఒక విదేశీ నేతలతో ఏర్పడిన సమావేశాల్లోకల్లా ఇది అత్యంత చండాలపమైన రాజకీయ సమావేశం" అని ప్రస్తావన కూడా ఇచ్చాడు.

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అప్పుడు నెహ్రూ గారు అమెరికా రాష్ట్రపతి అయిన జానఫ్ కెన్నెడీ తో మాట్లాడడానికి బదులుగా ఆయన భార్య అయిన జాకీ కెన్నెడీ తో మాట్లాడడానికి ఎక్కువగా మొక్కు చూపాడు. అసలు సరిగ్గా ఆలోచించండి. చైనా భారత్ పైన యుద్ధానికి దిగి భారత్ యొక్క భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్న సమయం అది. అలాంటి సమయంలో అమెరికా రాష్ట్రపతి అయిన కెనడీ వంటి మహానేత అండ అవసరమైన అటువంటి సమయంలో నెహ్రూ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన కెనడీ పట్ల అంతా అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా ఆయన భార్య మీద ఎక్కువగా అంత మొక్కు చూపడం అలా వ్యవహరించిన తీరు అనేది కరెక్టేనా ఆలోచించండి.

ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు. ఆ సమయంలో అమెరికా రాయభారిగా ఉన్న గాల్బర్ట్ రాశాడు. ఇంకా ఆయన ఏమి చెప్పాడు అంటే నెహ్రూ అమెరికా పర్యటించినప్పుడు మా భారతిని సందర్శించమని కెనడీకి చెప్పడం బదులుగా ఆయన భార్యని ఆహ్వానించాడు. దీంతో 1962 లో కెనడీ భార్య భారత యాత్రకు వచ్చింది. ఈ యాత్ర గురించి కూడా గల్బర్ట్ తన పుస్తకంలో పూర్తిగా వివరించాడు. ఢిల్లీలో ఒక రాయభార కార్యాలయంలో కెనడీ భార్య ఉండడానికి ఏర్పాట్లు చేశారు. అయితే నెహ్రూ ఇక్కడ ఆమెను రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆమె యొక్క బస్సుని ప్రధానమంత్రి నివాసానికి మార్చారు. ఇక్కడ మనకి కలిగించే ఆశ్చర్యం ఏమిటంటే నెహ్రూ గారు అమెరికా ప్రెసిడెంట్ భార్య మీద చాలా ప్రేమ చూపించేవారు. ఆమెతో దిగిన ఫోటోల్ని కూడా ప్రధానమంత్రి నివాసంలో ముఖ ద్వారం వద్ద అతికించారు.

అంతేకాదు జాన్ ఆఫ్ కెనడీ అమెరికాకి ప్రెసిడెంట్ అవ్వకముందు తన సోదరుడైన బాబీ కెన్నెడీ తన చెల్లెలైన పత్రికా కెనడీ తో కలిసి భారత్కు వచ్చాడు. అప్పుడు కూడా నెహ్రూ గారు జాన్ ఆఫ్ కెన్నెడీ పట్ల చాలా అంటే చాలా మొరటగా ప్రవర్తించాడు. అంతేకాదు ఆయన చెల్లెలు పత్రికా కెనడీ పట్ల చాలా ప్రేమగా చాలా డిఫరెంట్ గా ప్రవర్తించేవాడు. అని గాల్బ్రెత్ 'ద అంబాసిడర్ జనరల్' అనే పుస్తకంలో క్లియర్ గా రాశాడు. అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే చైనా భారత యుద్ధంలో భారత్ కి సహాయం చేస్తానని ముందుకు వచ్చాడో ఆ వ్యక్తి కుటుంబంలోని స్త్రీల పట్ల నెహ్రూ గారు ఎలా ప్రవర్తించారు అసలు ఒక దేశ ప్రధాని ఆ సమయంలో ప్రవర్తించిన తీరు చూస్తే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు.

ఇంకా అక్టోబర్ 20, 1962 చైనా భారత్ పైన నేరుగా దాడి చేయడంతో మన నెహ్రూ గారికి అది చూసి దెబ్బకి కళ్ళు తిరిగాయి. చైనా భారత్ పైన నేరుగా యుద్ధానికి దిగడంతో నెహ్రూ గారు వెంటనే రష్యా దగ్గరికి వెళ్లి రష్యాని మాకు సహాయం చేయమని రష్యాని అడిగాడు. కానీ రష్యా అప్పుడు చెప్పిన సమాధానం విని మన నెహ్రూ గారు ఆశ్చర్యపోయారు. "మీరు నా స్నేహితులు, చైనా నా సోదరుడు, సో నేను మీకు సహాయం చేయలేను" అని రష్యా ఇచ్చిన సమాధానం చూసి నెహ్రూ గారు అది చూసి ఆశ్చర్యపోయారు. దీంతో నవంబర్ 1962 రెండు వారాల్లోనే కేవలం ఎనిమిది రోజుల్లోనే చైనా వేగంగా భారత్లోకి ప్రవేశించి భారత భూభాగాన్ని తన హస్తగతం చేసుకుంటూ వేగంగా ఆక్రమించుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. అప్పటికే భారత్ యొక్క 32 వేల కిలోమీటర్ల భూభాగాన్ని అత్యంత వేగంగా చైనా ఆక్రమించేసుకుంది. దీంతో అప్పటి వరకు తనని అవమానిస్తూ వస్తున్న జాన్ ఎఫ్ కెనడీ మన నెహ్రూ గారికి అప్పుడు గుర్తుకు వచ్చారు.

దీంతో 19 నవంబర్ 1962 నెహ్రూ అమెరికా రాష్ట్రపతి అయిన జానఫ్ కెనడీకి స్వయంగా ఒక లెటర్ ని రాశాడు. అదే ఈ లెటర్. అయితే ఈ లెటర్ ని తర్వాత పాలిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి రాకుండా దాచిపెడుతూ వచ్చాయి. ఎందుకంటే ఈ లెటర్ బయటికి వస్తే నెహ్రూ గారితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరువు పోతుందని ఈ లెటర్ ని నెహ్రూ పరిపాలన కాలంలోనే ప్రభుత్వ రికార్డుల నుండి మాయం కూడా చేశారు. ఎందుకంటే నెహ్రూ నాన్ ఎలాట్మెంట్ ఆలోచన కమ్యూనిస్టుల నేటి నిజాయితీలకు నవ్వుల పాలవుతుందని దీనిని అప్పుడే మాయం చేశారు. అయితే 2010 లో జాన్ ఆఫ్ కెనడీ లైబ్రరీలో ఈ లెటర్ ని బయట పెట్టకపోయి ఉంటే ఈ విషయం ఎప్పటికీ వెలుగులోకి వచ్చేది కాదు. అసలు ఈ లెటర్ లో నెహ్రూ గారు జాన్ ఆఫ్ కెన్నెడీకి ఏమి రాశాడో ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం.

"డియర్ మిస్టర్ ప్రెసిడెంట్, చైనా భారత్లోని నేపాల్ లోని అతి పెద్ద భూభాగాన్ని ఆక్రమించేసుకుంది. వాళ్ళు కాశ్మీర్ లోని చాలా భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. త్వరగా ఏదైనా చర్య తీసుకోకపోతే అస్సాం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, చైనా హస్తగతం అయిపోతాయి. చైనా దాడి నుండి ఎదుర్కోవడానికి భారత్కి అమెరికా నుండి ఫైటర్ జెట్లు అలానే ఆయుధాలు సరఫరా చేసే విమానాలు అవసరం. చాలా తక్కువలో తక్కువ 12 ఫైటర్ విమానాలు కావాలి. మా పైలట్లు వీటిని నడపడంలో శిక్షణ పొందేంతవరకు అమెరికా పైలెట్లే వీటిని నడపవలసి ఉంటుంది. భారతీయ నగరాలు ముఖ్య ప్రదేశాల రక్షణ కొరకు అమెరికా పైలట్లు ఉపయోగించబడతారు. అమెరికా భారత్ యొక్క ఉపఖండాన్ని భారతదేశాన్ని అమెరికా రక్షిస్తుంది అని నాకు పూర్తి నమ్మకం ఉంది. గౌరవంగా, మీ జవహర్లాల్ నెహ్రూ."

అయితే మీలో కొంతమంది నన్ను అడుగుతారు. నెహ్రూ అప్పుడు అలా అమెరికాని సహాయం అడగటం తప్పేంటి బ్రో అని. నెహ్రూ అమెరికాని అలా సహాయం అడగటంలో తప్పేమీ లేదు. కానీ నెహ్రూ పాలన మొదలైన నాటి నుండి 15 సంవత్సరాలుగా నెహ్రూ గారు ఎప్పుడూ అమెరికాను తిడుతూనే ఉన్నారు. అంతర్జాతీయ వివాదాలన్నిటిలో నెహ్రూ గారు ఎప్పుడు కూడా అమెరికాను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 1962 యుద్ధం మొదలైన తర్వాత కూడా అప్పటి భారత రక్షణ మంత్రి నెహ్రూకి అత్యంత సన్నిహిత స్నేహితుడైన వీకే మీనన్ అహంకారంగా "సహాయం కోసం అమెరికాకి మేము ఒక్క కార్డు ముక్క కూడా రాయము" అని ఎన్నో వాక్యాలు కూడా పలికాడు. కానీ ఒక్క నెలలోనే మన నెహ్రూ గారికి గర్వం అంతా దిగిపోయింది. ఆయన ఎంతో బాధపడుతూ ఈ ఐదు పేజీల లెటర్ ని రాశాడు. ఈ లెటర్ ని అమెరికా ప్రెసిడెంట్ అయిన కెనడీకి చేర్చింది అమెరికాలో ఆనాటి భారత రాయభారి రాజ్ కుమార్ నెహ్రూ, ఇతరు నెహ్రూ యొక్క మేనల్లుడు. అయితే అమెరికాలోని భారతీయ అధికారులకి ఈ లెటర్ వల్ల ఎంతటి అవమానం వాళ్ళు అక్కడ ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే ఆనాడు ఆ అధికారులతో కలిసి పనిచేసిన నెట్వర్క్ సింగ్ రాసినటువంటి 'వన్ లైఫ్ ఇస్ నాట్ ఎనఫ్' అనే పుస్తకంలో క్లియర్ గా వివరించారు. నెహ్రూ అప్పుడు అమెరికాకి స్వయంగా ఈ లెటర్ రాయడం అనేది ఎంత అవమానకరంగా ఉందో మేము ఆ లెటర్ ని అమెరికా ప్రెసిడెంట్ కి ఇచ్చేటప్పుడు ఎంత అవమానంగా ఫీల్ అయ్యామో వాటన్నిటి గురించి ఆ పుస్తకంలో అతను క్లియర్ గా వివరించాడు. ఈ నత్వర్ సింగ్ అనే అతను తర్వాత కాలంలో భారత్ తరపున విదేశాంగ మంత్రిగా కూడా పని చేశారు. అంతేకాదు నెహ్రూ నుండి నేటి సోనియా గాంధీ వరకు అందరి ప్రభుత్వాల్లో పనిచేసిన వ్యక్తి నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఈయన. ఈయన ఏమి చెప్పారో ఇప్పుడు చూద్దాం.

"చైనాతో యుద్ధ సమయంలో ఒక్క నాన్ అలయన్స్ దేశం కూడా భారత్కి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మరోపక్క అమెరికా రాష్ట్రపతి అయిన జాన్ కెనడీ కూబా మిసైల్ సమస్యల్లో ఇరుక్కొని ఉన్నాడు. అయినా కూడా ఆయన భారత్కి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. కానీ నెహ్రూ అహంకారంతో అప్పుడు ఆయన మాటని తిరస్కరించాడు. చివరికి చైనా భారత్ని వేగంగా ఆక్రమించుకోవడం చూసి అప్పుడు నెహ్రూకి జ్ఞానోదయం అయి నెహ్రూ కెనడీకి రాసిన లెటర్ అనేది చాలా దయనీయకరమైనది. నెహ్రూ రాసిన లెటర్ అనేది అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ కెనడీకి అందించేటప్పుడు నేను చాలా సిగ్గుపడ్డాను" అని తన పుస్తకంలో రాశడు. అలానే ఇంకో మాట కూడా రాశడు. "నెహ్రూ నిజానికి కెనడీని అవమానిస్తూ ఉండేవాడు. కానీ కెనడీ భారత్కి నిజమైన స్నేహితుడిగా నిరూపించుకున్నాడు. ఆయన వెంటనే అమెరికా యొక్క ఇతిహాద్ క్రూయర్ షిప్ ని బంగాళ ఖాతంలోకి పంపించాడు. అంతేకాదు ఆనాటి అత్యాధునిక యుద్ధ విమానంకేసి 135 ప్లేన్ ని కూడా వెంటనే భారత్ కి పంపించాడు. అమెరికా మిలిటరీ ని కూడా వెంటనే భారత్ కి పంపించాడు."

ఇది చూసిన చైనా అమెరికా భారత్ తరపున యుద్ధంలోకి దిగింది అంటే యుద్ధ పరిస్థితి మారిపోతుంది అని అర్థం చేసుకొని 20 నవంబర్ 1962 న చైనా స్వయంగా భారత్ తో యుద్ధాన్ని విరమిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు చైనా 1959 కి ముందున్న సరిహద్దులకు 20 కిలోమీటర్లు వెనక్కి మలుతానని కూడా ప్రకటించింది. ఇలా ఆ సమయంలో భారత్ కి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన ఆ జాన్ ఎఫ్ కెన్నెడీ తన సహాయాన్ని అందించకపోయి ఉంటే భారత్ యొక్క అస్సాం మణిపూర్ మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ లద్ధాకు లను భారత్ పూర్తిగా వదులుకోవాల్సి వచ్చేది.

ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏమిటంటే అసలు అప్పుడు నెహ్రూ గారు ఒక్క సంవత్సరం ముందే అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఉంటే 1962 లో భారత్ చైనాతో యుద్ధం జరిగి ఉండేది కాదు. ఒకవేళ జరిగినా భారత్ చైనాతో ఓడిపోయి భారత్ తన భూభాగాన్న కోలిపోయేది కాదు.

సో ఫ్రెండ్స్ నెహ్రూ గారు చేసిన తప్పు ఇది ఒక్కటే కాదు ఇంకా చాలానే ఉన్నాయి. అవి కూడా ప్రస్తుత సమాజానికి పూర్తిగా తెలియదు. వాటిల్లో అతి ముఖ్యమైన కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

**కాశ్మీర్ సమస్య.** ఇక్కడ చూస్తే ఇది కాశ్మీర్ యొక్క మ్యాప్. ఈ వైట్ కలర్ లో ఉన్న భాగం అంతా భారత్ భూభాగం. ఇదేమో చైనా భారత్ ని ఆక్యుపై చేసిన ప్లేస్. ఇంకా ఇటు పాకిస్తాన్ భారత్ ని ఆక్యుపై చేసిన ప్లేస్. ఇదిగో ఈ ప్లేస్ గీతలుగా వున్న భాగం అంతా భారత్ యొక్క భూభాగం. దీన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొని దాన్ని గిఫ్ట్ గా చైనాకి ఇచ్చిన ప్లేస్ ఇది. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనకి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ మన దేశం నుండి విడిపోయింది. అయితే అప్పుడు కాశ్మీర్ ఎవరిది? పాకిస్తాన్ దా లేదా మనదా? ఎవ్వరిదీ కాదు. ఇదిగో ఇతనిది. ఇతనే రాజా హర్సింగ్. ఇతనే ఆ సమయంలో కాశ్మీర్ యొక్క రాజు. ఇతను ఒక హిందూ. అంతే కాదు అప్పుడు కాశ్మీర్ లో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కూడా హిందువులే ఎక్కువగా ఉండేవారు. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే బ్రిటిష్ వారు మన దేశం నుండి వెళ్ళిపోతూ ఈ రాజ హర్సింగ్ కి ఒక ఇంటిమేట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. "మీకు నచ్చితే ఇండియాలో ఉండండి లేదా పాకిస్తాన్ లో అన్నా కలవండి లేదా ఒక సపరేట్ దేశం కన్నా ఉండండి" అని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయారు. దీంతో ఆ రాజా హర్సింగ్ అప్పుడు ఏం చేశడు అంటే కాశ్మీర్ ని ఒక స్వతంత్ర దేశంగానే ఉంచి నేను పరిపాలిస్తానని చెప్పి కాశ్మీర్ ని అటు పాకిస్తాన్లో అలానే ఇటు ఇండియాలో కూడా కలపకుండా ఒక సపరేట్ దేశంగా ఉంచి ఆయన కాశ్మీర్ ని పరిపాలిస్తున్నాడు. దీంతో పాకిస్తాన్ మెల్లమెల్లగా కాశ్మీర్ లోకి ప్రవేశించి కాశ్మీర్ ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. దీంతో తమ దేశాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడం చూసిన ఆ రాజా హర్సింగ్ "నేను ఇండియాలో జాయిన్ అవుతానని చెప్పి" అంటే కాశ్మీర్ ని ఇండియాలో కలిపేస్తానని చెప్పి నెహ్రూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.

అప్పుడే నెహ్రూ గారు చేసిన అతి పెద్ద తప్పు ఏమిటంటే ఆ తప్పు వల్లే ఇప్పటికీ కాశ్మీర్ సమస్యని మనం పరిష్కరించలేకపోతున్నాం. అసలు అప్పుడు నెహ్రూ గారు చేసిన మిస్టేక్ ఏమిటంటే ఆ రాజా హర్సింగ్ చేతులు ఎత్తేసి "నా కాశ్మీర్ ని పాకిస్తాన్ నుండి రక్షించమని" నెహ్రూ గారి దగ్గరికి వచ్చినప్పుడు నెహ్రూ గారు ఏమి చేసి ఉంటే బాగుండేది? ఇమీడియట్ గా భారత సైన్యాన్ని కాశ్మీర్ కి పంపి కాశ్మీర్ పాకిస్తాన్ బారిన పడకుండా కాశ్మీర్ మొత్తాన్ని ఆక్యుపై చేసేయాలి. కానీ అప్పుడు మన నెహ్రూ గారు అప్పుడు ఏమి చేశారు అంటే ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ రాసుకుంటూ కూర్చున్నాడు. ఆ లెటర్ లో "కాశ్మీర్ నా దగ్గరికి వచ్చి ఇండియాలో కలుస్తాను అని చెప్తుంది. సో కాశ్మీర్ ని కలుపుకోవాలా వద్దా లేదా కాశ్మీర్ ని వాళ్ళకి ఇవ్వాలా వద్దా" అని ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ ని రాశాడు. దీంతో ఐక్యరాజ్య సమితి వాళ్ళేమో ఆ లెటర్ ని చూసి "ఆ చూద్దాం చేద్దాం" అనేసరికి అప్పటికే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ లోపు పాకిస్తాన్ కాశ్మీర్ ని ఆక్రమించుకోవడానికి కాశ్మీర్ లోకి వేగంగా రావడం అయిపోయింది. దాడి చేయడం అయిపోయింది. కాశ్మీర్ లోని చాలా భూభాగం పాకిస్తాన్ ఆక్రమించుకోవడం కూడా అయిపోయింది. దీంతో అది చూసినప్పుడు వెంటనే గొప్ప మేధస్సు ఉన్న సర్దార్ వల్లభాయి పటేల్ గారు గనుక కలగ చేసుకొని భారత సైన్యాన్ని వెంటనే కాశ్మీర్ వద్దకు పంపి పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడితో వెంటనే తిప్పి కొట్టడం జరిగింది. అయినా అప్పటికే పాకిస్తాన్ కాశ్మీర్ లో చాలా భూభాగాన్ని ఆక్రమించేసుకుంది. సర్దార్ వల్లభాయి పటేల్ గారు గనుక వెంటనే ఆ విషయాన్ని కలుగజేసుకొని భారత సైన్యాన్ని అప్పుడు వెంటనే పంపించకపోయి ఉంటే కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ హస్తగతం అయిపోయేది. కానీ నెహ్రూ మాత్రం పాకిస్తాన్ కాశ్మీర్ లోపలికి జరబడి కాశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించుకుంటూ ఉంటుంటే పాకిస్తాన్ మీదకి భారత సైన్యాన్ని పంపించడానికి ఇష్టపడలేదు.

సో అప్పుడు కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారు చేసిన ఆ పెద్ద తప్పు వల్లే ఇప్పటికీ కాశ్మీర్ సమస్యని మనం పరిష్కరించలేకపోతున్నాం. అది ఎలా అంటే అప్పుడు పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భూ భాగాన్ని మనం తిరిగి తీసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఏ విషయాన్ని మనం తేల్చాలన్నా ఐక్యరాజ్య సమితి ఆ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి "నెహ్రూ కాశ్మీర్ విషయంలో మాకు అప్పుడు రాసిన లెటర్ ఉంది. ఆ లెటర్ విషయం తేలిన తర్వాతే ఆ కాశ్మీర్ విషయం తేలుతుంది" అని అలా ఒక మెలిక పెడుతుంది. అలా నెహ్రూ గారు అప్పుడు ఆ కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ సమితికి రాసిన లెటర్ వల్లే ఇప్పటికి ఆ కాశ్మీర్ సమస్యని మనం పరిష్కరించలేకపోతున్నాం.

అంతేకాదు కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ని తెచ్చింది కూడా నెహ్రూ గారే. ఇది నెహ్రూ అప్పుడు తీసుకున్న ఒక పెద్ద తప్పుడు నిర్ణయం చెప్పుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో ఒక స్థలం కొనాలన్న కేవలం జమ్మూ కాశ్మీర్ వాళ్లే కొనుక్కోవాలి. అలానే పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లో మ్యారేజ్ చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ వాళ్ళు పాకిస్తాన్ లో మ్యారేజ్ చేసుకోవచ్చు అనే కొన్ని చెత్త నియమాలు ఈ ఆర్టికల్ 370 లో ఉంటాయి. మళ్ళీ మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయిన దాకా కూడా ఈ ఆర్టికల్ 370 ని ఎవరూ రద్దు చేయలేకపోయారు. మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 2019 లో ఈ ఆర్టికల్ 370 ని పూర్తిగా రద్దు చేయించారు.

అయితే పాకిస్తాన్ విషయంలో ఇందిరా గాంధీ గారు చేసిన ఒక తప్పును కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. మనం నెహ్రూ గురించిగా మాట్లాడుకుంటుంది. మధ్యలో ఇందిరా గాంధీ గారి గురించి ఎందుకని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఈ విషయం కూడా తెలుసుకోవాలి. 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో పాకిస్తాన్ మీద ఇండియా భారీ విజయాన్ని సాధించి అప్పుడు దాదాపు 90 వేల మంది పాకిస్తాన్ సైనికులు మనకి పట్టుపడ్డారు. అప్పుడు మనం సుమారు పాకిస్తాన్ లోని లాహూర్ వరకు వెళ్ళిపోయాం. అంటే పాకిస్తాన్ లోని లాహూర్ వరకు భారత సైన్యం యుద్ధం చేస్తూ వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ పాకిస్తాన్ మొత్తం హస్తగతం చేసుకునేంత వరకు వెళ్లిపోయాం. అప్పుడు ఆ యుద్ధంలో పాకిస్తాన్ భారత్ తో ఘోరంగా ఓడిపోయి దాదాపు 90 వేల మంది పాకిస్తాన్ సైనికులు మనకు పట్టుబడిపోయారు. కానీ అప్పుడు కూడా ఇందిరా గాంధీ గారు చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే ఆ పట్టుబడిన 90 వేల మంది ఆ పాకిస్తాన్ సైనికుల్ని ఏదో చుట్టాల్ని చూసినట్టు చూసి వాళ్ళకి పైగా మర్యాదలు చేసి మళ్ళీ తిరిగి పాకిస్తాన్ కి పంపించేసింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే అదే సమయంలో ఇందిరా గాంధీ గారు పాకిస్తాన్ భారత్ ని ఆక్రమించుకున్న ప్లేస్ ని తిరిగి తీసుకురావచ్చు కదా కానీ ఇందిరా గాంధీ గారు అది చేయలేదు. భారత సైనికులు ఎంతగానో పోరాడి పాకిస్తాన్ ని తుడిచిపెట్టుకుంటూ లాహూర్ దాకా వెళ్ళినా కూడా పాకిస్తాన్ లో ఇంత కొంచెం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోవడానికి ఇందిరా గాంధీ గారు ఇష్టపడలేదు. అసలు అక్కడిదాకా ఎందుకు పాకిస్తాన్ ఆక్రమించుకున్న మన దేశ భూభాగాన్ని తిరిగి తీసుకురావడానికి కూడా ఇందిరా గాంధీ గారు ఇష్టపడలేదు ఎందుకంటే అలాంటి అవకాశం మళ్ళీ రాదు కదా.

సో ఈ పాయింట్స్ బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి? కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ ఫ్యామిలీ మొత్తం పాకిస్తాన్ కే ప్రయారిటీ ఇచ్చారు. అంటే ముస్లిం కమ్యూనిటీ కే ప్రయారిటీ ఇచ్చారు. ఇవే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చేసిన అతి పెద్ద తప్పులు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుత సమాజానికి పెద్దగా తెలీదు.

ఇంకా నెహ్రూ గారు చేసిన ఇంకో పెద్ద తప్పు సోషలిస్ట్ మార్గాన్ని అనుసరించడం. ఇది కూడా నెహ్రూ గారు చేసిన అతి పెద్ద తప్పుగా చెప్పుకోవచ్చు. ఈ సోషలిస్టిక్ సిస్టమ అంటే విదేశీ కంపెనీల్ని పెట్టుబడల్ని మన దేశంలోకి రానివ్వకుండా చేయడం. ప్రైవేటు రంగాలపై భారీ నిబంధనలో ఆంక్షలు విధించాడు. వ్యవసాయం సామాజిక రంగాల అభివృద్ధిని విమర్శించాడు. దీంతో ఇది విదేశీ వాణిజ్యం మరి పెట్టుబడులను నిరుత్సాహ పరిచింది. ఇలా ఈ సోషలిస్టిక్ సిస్టం ని నెహ్రూ గారు అప్పుడు అనుసరించడం వల్ల విదేశీ కంపెనీలు విదేశీ పెట్టుబడ్లు భారతదేశానికి రాకపోవడం వల్ల భారతదేశానికి అతి తక్కువ జీడిపి అలానే ఇన్ఫ్లేషన్ ఏమో బాగా పెరిగి భారతదేశంలో పేదరికం బాగా పెరిగిపోయింది. దీంతో ఇవన్నీ దేశంలో బాగా అవినీతికి దారి తీశయి.

ఇంక నెహ్రూ గారు చేసిన ఇంకో తప్పు డైనాస్టిక్ ట్రెండీని ఫాలో అవ్వడం అంటే రాజవంశ ధోరణి. నెహ్రూ భారతదేశంలో రాజవంశ రాజకీయాలను అలానే వారసత్వ రాజకీయాలను బాగా ప్రోత్సహించాడు. అంటే నెహ్రూ తన కాంగ్రెస్ పార్టీలో ఎంతో అనుభవజ్ఞ అయిన సామర్థ్యం ఉన్న సర్దార్ వల్లభాయి పటేల్, రాజేంద్ర ప్రసాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప మేదస్సు గల దేశభక్తుల్ని పక్కన పెట్టి తన వారసత్వ కుటుంబ సభ్యులకి కాంగ్రెస్ పార్టీలో పదవులని అప్పగించాడు. అంటే 1959లో వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇందిరా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షురాలుగా నియమించాడు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ రెండో శ్రేణి నాయకత్వాన్ని పెంపొందించడంలో కూడా ఆయన విఫలమయ్యాడు. ఇలా నెహ్రూ గారు రాజవంశ ధోరణిని ఎక్కువగా ప్రోత్సహించారు. అందువల్ల మన దేశానికి జరిగిన నష్టాలు ఏమిటంటే సరైన అనుభవజ్ఞులైన వాళ్ళని పక్కన పెట్టి తన వంశంలో వాళ్ళని కుర్చీలో ఎక్కించడం వల్ల 1975 నేషనల్ ఎమర్జెన్సీ లాంటి రూల్స్ తో దేశ ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఇంక నెహ్రూ గారు చేసిన ఇంకో అతి పెద్ద తప్పు మైనారిటీ విధానం. మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను ప్రోత్సహించి హిందువులని అంతగా పట్టించుకోకపోవడం. భారతదేశ విభజనకు దోహదబడిన స్వతంత్రానికి ముందు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడానికి ఆయన డిమాండ్ చేస్తూ వాళ్ళకి మద్దతు ఇచ్చాడు. అసలు మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానమైన హక్కులు, న్యాయాన్ని కల్పించే అప్పుడు సుప్రీంకోర్టు అమలు చేయాలన్న మాటల్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. ముస్లిం మహిళల పట్ల విపక్ష చూపే ముస్లిం పర్సనల్ లా అనే ఒక చట్టాన్ని కూడా నిలిపి వేయాలని దాని వైపు ఆయన మొగ్గు చూపాడు. హిందూ దేవాలయాలు సంస్థల వ్యవహారాల్లో కూడా ఎక్కువగా జోక్యం చేసుకున్నాడు. దేశంలో ఉన్న హిందూ దేవాలయాలన్నిటికీ ఒక రూల్ ని తెచ్చి దేశంలో ఉన్న హిందూ దేవాలయాలన్నింటినీ ప్రభుత్వ కంట్రోల్ లో పెట్టేశాడు. అంటే తన కంట్రోల్ లో పెట్టుకున్నాడు. ఇలా హిందువుల పట్ల పక్షపాతం ముస్లింల పట్ల సానుకూలత వ్యవహరించాడు.

ఇంక నెహ్రూ గారు చేసిన ఇంకో పెద్ద తప్పు ఏమిటంటే సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే దేశ రక్షణ ఆయుధాల తయారీ భద్రత విషయంలో నెహ్రూ చాలా అశ్రద్ధ వ్యవహరించాడు. సాయుధ బలగాల ఆధునీకరణ విస్తరణలపై తగిన శ్రద్ధ చూపలేదు. అతను భారత ఆయుధ బలగాలపై తగినంత అభివృద్ధి చేయడానికి వాటిపై పెట్టుబడి కూడా పెట్టలేదు. దీని వల్ల భారతదేశం దాని పొరుగు దేశాల నుండి ముఖ్యంగా చైనా పాకిస్తాన్ నుండి వచ్చే బెదిరింపులకి భారతదేశం ఎక్కువగా గురైంది. అంతేకాదు అతను బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని దానికి సంబంధించిన భద్రతా సిద్ధాంతాన్ని రూపొందించడంలో కూడా దారుణంగా విఫలం అయ్యాడు. అంతేకాదు నాగాలాండ్ ట్రైబల్స్ తిరుగుబాటు, ద్రవిడ ఉద్యమం, నక్సలైట్ల తిరుగుబాటు వంటిని అరికట్టడంలో కూడా చాలా దారుణంగా విఫలమయ్యాడు. అంటే అక్కడ చాలా అశ్రద్ధ చూపాడు. అలా దేశాన్ని రక్షించడంలో అతను చాలా బలహీనంగా చాలా బాధ్యత రహితంగా వ్యవహరించాడు. దీని వల్ల పాకిస్తాన్ చైనా మన దేశంలోని చాలా భూభాగాన్ని చాలా ఈజీగా ఆక్రమించేసుకోగలిగాయి. ఇవి నెహ్రూ గారు చేసిన అతి పెద్ద తప్పులు అని చెప్పుకోవచ్చు.

అయితే ఇక్కడ మీరు నన్ను అడుగుతారు. ఎవరు పరిపాలనలో అయినా విజయాలతో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఉండటం సహజమే. తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు? కొన్నిసార్లు తప్పులు అనేవి అనుకోకుండా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు నెహ్రూ గారు చేసిన ఆ తప్పుల్ని చూపించి ఆయన్ని నిందించడం కరెక్టా అని మీలో కొంతమంది నన్ను అడుగుతారు. అసలు ఇప్పుడు మనం ఐఐటి, ఎన్ఐడి, ఎంఐఎం లాంటి టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఏర్పడ్డాయి అంటే అప్పుడు నెహ్రూ గారి వల్లే కదా? నెహ్రూ భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి పునాది వేశాడు. అప్పుడు ఆయన పునాదులు వేయటం వల్లే ఇప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థలో మన దేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడే స్థాయికి వెళ్ళింది. అంతేకాదు అప్పుడు ఆయన సాంకేతిక రంగాన్ని కూడా బాగా ప్రోత్సహించాడు అని దాని ఫలితంగా ఇస్రో, బిఏఆర్సి, భారత్ ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్, ఏఎంఎస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటివి ఏర్పడ్డాయి కదా. సో ఆయన సాంకేతిక రంగానికి పెద్ద పేట వేశడు కదా. మరి ఇవి చేశాడు కదా. మరి అలాంటప్పుడు భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో అతను పరిపాలనలో విఫలమై అయ్యారు అని మీరు ఎందుకు చెబుతున్నారు అని మీరు నన్ను అడుగుతారు.

ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఎవరి పరిపాలనలో అయినా విజయాలతో పాటు ఫెయిల్యూర్స్ కూడా సహజమే. కానీ ఫెయిల్యూర్స్ అనేవి విజయాల కంటే బాగా ఎక్కువ స్థాయిలో ఉంటే అతను పరిపాలనలో విఫలమయ్యారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెహ్రూ గారు చేసిన తప్పుల్ని నేను ఇప్పటి వరకు మీకు చెప్పినవి చాలా తక్కువే. మీరు రజినీకాంత్ పౌరాణికు రాసిన 'నెహ్రుస్ 97 మేజర్ బ్లెండర్స్' అనే బుక్ ని మీరు చూస్తే నెహ్రూ గారు చేసిన 97 అతి పెద్ద తప్పుల్ని ఆ బుక్ లో ఆయన క్లియర్ గా వివరించారు. ఆ బుక్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. డౌట్ ఉన్న వాళ్ళు ఆ బుక్ ని చదివి క్లియర్ గా తెలుసుకోవచ్చు. అప్పుడే మీకే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది.

సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నెహ్రూ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఆయన గురించి మీకు తెలియని వాస్తవాలని మీకు తెలియజేశాను అంతే. సో ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన దేశం పట్ల నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ.