📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

BIRTH OF JESUS రక్షకుని జననం#telugubiblestories #jesusmovie #christianmovies #jesusbirth #nativity

Telugu Bible Stories and Sermons18:43

Transcription

శతాబ్దాలుగా ప్రవక్తల ప్రకటించిన ఒక మహత్తరమైన వేళ అది. ఆకాశంలో ధగధగా మెరిసే నక్షత్రం, దూతల కీర్తనల దివ్యనాదం. ఆ రాత్రి మామూలిది కాదు. లోకానికి వెలుగును, శాంతిని అందించడానికి, చరిత్రగతిని మార్చడానికి, మానవజాతికి నిరీక్షణను నింపడానికి రక్షకుడైన యేసుక్రీస్తు యూదయా దేశంలోని బెత్లెహేము అనే చిన్న ఊరిలో ఒక నిరాడంబరమైన పశుల పాకలో జన్మించారు.

ఆ అద్భుత జననం యొక్క పవిత్రత, ప్రభావం మరియు సందేశం తెలుసుకోవడానికి సిద్ధపడండి.

యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతికి చెందిన జకరియా అనే ఒక యాజకుడు ఉండేవాడు. అతని భార్య పేరు ఎలిసబెత్. ఆమె అహరోను కుమార్తెలలో ఒకతే. వీరు ప్రభువు ఆజ్ఞల చొప్పున నీతిమంతులుగా నడుచుకునేవారు. కానీ వారికి పిల్లలు లేరు. ఎందుకంటే ఎలిజబెత్ గొడ్రాలు మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు.

ఒకరోజు జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఆలయంలో యాజక ధర్మం నిర్వహిస్తున్నప్పుడు ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది. ధూప సమయాన ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడ్డాడు. జకరియా ఆ దూతను చూచి తొందరపడి భయపడ్డాడు.

"జకరియా భయపడకుము. నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఆయనకు ముందుగా వెళ్ళును."

"ఇది నాకేలాగు తెలియునో? నేను ముసలివాడను. నా భార్యయు బహుకాలము గడిచినది కదా. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును నేను పంపబడితిని. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువు."

ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను.

అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్తు గర్భవతియై ఐదు నెలలు ఇతరుల కంటబడకుండెను.

ఎలిజబెత్ దేవుని స్తుతిస్తూ ఇలా అనుకొనెను. "మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెను."

ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్తుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. "దయా ప్రాప్తురాల నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు."

ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభ వచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, "మరియా భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనక ఇచ్చును. ఆయన యాకోబు వంశస్తులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును."

"నేను పురుషుని ఎరుగని దానిని. ఇదేలాగు జరుగును?"

"పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలీజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు."

అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను.

ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిసబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను.

అంతట ఎలిసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. "స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రార్థించెను? ఇదిగో నీ శుభ వచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు."

అప్పుడు మరియా ఇట్లు అనెను. "నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్టులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించెను. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను బట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను."

అంతట మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను.

ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ు కుమారుని కనెను. ప్రభువు ఆమె మీద మహా కనికరము ఉంచెనని విని ఆమె పొరుగువారును బంధువులను ఆమెతో కూడా సంతోషించారు. ఎనిమిదవ దినమున ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోవుచుండగా "ఆలాగు వద్దు. వానికి యోహాను అను పేరు పెట్టవలెను." నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడును లేడే. వారు వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంగ్లు చేసి అడిగారు. జకరియా సంజ్ఞలతో వ్రాత పలక తెమ్మని దానిపై వాని పేరు యోహాను అని వ్రాస్తాడు. వారందరూ ఆశ్చర్యపడ్డారు. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాడు. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారికందరికిని భయము కలిగింది. ఆ సంగతులన్నియు యూదయ కొండ సీమల యందంతటా ప్రచురమయ్యాయి. ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరును ఈ బిడ్డ ఎలాంటివాడగునో అని వాటిని మనసులో ఉంచుకున్నారు.

మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. "ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. మన శత్రువుల నుండియు మనలను ద్వేషించు వారందరి చేతి నుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. ఆయన మన పిత్రులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవ అనబడుదువు. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోనూ మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమ అనుగ్రహించెను."

శిశువు ఎదిగి ఆత్మ యందు బలము పొంది ఇశ్రాయేలలకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను.

యేసుక్రీస్తు జననము ఈ విధముగా జరిగెను. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచు నల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, "దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానియేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను."

యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను.

ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఆ సంఖ్యలో వ్రాయబడుటకు అందరును తమ తమ పట్టణములకు వెళ్ళిరి. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక యోసేపు తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయ ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను.

వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.

ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. "భయపడకుడి. ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక తుట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు."

వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి దేవుని స్తోత్రము చేయుచుండెను. "సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమిమీద సమాధానమును కలుగును గాక."

ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. "మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండి." వారు త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతట ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి.

ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్టించుటకును గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరుషలేమునకు తీసుకొని పోయిరి.

యెరుషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవసుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. "నాధా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసున్నని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని."

యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమియోను వారిని దీవించి ఆయన తల్లి అయిన మరియతో ఇలా చెప్పాడు. "ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును."

మరియు ఆషేరు గోత్రికురాలును పనుూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి యుండెను. ఆమె 84 సంవత్సరములు విధవరాలైయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.

రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరుషలేమునకు వచ్చి, "యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి." హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరుషలేము వారందరును కలవరబడిరి. హేరోదు ప్రధాన యాజకులను శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టులో యూదయ బేత్లెహేములోనే ఏలయనగా ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. "యూదయ దేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును."

"మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండు." వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళ్ళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.

తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి.

జ్ఞానులు వెళ్ళిన తర్వాత ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, "నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుము. హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోవుచున్నాడు." అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి హేరోదు మరణము వరకు అక్కడ నుండెను.

హేరోదు చనిపోయిన తర్వాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, "నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయిరి." అప్పుడతర లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కిలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ్య దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్లి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురమ ఉండెను. ఆయన నజరేయుడటనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను.