Transcription
తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని వినబోతున్నాము.
నాలుగే నాలుగు వచనాలను మనము ఈరోజు చూడబోతున్నాము. ఈ నాలుగు వచనాలు కూడా మాట్లాడుతున్నటువంటి టాపిక్, సబ్జెక్టు ఏంటంటే పెద్దల గురించి.
మనము ఇప్పుడే ఐదవ అధ్యాయంలో ఇంకొక గ్రూపు గురించి మాట్లాడి బయటికి వచ్చాము. చాలా వచనాలలో మరి దేవుడు ప్రత్యేకంగా వారి గురించి మాట్లాడాడు. ఐదవ అధ్యాయం మూడవ వచనం నుండి ఐదవ అధ్యాయం 16వ వచనం వరకు విధవరాండ్ర గురించి దేవుని వాక్యం మాట్లాడటం జరిగింది.
లాస్ట్ టైం మనం విన్నాము విధవరాండ్ర గురించి. ఎందుకు దేవుడు ఇన్ని వచనాలను ఇంతసేపు చెప్పాడు అనేటువంటిది నేను మాట్లాడాను. సో అది మీకు అర్థమైంది కాబట్టి మనం ఇంకొక గ్రూప్ దగ్గరికి వస్తున్నాం.
ఇప్పుడు ఇంకొక గ్రూప్ గురించి పౌలు మాట్లాడుతా ఉన్నాడు. ఆ గ్రూప్ ఎవరంటే పెద్దలు. పెద్దలు అనేటువంటి మాట మనం 17వ వచనంలోనే చదువుతాము. 17వ వచనం మొదట్లో బాగుగా పాలన చేయు పెద్దలను అనే మాట ఉంది.
సో మనము మాట్లాడుతున్నటువంటి టాపిక్ పెద్దలు అనేటువంటిది మనం చూస్తాం. అంతేకాదు, మీరు 19వ వచనానికి రండి. 19వ వచనంకి వస్తే, ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము అన్నాడు.
సో మనకు అర్థమవుతుంది ఏంటంటే, విషయము ఈ వచనాల్లో ఉన్నటువంటి టాపిక్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఓ పెద్దలు, పెద్దల విషయంలో సంఘము ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి.
సో ఈ గ్రూపుని ప్రత్యేకంగా వేరు చేసి ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది అన్నమాట. సో జాగ్రత్తగా అర్థం చేసుకుందాము.
మరి సంఘాన్ని నడిపించాల్సినటువంటి వాళ్ళు, సంఘాన్ని పరిపాలించాల్సిన వాళ్ళు, పరిపాలన అనే మాట మీరు చూశారో లేదో. సో అక్కడ 17వ వచనం మొదట్లోనే ఉంది. ఆ బాగుగా పాలన, పాలన అనేటువంటిది రూలింగ్ అంటాం కదా.
రూలింగ్, పాలన చేసేటువంటి బాధ్యత సంఘానికి పాలించాల్సినటువంటి బాధ్యత దేవుడు పెద్దలకు అప్పగించాడు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతుంది నాయకత్వపు గ్రూప్ గురించి.
సంఘానికి నాయకత్వం వహించినటువంటి పెద్దల గురించి మాట్లాడుతున్నాం అనేటువంటిది దయచేసి మీరు గమనించండి. గమనిస్తే గనుక మీకు అర్థమవుతుంది.
సో పెద్దల విషయంలో సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఆలోచించాలి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ పెద్దలు అన్నప్పుడు, లేకపోతే 19వ వచనంలో పెద్ద అన్నప్పుడు, ఇక్కడ ఈయన మాట్లాడుతుంది పెద్ద వయసు ఉన్న వాళ్ళ గురించి కాదు.
పెద్ద వయసు ఉన్న వాళ్ళ గురించి కాదు. ఇది పెద్ద వయసు ఉన్న వాళ్ళని గురించి ఆల్రెడీ ఐదవ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడాడు. వృద్ధుడు అనే మాట అక్కడ అన్నాడు.
వృద్ధుని గద్దింపొద్దు, తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించాలి అన్నాడు. ఇక్కడ పెద్దలు అంటే వయసులో పెద్దవారు అని కాదు. ఇక్కడ పెద్దలు అంటే ఎవరంటే సంఘాన్ని నడిపించేటువంటి వాళ్ళు, సంఘానికి నాయకత్వం వహించే వాళ్ళు, సంఘాన్ని పాలించేటువంటి పెద్దల గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి.
సో ఈ నాలుగు వచనాలని జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. ఆ వచనాలను అర్థం చేసుకోవడమే కాదు, దీంట్లో ఉన్న సత్యము మనము వ్యక్తిగతంగా మన సంఘాలలో ఎలా అప్లై చేయాలనేది అనేటువంటిది కూడా మనం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాము.
చేయాలి ఎందుకంటే దేవుని వాక్యం కాబట్టి. సత్యము చూసి చదివి నేర్చుకొని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, గాని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మన జీవితాల్లో, మన సంఘంలో మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి.
మరి అది లేకపోతే గనుక, మరి అది జ్ఞానం అంతా కూడా మన తలలోనే ఉంటది. కాబట్టి అలా కాకుండా దానికి లోబడాలి. దాని ప్రకారం మనం సంఘాన్ని నడిపించాలి.
సో 17వ వచనం చదువుతాను. 17వ వచనం మనం అర్థం చేసుకుందాం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను.
ఎంచవలెను. మీకు అర్థమైంది ఇక్కడ పెద్దలు పెద్ద వయసు వారు కాదు అని మీకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళంట పాలన చేస్తారంట. అంతేకాదు వాక్యాన్ని బోధిస్తారంట.
వాక్యమందును ఉపదేశమందును ప్రయాస పడతారంట. ప్రయాస అనే అనేటువంటి మాట గురించి కూడా మనం మాట్లాడదాము. సో ఒకవేళ మీరు గనక ఈ పెద్దలు సంఘాన్ని నడిపించాలి కాపరులు అన్నా, పెద్దలే, పెద్దలన్న కాపరులే, తర్వాత పై విచారణ చేయువారన్నా కూడా కాపరులే.
వాళ్ళు కూడా పెద్దలే. ఇదంతా కూడా మీరు మొదటిసారి వింటున్నారు అనుకోండి. ఇక్కడ కూర్చొని దయచేసి మీరు ఇంతకు ముందు నేను చెప్పిన వీడియోలు లేకపోతే నేను చెప్పిన మెసేజెస్ మీరు వినటానికి ప్రయత్నం చేయండి.
మీకు చక్కగా అవగాహన వస్తది అన్నమాట. సో ఇక్కడ నేను రెండు మూడు పాయింట్స్ చెప్పి ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడాం కాబట్టి ఇంకా ఎక్స్టెన్సివ్ గా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
సంఘాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత, సంఘానికి కాపరులుగా ఉండాల్సినటువంటి బాధ్యత, నాయకులుగా ఉంటూ పై విచారణ చేస్తూ మందని జాగ్రత్తగా భద్రం చేయాల్సినటువంటి బాధ్యత దేవుడు కాపరులకు లేకపోతే పెద్దలకు అప్పగించాడని మనము ప్రతి చోట కూడా కొత్త నిబంధనలో మనం చూస్తాం.
న్యూ టెస్టమెంట్ లో. సో వారికి దేవుడు ఆ బాధ్యత అప్పగించాడు. మనము మొదటి తిమోతిలో చూసాము. వాళ్ళు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేటువంటిది కూడా మూడవ అధ్యాయంలో మనం చూసాము.
అంతేకాదు, సంఘాన్ని ఎప్పుడూ కూడా కుటుంబాలు నడిపించకూడదు. ఒక కుటుంబం నడిపించకూడదు. భర్త, భార్య, కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, మనవడు, మనవరాలు అలా నడిపించడం బైబిల్ లో లేదు.
దేవుని వాక్యానుసారంగా అది రాంగ్. అలా నడిపించకూడదు. సంఘాన్ని పరిశుద్ధులైన పెద్దలు నడిపించాలి అనేటువంటిది మనం న్యూ టెస్టమెంట్ లో చాలాసార్లు చూసాము.
అంతేకాదు, ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. అదేంటంటే, ఒక వ్యక్తి ఒక పెద్ద చేతుల్లో దేవుడు సంఘాన్ని పెట్టలేదు. పెద్దలు అనేటువంటి మాట మనం మరల మరల దేవుని వాక్యంలో చూస్తాం.
దాన్ని మనము ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్ షిప్ అంటాం. ప్లూరల్ అంటే అర్థం ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ. సో సింగులర్ అంటే ఒకళ్ళు, ప్లూరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ.
సో ఈ ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్ షిప్ అనేటువంటిది మనము బైబిల్ లో ఎటువైపు వెళ్ళినా కూడా పెద్దలను మనం చూస్తాము. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, అపోస్తుల కార్యాలు గ్రంధం గ్రంధంలో కాదు.
ఇక్కడ మాత్రమే కాదు, మనము యాకోబు పత్రికకు వెళ్ళిన ప్రతి పత్రికలో కూడా మనం గమనించేది ఏంటంటే, సంఘాలను నడిపించే బాధ్యత దేవుడు పెద్దలకు అప్పగించాడు.
సో ఇంత అండర్స్టాండింగ్ చాలు. ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే మొదటి పేతురు ఐదవ అధ్యాయం చదవండి.
సో మీకు క్లారిటీ వస్తది. సో పెద్దలు అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేటువంటిది స్పష్టత మీకు వస్తది.
సో టైం తీసుకొని మీరు చదివితే గనుక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా సంఘాలు న్యూ టెస్టమెంట్ ప్రకారం లేవు.
చాలా సంఘాలను కుటుంబాలే నడిపిస్తున్నారు. ఇది నేను తప్పు అని చాలాసార్లు చెప్తున్నాను. దేవుని వాక్యంలో అవకాశం వచ్చిన ప్రతిసారి చెప్తున్నాను. వాళ్లకు పరిపాలించేటువంటి అధికారం లేదు.
కుటుంబానికి సంఘాన్ని పరిపాలించే అధికారం లేదు. వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి ఆ అధికారాన్ని లాక్కొని అందరిని పక్కకు నెట్టేసి పులిపిట్ లోకి రానియకుండా వాళ్లే సంఘాలను నడిపిస్తారు.
అది న్యూ టెస్టమెంట్ లో లేదు. దేవునికి ఒకానొక రోజు వీళ్ళు తప్పకుండా లెక్క అప్పజెప్తారు. దేవుడు అంటాడు, అసలు ఇది సంఘమే కాదు, మీరు చేసింది పరిచర్య కాదు అనేటువంటిది.
వాళ్ళు ప్రభువు నోట్లో నుంచే వింటారు. ఎందుకంటే అంత స్పష్టంగా న్యూ టెస్టమెంట్ చెప్తున్నప్పుడు ఏమీ తెలియదు అన్నట్టుగా, ఏమీ పట్టించుకోనట్టుగా వాళ్ళు అలా సంఘాలకు నాయకత్వం వహిస్తూ వెళ్తున్నారు.
దయచేసి అలా చేయకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. సో ఇప్పుడు సంఘాన్ని నడిపించడం అంటే కాపరిగా ఉంటూ పెద్దగా ఉండటం అనేటువంటి చిన్న పని కాదు.
చిన్న పని కాదు, చిన్న బాధ్యత కూడా కాదు. అందరి ముందుండి నాయకుడిగా ఉంటూ, వాళ్ళ మనందరికీ కూడా దేవుని గురించి చెప్తూ, దేవుని గురించి చెప్పటమే కాదు, తన జీవితం ద్వారా దేవుణ్ణి ఎలా ప్రేమించాలో చూపిస్తూ, దేవుణ్ణి ఎలా వెంబడించాలో చూపిస్తూ ఒక మాదిరిగా మందకు మాదిరిగా ఉండగలిగిన వాడు మాత్రమే కాపరి అవుతాడు.
మాదిరిగా ఉండలేనటువంటి వాడు కాపరి కాలేడు. సో అతనికి జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ జ్ఞానం అనుభవపూర్వకముగా దేవుడితో నడిచిన అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే కాపరిగా ఉండగలడు.
అంతేకాదు, ఈ పని చాలా కష్టమైనటువంటి పని. అంత మందిని, మందంతటిని ప్రతి ఒక్కరిని, వారు ఎక్కడున్నారు, వారి ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది, వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళకున్న కష్టాలు ఏంటి, వాళ్ళు క్రీస్తు సారూప్యతలోకి మారుతున్నారా, మారట్లేదా, ఒకవేళ మారకపోతుంటే ఎందుకని మారలేకపోతున్నారు, ఒకవేళ తొందరగా మారుతుంటే వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, నిత్యము ప్రార్థన చేస్తూ, మందని కాయటం అనేటువంటి పని చాలా పెద్ద పని, చాలా కష్టమైనటువంటి పని.
అంత కష్టమైనటువంటి పని వాళ్ళు చేయటానికి ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి ఆ ఆశ చూపించారు. దేవుడు మరి వారు ఆ పని చేయటానికి కావలసిన కృప, తర్వాత ఆ వరాలను కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు.
వారికి అనుగ్రహించినప్పుడు వాళ్ళు నమ్మకంగా ఆ పరిచర్య చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా తిమోతికి ఏం చెప్తున్నాడు అంటే, తిమోతి సంఘములో ఉన్న పెద్దల విషయంలో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి అనేటువంటిది చెప్తున్నాడు.
ఏం చేయాలంట? పెద్దల విషయంలో మీరు జాగ్రత్తగా గమనించండి. 17వ వచనంలో ఏమంటాడు? బాగుగా పాలన చేయు పెద్దలను ఆ పెద్దలు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన ఆ పని మంచిగా పాలన చేసేవాడు.
ఆ మంచిగా పాలన చేయాలి అనేటువంటిది కూడా పెద్దల నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. బాగుగా పాలన చేయటం లేకపోతే, మంచిగా పాలన చేయడం అంటే ఏంటంటే, సంఘాన్ని దేవుడు ఆయన ఎలా కోరుకుంటున్నాడో అలా సంఘాన్ని నడిపించడమే.
బాగుగా పాలన చేయడం అంటే బాగుగా పాలించడం అనే మాటకు అర్థము నాయకత్వం గురించే మాట్లాడుతున్నాడు. నాయకుడిగా ఉండు, మంచిగా ఎలా పరిపాలన చేస్తాడు, మంచిగా పరిపాలన చేసేటువంటి పెద్ద ఎలా ఉంటాడు అంటే, మందతోనే ఉంటాడు.
మంద కష్టాలలో తోడుగా ఉంటాడు. వాళ్లకు దేవుని వాక్యం చెప్తాడు. నేను ఇందాక చెప్పినవన్నీ చేస్తున్నాడు అనుకోండి, అతను మంచిగా పాలన చేస్తున్నట్టే.
అది మందను విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా తిరుగుతూ, మందను వాడుకుంటూ అలా చేస్తున్నాడు అనుకోండి. అలా చేస్తున్నాడు అంటే అతను నమ్మకమైనటువంటి పాలన చేయట్లేదు.
మందని సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, పెద్దలలో పెద్దలు ఎవరైతే బాగా పాలన చేస్తున్నారో అని, అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని అనే మాట ఇక్కడ మనం చూస్తాం.
అన్నమాట మనం ఇక్కడ రెండు మాటలు మనం చూసాము. వాక్యమందును ఉపదేశమందును ఇక్కడ నిజానికి చాలా ట్రాన్స్లేషన్స్ మొదటి మాటని ఏమంటారు? ప్రీచింగ్ అని, రెండో మాటని టీచింగ్ అని ట్రాన్స్లేట్ చేసినాయి.
అన్నమాట సో మోస్ట్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ప్రీచింగ్ అండ్ టీచింగ్. ప్రీచింగ్ అనేటువంటిది మొదటి పదము, ఆ టీచింగ్ అనేటువంటిది రెండో పదము. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, చాలా సార్లు ప్రీచింగ్ టీచింగ్ అనేటువంటిది పదాలు ఎక్కడున్నాయి? పక్క పక్కనే ఉన్నాయి అని అడుగుతారు కదా.
సో ఇక్కడ మనము ఈ ట్రాన్స్లేషన్ మనం చూడొచ్చు. నిజానికి ఆ ప్రీచింగ్ అనేటువంటిది వెనకాల ఉన్న మాట అక్కడ ఉన్నటువంటి మాటే వాక్యము అనే మాట ఉంది కదా. ఆ మాటే ఉంది వెనకాల.
సో తెలుగు ట్రాన్స్లేషన్ ఆ అలానే చక్కగా వాక్యమందును అనే అనే మాట రాయటం జరిగింది. అంతేకాదు, ఉపదేశమందును అంటే దేవుని వాక్యము చెప్పటము, దేవుని వాక్యము బోధించటము, దేవుని వాక్యము నేర్పించటము, దేవుని వాక్యము వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయటము.
ఇదంతా కూడా అదేనన్నమాట. వాక్యాన్ని ఆధారం చేసుకునే తను పరిచర్య చేస్తూ ప్రయాస పడతాడంట. ఆ ప్రయాస పడేటువంటి వ్యక్తిని చూడండి. మీరు మరల చెప్తున్నాను. ఇక్కడ పౌలు ఎవరిని సన్మానించాలి అన్నాడు అంటే, లేకపోతే రెట్టింపు సన్మానమునకు యోగ్యులు అన్నాడంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని పట్టుకొని పరిచర్య చేస్తాడు, వాళ్ళకే రెట్టింపు సన్మానం అన్నాడు.
దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి పరిచర్య చేసేవాడు అసలు వాడు బాగా పాలన చేయట్లేదు. అసలు నిజానికి దేవుడు అలాంటి వ్యక్తిని అంగీకరించట్లేదు. ఇక్కడ అంతా ఫోకస్ అంతా ఎక్కడికి వస్తుంది అంటే గాడ్స్ వర్డ్ దగ్గరికి వస్తుంది.
గాడ్స్ వర్డ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు అంటే, ఎవరైతే వాక్యమందును బోధించుట యందును ఆ మాటలు మనం నాలుగవ అధ్యాయము 13 వ వచనంలో కూడా చూసాం కదా. నాలుగవ అధ్యాయం 13 వ వచనం యొక్క ఫోకస్ కూడా అదే.
నాలుగు 13 లో అంటాడు, నేను వచ్చు వరకు వాక్యము చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము అన్నాడు. సో ఫోకస్ అంతా కూడా ఎప్పుడూ కూడా ఏంటంటే, ఒక పెద్ద లేకపోతే కాపరి తన మనసంతా ఎక్కడ పెట్టుకోవాలంటే, దేవుని వాక్యానుసారంగా తన మందను పోషించాల్సిందే.
తన మందను హెచ్చరించాల్సిందే. దేవుని మందను, తన మంద కాదు, దేవుని మందను జాగ్రత్తగా నడిపించాల్సినటువంటి బాధ్యత. అయితే ఆ నేను అంటాను కాపరులు దేవుని వాక్యానుసారంగా చేయాలి.
దాంట్లో ప్రయాస అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. ప్రయాస అనేటువంటి మాట ఆ లేబర్ అనేటువంటి, లేబరింగ్, ఆర్ కష్టపడటం, ప్రయాస పడటం, చెమటోర్చడం.
చూడండి, మీ అందరికీ తెలుసు కదా, దేవుని వాక్యం చెప్పటం అనేటువంటిది ఈజీ కాదు. ఒకవేళ ఎవరికైనా ఈజీ అని అనిపిస్తే, గనుక ఒకసారి అవకాశం ఇచ్చాము అనుకోండి, వాళ్ళకి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి ప్రీచ్ చేయండి అని.
అప్పుడు తెలుస్తది ఎంత కష్టము అనేటువంటిది వాక్యం చెప్పటం. సో వాక్యము చెప్పటం, వాక్యము చక్కగా చెప్పటం, దేవుడు చెప్పమన్నటువంటి సత్యాన్ని చెప్పటం అనేటువంటిది ఈజీ కాదు.
ఈజీ కాదు. దానికి చాలా ప్రయాస అవసరము. ఇక్కడ మనం నిలబడి చెప్పేటువంటి ఒక వన్ అవర్ దేవుని వాక్యానికి అంటే నాకు నాలుగు వచనాలు వివరించడానికి దాని వెనకాల ఉన్నటువంటి కష్టము చాలా కష్టము.
సో అంత కష్టము గురించే మాట్లాడుతున్నాడు. ప్రయాస అనేటువంటి మాట వెనకాల ఉన్న మాట కష్టమే. కష్టం గురించే మాట్లాడుతున్నాడు. నిజానికి చాలా సార్లు మనకు ఏమనిపిస్తుంది అంటే కాపరి దేవుని వాక్యాన్ని పట్టుకొని దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదువుతూ, తను తన ప్రిపరేషన్ అంతా కూడా బ్లడ్ అండ్ స్వెట్ గానే ఉంటది అన్నమాట.
రక్తము చెమట లాగానే ఉంటది. చాలా కష్టపడాలి, చాలా ఆలోచించాలి, అన్ని వైపులా నుంచి ఆ టెక్స్ట్ ని చూడాలి. ఇదంతా కూడా చాలా ప్రయాసతో కూడినటువంటిది.
అయితే, ఆయన ఏమంటున్నాడు అంటే తిమోతి ఎవరైతే మంచిగా పరిపాలన చేస్తారో, వాక్యానుసారంగా పరిపాలన చేస్తారో, పాలన చేస్తారో, వాళ్ళు ప్లస్ ప్రాముఖ్యంగా వాళ్ళలో కూడా అంటే ఎవరైతే పెద్దలు ఉన్నారో, పెద్దలందరూ నిజంగా వాక్యోపదేశకులు అయి ఉండాలి.
కానీ పెద్దలలో లో కూడా పెద్దలందరూ రెగ్యులర్ గా ప్రీచ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీచ్ చేయగలిగిన వాళ్ళు అయి ఉండాలి. పెద్దలందరూ అది ఒక క్వాలిఫికేషన్.
కానీ ఎవ్రీ వీక్ అందరూ ప్రీచ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ గా ప్రీచింగ్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన యూనిక్ గిఫ్ట్. దేవుడు పరిశుద్ధాత్ముడు ఎవరికో ఆ పెద్దల్లోనే కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు.
వాళ్ళ మేజర్ డ్యూటీ ఆర్ వాళ్ళ మేజర్ వర్క్ దేని మీద ఉంటది అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వివరించడం మీద ఉంటది. సో వాళ్ళు ప్రయాస పడతారు.
వాళ్ళు ప్రయాసపడినప్పుడు ఏమంటున్నాడు అంటే తిమోతికి ఏం చెప్తున్నాడు అంటే, తిమోతికి ఎవరైతే వాళ్ళు ప్రయాస పడతారో, ఉపదేశము యందు వాక్యము యందు వారికి రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను అనే మాట అన్నాడు.
అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ ప్రయాసను మీరు గుర్తించాలి. వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించాలి. అందులో ప్రాముఖ్యంగా దేవుడి యొక్క వాక్కును పట్టుకొని, అటు ఇటు తిరగకుండా, తన ఇష్టం వచ్చినటువంటి కథలు చెప్పకుండా, తనకు మనసులో ఏమనిపించింది చెప్పకుండా, తన అనుభవాల వైపు వేరే అనుభవాల వైపు వాళ్ళని వెళ్ళనివ్వకుండా, చక్కగా దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తున్నాడు.
కాబట్టి నమ్మకంగా పని చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులను ఎవరైతే దేవుని వాక్యం విషయంలో ప్రాముఖ్యంగా ప్రయాస పడతారో, అలాంటి వ్యక్తులకు ఏం చేయమంటున్నాడు? రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను.
దే డిసర్వ్. దే మస్ట్ బి కన్సిడర్డ్ వర్తి ఆఫ్ డబుల్ ప్రైజ్ అనేటువంటి మాట మనము ఇంగ్లీష్ టెక్స్ట్ లో చూస్తాం.
ఇప్పుడు చూడండి, రెట్టింపు సన్మానము అన్నాడు కదా. సన్మానము అంటే మనము హానర్ అనే మాట అంటాం కదా. హానరింగ్, గౌరవించటము.
మనకు హానర్ అంటే అర్థం ఏంటి? గౌరవించడం. సన్మానము అనే మాట ఇక్కడ తెలుగులో అనువాదం చేశాడు కదా. వాళ్ళనంట గౌరవించాలంట.
గౌరవించాలంట. ఈ సన్మానించడం అనేటువంటిది మనము ముందు అర్థం చేసుకుందాం. తర్వాత రెట్టింపు సన్మానం అంటే ఏంటో చూద్దాము.
చూస్తే మనకి క్లారిటీ వస్తది. సన్మానము అనేటువంటిది జనరల్ గా నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. సన్మానించాలి వాక్యోపదేశకుడిని లేకపోతే దేవుని వాక్యాన్ని బోధించేటువంటి కాపరిని.
కాపరులను మీరు సన్మానించాలి అంటే సహజంగా సంఘాలలో ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక సెల్వ లాంటిది కప్పి, ఒక బొక్కే వాళ్ళ చేతిలో పెట్టి, మేము మేము పాస్టర్ గారిని సంవత్సరానికి ఒకసారి సన్మానిస్తాము.
ఇదిగో, ఈ వారము పాస్టర్స్ అప్రిసియేషన్ మంత్. ఈయన మంత్ లో మేము పాస్టర్ గారిని సన్మానిస్తాము అని చెప్పి సన్మానిస్తారు కదా.
నిజానికి అసలు దానికి ఇక్కడ ఈయన మాట్లాడుతున్న దానికి ఏ సంబంధం లేదు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సన్మానము ఆ సన్మానం కాదు. ఆ సన్మానం గురించి మాట్లాడట్లేదు.
ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, ఈ సన్మానము లేకపోతే గౌరవము అనేటువంటిది రెట్టింపులో ఇవ్వాలా అంటున్నాడు. రెట్టింపే కదండీ.
రెట్టింపు అంటే రెండంతలు. మామూలుగా అయితే ఒకంత కాదు. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ప్రయాస పడుతున్నారో, కష్టపడుతున్నారో, వీళ్ళకి రెండంతల సన్మానము.
వీళ్ళు యోగ్యులు అని చెప్తున్నాడు కదా. నేను అనుకుంటాను, రెండంత అంటే డబుల్. డబుల్ అంటే మామూలు దానికన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా పోర్షన్ అన్నమాట.
మామూలుగా ఇచ్చే దానికంటే, లేకపోతే మామూలుగా వాళ్ళు పొందే దానికన్నా కూడా డబుల్. ఇప్పుడు ఏంటి? అది ఇచ్చేది ఏంటి, పొందేది ఏంటి?
ఇప్పుడు సన్మానము అనే మాట వాడినప్పుడు, వాళ్ళని చాలా గౌరవించాలా? సంఘము అంటే ఓ ఈ మా కాపరి చాలా ప్రయాస పడుతున్నాడు, కష్టపడుతున్నాడు కాబట్టి సంఘము ఎదుట, సంఘం అందరూ కూడా సంఘము ఎదుట కూడా ప్రతి వ్యక్తి కూడా ఆయనను చాలా గౌరవంగా చూడాలా, గౌరవించాలా?
అదే నా ఇక్కడ చెప్తున్నట్టు ఏంటి? అసలు రెట్టింపు సన్మానం అంటే లేకపోతే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, గనక ఉదాహరణకి శాలరీ ఒక 10000 ఇచ్చారు అనుకోండి.
ఈయనకి 20000 ఇవ్వాలా? రెట్టింపు సన్మానం అంటే ఏంటి? ఒకవేళ సన్మానం అనేటువంటిది మనము ఆయన రెమునరేషన్ అనుకున్నాం అనుకో.
ఆండ్రోరియం లేకపోతే రెమునరేషన్ అని అనుకున్నాం అనుకోండి. ఆయన కష్టపడిన దానికి ప్రతిఫలంగా సంఘము ఆయనకి ఇవ్వాల్సింది.
ఆ సంఘంలో ఉన్నటువంటి పని చేసేటువంటి కాపరులకు, మిగిలిన ఫుల్ టైం పాస్టర్స్ కి గనుక ఒక పది వేల రూపాయలు జీతం ఇస్తే, ఈయనకి 20 వేల రూపాయలు ఇవ్వాలన్నా.
దాని అర్థం ఏంటి? రెట్టింపు సన్మానం అంటే ఏంటి? రకరకాలుగా దీనికి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కానీ నేను ఆ ఇంటర్ప్రిటేషన్స్ ఏంటో చెప్పి నేనేం నమ్ముతున్నాను చెప్తాను.
ఆ ఎందుకంటే మన చర్చిలో వాక్యం చెప్పేది నేనే కాబట్టి. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు కాబట్టి నేను అర్థం ఏంటో చెప్తాను.
అర్థం ఏంటో చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ డబల్ హానర్ అంటే అర్థము ఏంటి? అని అంటే కొంతమంది ఏమంటారు అంటే అవును, కాపరి ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి, లేకపోతే వాక్యము బోధించుట యందు ఆయన చాలా కష్టపడతా ఉన్నాడు కాబట్టి, మీరు అందరికి ఇచ్చేటువంటి శాలరీ కన్నా కూడా ఆయనకు డబల్ శాలరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక ఇంటర్ప్రిటేషన్.
దీనికి ఇంటర్ప్రిటేషన్ నిజానికి ఇక్కడ జీతము గురించే మాట్లాడుతుంది. సన్మానం అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్లవర్స్ ఇచ్చి శాలువ కాపడం గురించి కాదు.
తర్వాత వచనం మనకు అర్థమవుతుంది. 18వ వచనం చదవగానే మనకు వెంటనే అర్థమవుతుంది. ఈయన మాట్లాడుతున్నటువంటిది ఆయనకు ఇవ్వాల్సినటువంటి జీతం గురించే మాట్లాడుతున్నారు.
లేకపోతే జీతం అనండి, సపోర్ట్ అనండి, మీరు ఏమైనా అనండి, దాన్ని అంటే ఆయన బతకడానికి, ఆయన జీవించడానికి ఆయనకు కావాల్సినటువంటి ఆర్థిక అవసరత గురించే మాట్లాడుతున్నాడు అనేటువంటిది 18వ వచనంలో మీకు అర్థమవుతుంది.
అందుకే కొంతమంది ఏమంటారంటే, ఈ వచనాన్ని రెట్టింపు అంటే రెండు పోర్షన్స్ టు పోర్షన్స్ ఆయనకి ఇవ్వాలి అనేటువంటిది ఇంటర్ప్రిటేషన్ ని అలా ఇంటర్ప్రెట్ చేస్తారు.
ఇంకొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు బై వోకేషనల్ పాస్టర్స్ ఉంటారు కదండీ. బై వోకేషనల్ అంటే అర్థం ఏంటంటే, నేను గనుక ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి. ఉదాహరణకి నేను గవర్నమెంట్ టీచర్ ని అనుకోండి.
నేను గవర్నమెంట్ టీచర్ అయినప్పుడు నాకు ఒక శాలరీ వస్తుంది. ఆల్రెడీ ఒక శాలరీ ఆల్రెడీ నాకు వస్తుంది. సో ఇప్పుడు ఒక శాలరీ వస్తుంది కాబట్టి ఈయనకి ఇంకా శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
మాక్సిమం ఎంత మనం ఈయన వాడుకోగలిగితే, సంఘంలో అంత వాడుకుందాము. ఈయనకి ఏమి ఒక రూపాయి కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనకుండా, ఆయన అక్కడ శాలరీ తీసుకుంటున్నాడు.
ఓకే, ఇక్కడ సంఘం కూడా ఈయనకి శాలరీ, ఆయన కష్టపడినందుకు శాలరీ పే చేస్తే గనుక, అప్పుడు ఏమవుతది? డబల్ ఆనర్ అవుతాయి అంటే రెండు ఇన్కమ్స్ ఉంటాయి అనేటువంటిది ఒక ఇంటర్ప్రిటేషన్.
రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చెప్తున్నాను. నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ నేను ఏది నమ్ముతానో చెప్తాను. నేను ఏది నమ్ముతానో చెప్తాను.
స్ట్రైట్ గా మనం నెక్స్ట్ వచనంలోకి వెళ్ళిపోదాం. నేను ఏమనుకుంటాను అంటే, ఎవరైతే వాక్య పరిచర్య చేస్తున్నారో, సంఘానికి నమ్మకంగా చేస్తున్నారో, వాళ్ళని సంఘము గౌరవించాలి.
నిజానికి నాకు ఈ మాట చెప్తున్నప్పుడు, మన చర్చిలో నన్ను ఎలా గౌరవిస్తారో, అలా అన్ని సంఘాల్లో కాపరిని గౌరవించాలి.
సో మీరు నన్ను చాలా గౌరవిస్తున్నారు. ఆ ప్రతి ఒక్కరు కూడా చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి వరకు నాకు చాలా గౌరవం ఇస్తున్నారు. నన్ను సన్మానిస్తున్నారు, గౌరవిస్తున్నారు.
అదే విధముగా ప్రతి సంఘంలో కూడా కాపరిని ఎలా పడితే అలా మాట్లాడకుండా, ఏది పడితే అది మాట్లాడకుండా, కాపరిని హేళన చేయకుండా, కాపరి అనేటువంటి ఆ గౌరవంతో కూడినటువంటి భయముతో మాట్లాడుతుంటాం కదా.
అయితే, ఆయన విషయం వచ్చేటప్పటికి మనము మన తండ్రికి లేకపోతే తల్లికి ఎలాంటి గౌరవం ఇస్తామో, ప్రాబబ్లీ అంతకన్నా ప్రాముఖ్యంగా ఆయనకు గౌరవం ఇవ్వటం మంచిది. ఎందుకంటే ఆయన నిత్యజీవం వైపు, దేవుని వైపు నడిపించడానికి ఆయన ప్రతి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి.
అయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమకు రిఫ్లెక్షన్ ఏంటంటే మనం ఆయన్ని గౌరవించడం. అది మొదటిది. మరి రెండంతలు అని ఉంది కదా.
రెండోది ఏంటి? రెండో సైడ్ ఏంటి? దీనికంటే రెండో సైడ్ ఏంటంటే, రెండో సైడు ఆయన అవసరాలన్నీ జాగ్రత్తగా చూడటం. ఆయన అవసరాలన్నీ జాగ్రత్తగా చూడటం.
అక్కడ కూడా గౌరవించాలి అంటే ఒక సైడ్ ఆయనను ఎదురుగా ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు ఆయనను గౌరవించడం ఒకటైతే, రెండో సైడ్ ఏంటంటే ఆయన అవసరాలన్నీ కూడా మనము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తీర్చాల్సినటువంటి అవసరము ఉందనేటువంటిది.
నేను నమ్ముతాను, గలతీయులకు రాసిన పత్రికలో దగ్గర దగ్గర ఇలాంటి మాటే అంటాడు. ఆ మాట ఆరవ అధ్యాయంలో మనం చాలాసార్లు చదివినటువంటి మాటే.
మనము ఆరవ అధ్యాయం ఎంత అండి? ఆరవ వచనం. వాక్యోపదేశము, ఆ పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వడు. మీ అందరికీ తెలిసిన వచనమే.
నేను తర్వాత తర్వాత ఇంకొక మాట ఉంది. వాక్యోపదేశము, పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో భాగమివ్వడు. నేను ఎక్స్పోజిషన్ చేయాల్సిన అవసరం లేదు.
మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి వచనమే. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే మరల మరల మనకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ప్రయాస పడుతున్నాడో వాక్యం చెప్పడానికి, మీరు ఆయన అవసరాలన్నీ జాగ్రత్తగా చూసుకోండి.
అంతేకాదు, ఆయనను పర్సన్ గా కూడా, వ్యక్తిగా కూడా, మీరు ప్రతి ఒక్కరు ఆయనను గౌరవించాలి, సన్మానించాలి. తల్లిని తండ్రిని సన్మానించినట్టు, గౌరవించినట్టు, మీరు ఆయనను గౌరవించాలి.
నాకు ఈ రెండు సైడ్స్ ఏ కనపడుతున్నాయి. ఈ రెండు సైడ్స్ కనపడకుండా ఎక్స్ట్రా జీతం ఇవ్వాలి అనేటువంటిది నాకు కనిపించట్లేదు.
సో అలాంటిది నాకేం కనిపించట్లేదు. సో నాకు కనిపిస్తున్నటువంటి రెండంతల గౌరవం ఏంటంటే, గౌరవము లేకపోతే సన్మానం ఏంటంటే, ఆయనను ఎదురుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా గౌరవిస్తూ, ప్లస్ ఆయన అవసరం అన్నిటిని కూడా తీర్చే విధంగా సంఘము ఉండాలి అనేటువంటిది నేను నమ్ముతా ఉన్నాను.
సో ఆరు 17. సో దీనికి రెండో సైడ్ చెప్పాను కదా. మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి పాస్టర్ గారికి అనేటువంటిది ఆ మాటకి సపోర్టింగ్ గా 18వ వచనం మాట్లాడుతుంది.
చూడండి, 18వ వచనంలో మనం ఏం చూస్తాము. ఇందుకు నూర్చిడి యొద్దు మూతికి చెక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు.
మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. సో ఇప్పుడు చూడండి, ఇది ఆర్గ్యూ చేస్తుంది. ఏంటి అనేటువంటిది మనం అంటే 17వ వచనం చెప్తుంది.
ఏంటి 17వ వచనం ఏం చెప్తుందో మీ అందరికీ అర్థమైంది. పనివాడు జీతమునకు పాత్రుడు అంటే అర్థం ఏంటి? షాల్వ కాపాలనే కాదు కదా.
దాని అర్థం ఏంటంటే, ఆయన కష్టపడి పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకు కావాల్సినటువంటి అవసరాలు అన్నీ కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత సంఘానిది. అంతే కదండీ.
దాని మీనింగ్ అయితే అంతకు మించి వేరే మీనింగ్ ఏం లేదు. అంతే కదా. అక్కడ పైన ఒక ద్వితీయోపదేశ కాండం 25 వ అధ్యాయం నాలుగవ వచనం కోట్ చేశాడు.
డ్యూట్రానమీ చాప్టర్ 25 ఫోర్. మీరు చదవండి ఈ కోట్ ని. నేను అంటే మీరు ఇంటి దగ్గర అయినా చదవగలరు. సో 25 వ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ మాట ఉంటది.
ఏమని ఉంటది అంటే ఎగ్జాక్ట్ గా దగ్గర దగ్గర అదే ఉందన్నమాట. ఏమని ఉంటది అంటే ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. అదే ఉంది కదా 25 నాలుగు లో.
25 నాలుగు ఎగ్జాక్ట్ గా ఏముందో అదే ఉంది. అందుకే ఇక్కడ అని లేఖనము చెప్పుచున్నది అంటాడు. ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నాడు ఇక్కడ కోట్ చేస్తున్నాడు.
ధర్మశాస్త్రం కూడా చెప్తుంది అదే. ధర్మశాస్త్రంలో కూడా ఎవరైతే కష్టపడుతున్నారో అనిమల్ గురించి చెప్తున్నాడా. ఇక్కడ అనిమల్ ఫోకస్ అనేటువంటి మాట పౌలు మాట్లాడుతాడు.
మనం అది చూద్దాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అంటే అర్థం ఏంటి?
చూడండి, మీరు నూర్చెడి ఎద్దు గురించి నేను మీకు వ్యవసాయం తెలియకపోతే, ప్రాబబ్లీ నేను మీకు చెప్పాలి. వ్యవసాయం తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు.
పంట కోతకు వచ్చిన సమయంలో, పంటను కోసి ఒకచోటకు తీసుకొస్తారు. ఒక చోటకు తీసుకొచ్చి దాన్ని కుప్పలాగానో ఎక్కడో పెడతారు. పెట్టినప్పుడు కొంత డ్రై అయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత, దాంట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వేరు చేయడం కోసం మనము ఒక సర్క్యులర్ షేప్ లో వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక కళ్ళం అనేటువంటిది దాంట్లో పెట్టి, ఈ కోత అంతా కూడా దాంట్లో పెట్టి, దాని మీద సర్క్యులర్ గా చుట్టూ తిరిగే విధంగా మనము ఎద్దులనో లేకపోతే ఆవులనో కడతాం కదా.
కట్టినప్పుడు అవి ఆ గింజల మీద నడుస్తూ తిరుగుతుంటాయి. దాన్ని నూర్చడం అంటాం కదా. ఆ నూర్చెడి అనే మాట కింద పుట్టిన నోటి ఏమని ఇచ్చాడు? ఆ కళ్ళము తొక్కుచున్నంతే కదా.
నేను అదే అన్నాను. కళ్ళము తొక్కుచున్న ఎద్దులు, ఎద్దులు, ఒక ఎద్దా, రెండు ఎద్దా, మూడు ఎద్దులు, ఎన్ని ఎద్దులు అనేటువంటివి.
బట్ అవి సర్క్యులర్ గా తిరుగుతుంటాయి. సర్క్యులర్ గా తిరుగుతుంటాయి. అవి కష్టపడుతున్నాయి. ఎందుకు కష్టపడుతున్నాయి? అవి తిరగటం వల్ల ఏం జరుగుతుంది?
తిరగటం వల్ల ఏం జరుగుతుంది అంటే వాటి బరువుకి ఆ గింజలు ధాన్యము వేరైపోతుంది. ధాన్యం వేరైపోవడం వల్ల ఆ పొట్టు తర్వాత మిగిలింది అంతా కూడా వేరు చేయబడి ధాన్యం పక్కకు రావడం కోసం అవి తిరుగుతున్నాయి అన్నమాట.
మరి అవి తిరుగుతా ఉన్నప్పుడు, కష్టపడి పని చేస్తా ఉన్నప్పుడు, వాటికి అవి ఏ గడ్డినైతే తొక్కుతున్నాయో ఆ గడ్డిని తినే అధికారం వాటికి ఇవ్వాలి. ఎందుకంటే అవి కష్టపడుతున్నాయి కదా.
నీ కష్టపడి నీ కోసం పని చేస్తున్నప్పుడు, అవి తిరుగుతా ఉన్నప్పుడు, ఉదయము తెల్ల కొన్నిసార్లు, తెల్లవారు జామున ఐదు గంటలకు, ఎప్పుడో మొదలు పెడతాయి తిరగటం. అవి 11 గంటల వరకు, 10 గంటల వరకు తిరుగుతా ఉంటాయి.
ఒక ఐదు గంటలు ఎంతో బాగా ఎండ వచ్చేంత వరకు తిరుగుతా ఉంటాయి. తిరుగుతా ఉన్నప్పుడు వాటికి ఫుడ్ పెట్టకుండా, నువ్వు కళ్ళెం కడతావా? కళ్ళెం అంటే ఏంటంటే, మూతికి ఫుడ్ లోపలికి వెళ్లకుండా, దాని నాలుక బయటికి రాకుండా కట్టేస్తాం కదా.
అది నువ్వు కట్టేసావు అనుకో. కట్టేసావు అంటే అర్థం ఏంటి? చాలా క్రూరమైన హృదయం ఉంది నీకు. మామూలు హృదయం కాదన్నమాట.
అంటే నువ్వు ఏ ఎద్దునైతే వాడుకుంటున్నావో, నీ ధాన్యాన్ని వేరు చేయడానికి, నీ ధాన్యాన్ని భద్రం చేసుకోవడానికి, ఏ ఎద్దునైతే వాడుకుంటున్నావో, ఆ వేస్ట్ ని కూడా తిననివ్వవు అని అంటున్నావు.
నువ్వు అది వేస్టే, నిజానికి ఆ గడ్డే కదా. మిగిలింది ధాన్యం అంతా నువ్వే తీసుకుంటున్నావ్. ప్రాబబ్లీ ధాన్యం ఏమి తినవు. అవేందంటే గడ్డే తింటాయి.
ఆ ఎండు గడ్డిని కూడా వాటిని తిననీయకుండా నువ్వు కళ్ళెం కట్టావంటే, అంటే అర్థం ఏంటంటే, నువ్వు చాలా దారుణమైనటువంటి వ్యక్తివి. అందుకే దేవుడు ఏం చేశాడు?
చూడండి, దేవుడు ఎలా వీటిని అనిమల్స్ ని కూడా ఎలా భద్రం చేశాడో చూడండి. అవి కష్టపడుతున్నప్పుడు వాటికి తినే అధికారము ఉంది కాబట్టి, అవి తినేటప్పుడు మీరు వాటి కళ్ళము కట్టొద్దు. కట్టొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది.
కట్టొద్దు అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. నిజానికి పౌలు ఇంకో చోట చెప్తాడు. ఇదే కాంటెక్స్ట్ దగ్గర దగ్గర ఇదే సందర్భము. ఇంకో చోట కూడా మాట్లాడుతాడు.
మొదటి కోరింథీయులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము. మనము తొమ్మిదవ అధ్యాయం మొత్తం చాలా వరకు టాపిక్ ఇదే. టాపిక్ ఏంటంటే, ఆ మేము మాకు తినుటకు అధికారం లేదా లేకపోతే తాగుటకు అధికారం లేదా అని మాట్లాడుతాడు.
మేము అపోస్తులం కాదా? మేము తొమ్మిదవ అధ్యాయం అంతా చదవండి. నేను అంతా చదవట్లేదు. మన కాంటెక్స్ట్ కోసం ఆ ఇక్కడ మాట్లాడదాం.
నేను తొమ్మిదవ అధ్యాయము ఆ ఐదవ వచనం దగ్గర మొదలు పెడతాను. తినుటకును తాగుటకును మాకు అధికారం లేదు. తక్కిన అపోస్తుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలనను కేఫా వలనను విశ్వాసురాలైన భార్యను వెంటపెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా?
మరియు పని చేయకుండుటకు నేనును బర్నబు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయనా? ఎవరైనా చేస్తాడా? అండి, సొంత ఖర్చు పెట్టుకొని దండులో పని చేస్తాడా?
ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడు ఎవడు? మందను కాచి, మందను పాలు తాగని వాడు ఎవడు? అసలు పాయింట్ అంతా అదే. మందను కాచి, మంద పాలు ఎవరు తాగకుండా ఉంటారు?
లేకపోతే, ద్రాక్ష తోట వేసి, ద్రాక్ష ఫలం ఎవరు తినకుండా ఉంటారు? లేకపోతే, సొంత ఖర్చు పెట్టుకొని ఎవరైనా దండులో పని చేస్తాడా? ఎనిమిదవ వచనం.
ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచు ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నదా అని ఏమన్నాడు ఇక్కడ తొమ్మిదవ వచనంలో. ఆ కళ్ళెము తొక్కుచున్న ఎత్తుమూతికి చిక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది.
దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా అని క్వశ్చన్ మార్క్ అడిగాడు. చూసారా అండి? అంటే ఇది ఎడ్ల గురించేనా చెప్తుంది? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను.
ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను. కళ్ళము తొక్కించి వాడు పంటలో పాలుపొందునను ఆశతో త్రొక్కింపవలెను. కాబట్టి మీకు విషయం అయితే అర్థమైంది.
విషయం ఏంటంటే ఏమంటున్నాడు అంటే, పరిచర్యలో ఉన్నప్పుడు కాపరి యొక్క అవసరాలు లేకపోతే, పరిచారకుడి యొక్క అవసరాలు లేకపోతే, మిషనరీ యొక్క అవసరాలు.
ఇప్పుడు వాళ్ళు మిషనరీస్. ఆ కాంటెక్స్ట్ ఏంటంటే పౌలు బర్ణబాలు ఎవరు మిషనరీస్. అంతియొక్క సంఘం పంపించింది. అంతియొక సంఘం సపోర్ట్ చేసి పంపించింది.
సో మిగిలిన సంఘాలను అన్ని స్థాపించడానికి వీళ్ళు వాళ్ళ జీవితాలు పెట్టి పరిగెత్తుకుంటూ తిరిగారు. అనేక చోట్లకు ఆపదల్లో తిరిగారు. తిరిగి ఏమంటారంటే, అంటే మాకు అధికారం లేదా?
మేము మీ వద్ద నుండి ఆర్థికమైన సహాయం మేము పొందటానికి యోగ్యులం కాదా అనేటువంటిది ఆర్గ్యుమెంట్ అక్కడ. సో అదే విషయము మనం ఇక్కడ చూస్తాం అన్నమాట.
ఏంటంటే పౌలు ఎవరైతే బాగుగా పాలన చేస్తూ, మరి విశేషంగా వాక్యం యందు ప్రయాస పడుతున్నారో, మీరు వాళ్ళ కష్టాన్ని చూడండి.
వాళ్ళ కష్టానికి ప్రతిఫలము మీరు ఇవ్వటానికి ప్రతి ప్రయత్నం చేయండి. వాళ్ళని మీరు ఆపొద్దు అనేటువంటిది బేసికల్ గా అక్కడ చెప్తున్నటువంటి పాయింట్ అన్నమాట.
ఇక్కడ లేఖనము చెప్పుచున్నది అనే మాట మీ అందరికీ తెలుసు. నేను లేఖనం కూడా చూపించాను మీకు. ద్వితీయోపదేశ కాండం 25 వ అధ్యాయం నాలుగవ వచనం కదా ఇక్కడ.
మరియు అని ఇంకొక మాట, ఇంకొకటి కోట్ చేశాడు కదా. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు తన జీతమునకు పాత్రుడు.
ఈ మాట నిజానికి ఓల్డ్ టెస్టమెంట్ నుంచి రావట్లేదు. ఈ మాట పనివాడు తన జీతమునకు పాత్రుడు అనేటువంటిది ఓల్డ్ టెస్టమెంట్ కోర్ట్ కాదు. ఇది న్యూ టెస్టమెంట్ కోర్ట్.
న్యూ టెస్టమెంట్ కోర్ట్. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, కొత్త నిబంధన అప్పటికి ఇంకా రాయబడలేదు కదా. అంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఈయన రాస్తా ఉన్నప్పుడు న్యూ టెస్టమెంట్ రైటింగ్ అవ్వలేదు.
న్యూ టెస్టమెంట్ రైటింగ్ అవ్వకుండానే మరి న్యూ టెస్టమెంట్ ని ఎలా కోట్ చేశాడు ఇక్కడ? ఈయన అనేటువంటిది చాలాసార్లు మాట్లాడుతుంటారు, డిస్కస్ చేస్తుంటారు.
నిజానికి ఈ మాట ప్రభువే అన్నాడు. ఇది లార్డ్ జీసస్ క్రైస్ట్ నోట్లో నుంచి వచ్చినటువంటి మాట. పనివాడు జీతమునకు పాత్రుడు అనేటువంటిది ఆయన లూకా సువార్త 10వ అధ్యాయం ఏడవ వచనంలో.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నటువంటి మాట. అది ఆయన ఏ కాంటెక్స్ట్ లో అన్నాడు? ఏ కాంటెక్స్ట్ లో అన్నాడు అంటే, ఆయన శిష్యులను సువార్త పని కోసం పంపిస్తూ కోత విస్తారంగా ఉంది.
కోయువారు లేరు, మీరు ప్రభువుని అడగండి అని చెప్పి వాళ్ళని పంపిస్తూ, ఏమంటాడంటే, మీరు వెళ్ళండి, ప్రతి ఊర్లోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి.
మీరు వెళ్ళినప్పుడు, ఎవరో ఒకళ్ళింట్లో ఉండండి. ఉండినప్పుడు వాళ్ళు మిమ్మల్ని పోషిస్తారు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే మీరు పనివాడిగా వెళ్తున్నారు.
పనివాడు జీతమునకు పాత్రుడు అని ప్రభువు అన్నటువంటి. మీరు చూడండి, జస్ట్ అంటే నిజంగానే ఇది న్యూ టెస్టమెంట్ టీచింగ్ అనేటువంటిది.
మీకు అర్థం కావాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంది కదా. 10వ వచనం ముందు తొమ్మిదవ వచనంలో అంటాడు.
10వ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణం కొరకు జాలినైనను, రెండు అంగీలనైనను, చెప్పులనైనను, చేతి కరనైనను సిద్ధపరచుకొనుడు పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా.
ఇది లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క మాటలు. అవి ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు. మనం లూకా సువార్త 10 అధ్యాయంలో కూడా మనము ఇదే చూస్తాం.
10వ అధ్యాయము ఏడవ వచనంలో మనం వినేటువంటి మాట ఇదేనన్నమాట. ఆయన 10వ అధ్యాయం రెండవ వచనంలో అంటాడు, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమందే.
కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివానిని పంపనమని వేడుకొనుడి అని చెప్తూ 10వ అధ్యాయం రెండవ వచనంలో కిందకి వచ్చేటప్పటికి, ఏడవ వచనంలో అంటాడు, వారు మీకు ఇచ్చు పదార్థములను తినుచు, త్రాగుచు, ఆ ఇంట్లోనే ఉండుడి.
పనివాడు జీతమునకు పాత్రుడు. అంతే కదా. అంటే అర్థం ఏంటి? నువ్వు పని చేస్తున్నావు. దేవుడు దేవుని కోసం పని చేస్తున్నావు.
దేవుని రాజ్యం కోసం పని చేస్తున్నావు. దేవుడు చూసుకుంటాడు, పోషించడం అనేటువంటిది కాకపోతే, నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి, నువ్వు దానికి ప్రతిఫలమునకు నువ్వు పాత్రుడవు అని లార్డ్ జీసస్ క్రైస్ట్ టీచింగ్ లోనే మనం చూస్తాం.
ఇప్పుడు మీరు చూడండి, జాగ్రత్తగా న్యూ టెస్టమెంట్ రాస్తా ఉన్న టైం లోనే ఆల్రెడీ లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క టీచింగ్స్ అనేటువంటివి అందరికీ స్ప్రెడ్ అయినాయి.
స్ప్రెడ్ అవ్వడం మాత్రమే కాదు, వాళ్ళు లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క టీచింగ్ ని ఎలా చూస్తున్నారు అంటే ఓల్డ్ టెస్టమెంట్ లెవెల్ లోనే చూస్తున్నారు.
ఓల్డ్ టెస్టమెంట్ ఎలాంటి అధికారం కలిగి ఉందో, ఎలాంటి అథారిటీ కలిగి ఉందో, న్యూ టెస్టమెంట్ కి కూడా సేమ్ అథారిటీ ఉంది. పర్టికులర్ గా ప్రభువు యొక్క నోట్లో నుంచి వచ్చినటువంటి మాటల్ని ఇక్కడ పౌలు కోట్ చేస్తూ ఏమంటాడు అంటే, పనివాడు జీతమునకు పాత్రుడు.
సో 18వ వచనం 17వ వచనం మీద క్లారిటీ ఇచ్చింది కదా. సన్మానము అంటే ఏంటి? సన్మానమునకు పాత్రుడు అన్నాడు కదా. సన్మానం అంటే ఏంటి?
సన్మానం అంటే ఏంటంటే, ఎవరైతే కష్టపడుతున్నాడో, ఆయనను మీరు జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే, వాళ్ళ అవసరాలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంతే. అంతకు మించి నేను అనుకుంటాను ఏం లేదు.
దాని మీనింగ్ అంటే ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి, కష్టానికి ప్రతిఫలము మీరు ఇవ్వాలి అనేటువంటిది పాయింట్ అక్కడ చెప్తున్నాడు.
సో నేను అనుకుంటాను ఫోర్స్ అంతా మనకు అర్థమైంది. ఆయన ఎందుకు కోట్ చేశాడు ఆ రెండు వచనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటిది కూడా మీకు అర్థమైంది.
సో మీరు ఓల్డ్ టెస్టమెంట్ నుంచి, ద్వితీయోపదేశ కాండం 25 వ అధ్యాయం నుంచి వచ్చింది. అంతేకాదు, మ్యాథ్యూ 10 అండ్ ఆల్సో లూకా 10 నుంచి వచ్చిందన్నమాట.
19వ వచనం నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు అయిపోయింది ఈ పాయింట్. అయిపోయింది ఏ పాయింట్? మీరు వాళ్ళని రెట్టింపు సన్మానమునకు పాత్రులు అని చెప్పి ఏమన్నాడంటే, ఆ సన్మానము ఎలా ఉండాలి అనేటువంటిది కూడా చెప్పాడు.
గౌరవంతో పాటు, వాళ్ళ అవసరాలు చూసుకోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత 19వ వచనానికి వచ్చాడు. 19వ వచనంలో ఈ మాట అంటాడు.
ఏమంటాడంటే, ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము. అంగీకరింపకుము.
మీరు జాగ్రత్తగా ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా గమనించండి. కేర్ఫుల్ గా వినటానికి ప్రయత్నం చేయండి. ఆ మీరు బైబిల్ లో ఆ ఎప్పుడైనా కూడా దేవుడు లీడర్షిప్ ని రైస్ చేసినప్పుడు, ఆ లీడర్షిప్ మీద సణిగే వాళ్ళు చాలా మంది ఉంటారు.
సణిగే వాళ్ళు లేకపోతే ప్రశ్నించే వాళ్ళు. నాయకత్వం మీద సణిగే వాళ్ళు, నాయకత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు లేకపోతే, నాయకత్వాన్ని అటాక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు.
చాలా మంది ఎందుకు ఉంటారు అంటే, ఎందుకు ఉంటారో కూడా నేను రీసన్ చెప్తాను. రీసన్ ఏంటంటే, అంటే దుష్టుడు ఎప్పుడూ కూడా వాడి టార్గెట్ ఎప్పుడూ కూడా సంఘాన్ని నడిపించే పెద్దల మీద ఎక్కువ ఉంటది.
వాడి టార్గెట్ వాడి టార్గెట్ ఏంటంటే, ఆ వ్యక్తిని గనుక పడగొట్టాడు అనుకోండి, మొత్తము గొర్రెలు మంద చెదిరిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మోషేని చూడండి.
మోషేని కూడా అటాక్ చేశారు. మోషేని అటాక్ చేశారు. దావీదుని అటాక్ చేశారు. ఎవరిని అటాక్ చేయలేదు?
అటాక్ చేయడం అనేటువంటిది దుష్టుడు వాడేటువంటి ఒక స్ట్రాంగ్, వెరీ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏంటంటే, సంఘాన్ని నడిపించేటువంటి నాయకుల మీద గనుక బురద జల్లాము అనుకోండి, లేకపోతే వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, మోసం చేశారు, అన్యాయం చేశారు, వీళ్ళు డబ్బులు తినేస్తున్నారు, లేకపోతే వీళ్ళకి సీక్రెట్ లైఫ్ ఉంది, లేకపోతే అక్రమ సంబంధాలు ఉన్నాయి.
ఇలాంటి ఇలాంటి బురద వాళ్ళ మీద చల్లటము, లేకపోతే వాళ్ళ జీవితాలను పాడు చేయాలని దుష్టుడు ప్రతి ప్రయత్నము చేస్తాడు. ప్రతి ప్రయత్నము చేస్తాడు.
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, తిమోతి నువ్వు పెద్దలను మాత్రం సేఫ్ గాడ్ చేయాలి. పెద్ద పెద్దలను నువ్వు భద్రం చేయాలి. పెద్దలను భద్రం చేయాలంటే అర్థం ఏంటంటే, వాళ్ళు పాపం చేస్తున్న భద్రం చేయాలని కాదు.
పాపం చేస్తున్న భద్రం చేయాలని దేవుడు అంగీకరించడు. కాకపోతే ఏమంటున్నాడు అంటే, నువ్వు ఎవరైనా వచ్చి ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దల మీద కంప్లైంట్ చేస్తే, కంప్లైంట్ చేశాడు అనుకోండి.
ఎవరైనా వచ్చి ఏమంటున్నాడు అంటే, నువ్వు ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా, ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా, సాక్ష్యం లేకుండా, ఒక సాక్ష్యం కాదు, ఎంతమంది ఉండాలి? ఇద్దరు లేకపోతే ముగ్గురు సాక్షులు ఉంటేనే, పెద్ద మీద దోషారోపణ అంగీకరించాలి.
ఒకవేళ ఇద్దరు ఆ మాట అక్కడ మనం ఇద్దరు ముగ్గురు అనేటువంటిది ఆల్రెడీ మనం అక్కడ చూసాము. టు విట్నెస్సెస్ ఆర్ మినిమమ్, త్రీ విట్నెస్సెస్ అనేటువంటిది.
ఇది మనం చాలా సార్లు చూస్తాం. నిజానికి ఈ ఇద్దరు లేకపోతే ముగ్గురు అనేటువంటిది మనము ధర్మశాస్త్రంలో దేవుడు ప్రతిసారి కూడా ఎవరి మీద ఏ నేరారోపణ జరిగిన, కూడా దోషారోపణ జరిగిన, కూడా ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటిది ఏంటంటే, ఇద్దరు లేకపోతే ముగ్గురు సాక్షులు లేకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటానికి కుదరదు.
సో దేవుడే దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చాడు. ఆమెన్. ధర్మశాస్త్రం మాత్రమే కాదు, న్యూ టెస్టమెంట్ లో లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా చాలా సార్లు చెప్పాడు. ఇదే సత్యాన్ని.
ఏ సత్యం అంటే, ఇద్దరు లేకపోతే ముగ్గురు సాక్షి ఉంటేనే గాని దానిని మీరు అంగీకరించకూడదు అనేటువంటిది. మనము ఒక రెండు ఓల్డ్ టెస్టమెంట్ ద్వితీయోపదేశ కాండంలో మనం చూద్దాము.
తర్వాత లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వద్దాము. తర్వాత పాల్ దగ్గరికి వద్దాము. ఈ లాజిక్ అంటే ఇది దేవుని వాక్యానుసారం అని మనందరికీ తెలుసు.
మనమందరం అంగీకరించేటువంటి సత్యమే ద్వితీయోపదేశ కాండము 17 వ అధ్యాయము ఐదవ వచనం. ఆరవ వచనం చదువుతారా? ఇప్పుడు ఇక్కడ మరణ శిక్ష, నిజానికి ఆ మరణ దండన అంటాం కదా.
వాడిని బయటికి తీసుకెళ్లి నాలుగవ వచనంలో అంటాడు, అలాంటి స్త్రీ, స్త్రీనైన పురుషుడినైనను గాని గ్రామానికి బయటికి తీసుకెళ్లి రాళ్లతో చావగొట్టాలండి. కాకపోతే ఐదవ వచనం ఏమని చెప్తుంది?
ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావ తగిన వానిని మరణ శిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. అర్థమైందా?
అండి, వన్ విట్నెస్ ఇస్ నాట్ ఎనఫ్. రెండు లేకపోతే మూడు. రెండు లేకపోతే మూడు ఉంటేనే మనం దాన్ని అంగీకరించాలి అనేటువంటిది.
మరల మరల చూసేటువంటి సత్యమే 19వ అధ్యాయంలో కూడా మనము ఈ ఈ మాట చూస్తాం. 19వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 15వ వచనంలో ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చి గాని, ఏ పాపమును గూర్చి గాని, ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరించకూడదు.
అంగీకరించవచ్చా? అంగీకరించకూడదు. అంగీకరించకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను, ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.
ప్రతి సంగతి కూడా స్థిరపరచాలి. స్థిరపరచాలంటే టూ విట్నెస్సెస్ గాని లేకపోతే త్రీ విట్నెస్సెస్ గాని ఉండాలి. అదే ట్రూత్ ని మరి మనం ఇక్కడ కూడా చూస్తా ఉన్నాం.
మీరు మత్తయి సువార్త 18 వ అధ్యాయంకి రండి. ఇప్పుడు లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వస్తున్నాం. మనం ధర్మశాస్త్రం చూసేసాము. ఓల్డ్ టెస్టమెంట్ చూసాము.
ఇప్పుడు న్యూ టెస్టమెంట్ కి వస్తున్నాం. ఆ మత్తయి సువార్త 18 వ అధ్యాయము 16 వ వచనం. ఆ 16 వ వచనంలో మీరు ఏం చూస్తారు? ఒకవేళ అంటే నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు, నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు.
15వ వచనం అతడు నీ మాట వినిన యెడల, నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని యెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు, నీవు ఒకరిద్దరిని వెంటపెట్టుకొని అతని యొద్దకు పొమ్ము.
అర్థమైంది కదండీ? సో లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా ఏమన్నాడు? నువ్వు ఒకవేళ సహోదరుడు పాపం చేసినప్పుడు, నువ్వు ఒంటరిగా వెళ్లి మాట్లాడాడు.
అతనితో మాట్లాడావు అనుకో, నీ మాట విన్నాడు అనుకో, నువ్వు అతన్ని సంపాదించుకున్నావ్. అతను నీ మాట విన్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, తిరిగి వచ్చేసాడు. మంచిది, మంచి జరిగింది.
ఒకవేళ నువ్వు ఒంటరిగా వెళ్లి చెప్తే వినలేదు అనుకో. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్, ఇద్దరు ముగ్గురిని తీసుకొని తీసుకొని వెళ్లి మాట్లాడాలి.
అప్పుడు కూడా వినలేదు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలో చెప్తాడు. అందరి ఎదుట వాడిని పక్కన పెట్టాడు.
మనం సో అది మనము చర్చ్ డిసిప్లిన్ లో చూస్తాం. ఆ కాంటెక్స్ట్ లో ఆ ప్రభువు మాట్లాడినటువంటిది యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో కూడా మనము ప్రభువు ఈ మాటని మరల తీసుకొచ్చినట్టు మనం చూస్తాం.
అయన అంటాడు, నా సాక్ష్యం మాత్రమే కాదు, తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటాడు. ఆ ఎనిమిదవ అధ్యాయము 16 వ వచనము.
నేను ఒక్కడినై ఉండక, నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. ఇక్కడ 17 వ వచనం మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా.
నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొను వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడని చెప్పెను. మనము సేమ్ ఇక్కడ కూడా ఏమంటున్నాడు అంటే, వి హావ్ టు విట్నెస్సెస్.
ఐ యామ్ విట్నెస్సింగ్ అండ్ ద ఫాదర్ ఇస్ ఆల్సో విట్నెస్సింగ్ అనేటువంటి మాటను మాట్లాడుతూ ప్రభువు కూడా ఇక్కడ కోట్ చేయడం జరిగిందన్నమాట.
ఇక పౌలు విషయానికి వచ్చామండి. ఇప్పుడు చూడండి, మనం మోషే ఇదే సత్యం నేర్పించాడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇదే సత్యం నేర్పించాడు.
ఇప్పుడు పౌలు కూడా ఏమంటున్నాడు? పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఏమిటంటే, పెద్ద మీద ఎవరైనా దోషారోపణ చేస్తే, నువ్వు అంగీకరించొద్దు. ఎప్పుడు అంగీకరించాలి అంటే, రెండు లేకపోతే మూడు సాక్ష్యాలు ఉంటేనే మాత్రమే నువ్వు దానిని అంగీకరించాలి.
ఇక్కడ రెండో కోరింథీయులకు రాసిన పత్రిక, ఆ 13 వ అధ్యాయము ఒక్కసారి ఒక వచనాన్ని చదివి మనం వద్దాం. ఇది కూడా పౌలే మళ్ళీ మనం మాట్లాడుతుంది.
రెండో కోరింది రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు రాశాడు. పౌలే మాట్లాడుతున్నాడు. 13 వ అధ్యాయంలో ఈ మూడవ సారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను.
13 వ అధ్యాయం మొదటి వచనం. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. అదే మాట కదండీ.
సేమ్ మరల ఆయన కూడా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, చాలాసార్లు మనము దేవుని వాక్యములో చూసేటువంటి దాన్ని స్థిరపరచాలి అనేటువంటిది మనం చూస్తాం.
సో 19వ వచనం ఏమి చెప్తుంది అంటే, పెద్దల మీద తొందరపడి బురద జల్లితే కుదరదు. అర్థమైందా? నేను అదే చెప్తున్నాను.
మరల సీ, ఒకవేళ పెద్దలు పాపం చేశారు. నేను మరల చెప్తున్నాను, కాపరి పాపం చేయడని నేను అనట్లేదు. పెద్దలు పాపం చేయరు అని నేను అనట్లేదు.
చాలా మంది కాపరులు వ్యభిచారంలో ఉన్నారు. చాలా మంది కాపరులు సంఘాలను నడిపించే కాపరులు వ్యభిచారము, తాగుడు. ఆ తర్వాత ఏమంటారు?
మనీ బిజినెస్ లో ఉన్నారు. వాళ్ళకి మొదటి తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఉండాల్సిన అర్హతలు లేని పాస్టర్లు చాలా మంది సంఘాలను నడిపిస్తున్నారు.
సంఘాల్లో ఉన్నారు. నేను సంఘాలను నడిపించే కాపరులు పాపం చేయరు అని అనట్లేదు. పాపం చేయరు అనేటువంటిది నా ఉద్దేశం కాదు.
నేను ఏమంటున్నాను అంటే, ఎవరైతే పాపం చేస్తా ఉన్నారో, అలాంటి వారు గనుక పాపం చేస్తా ఉంటే, మనము ఏం చేయాలంటే, సంఘము, సంఘము వెళ్లి మిగిలిన పెద్దలకి చెప్పాలి.
ఎవరూ ఇద్దరు లేకపోతే ముగ్గురు వెళ్లి ఏం చెప్పాలి? నేను చూశానండి, మేమిద్దరం, మేము ముగ్గురం సాక్షులము. ఈయనకి అక్రమ సంబంధం ఉంది, అది మేము చూసాం, మేము సాక్షులం.
దాన్ని ఇదిగో, ఈ కాపరి, ఈ పెద్ద, ఇదిగో, ఈ పాపం చేశాడు అని మనము చెప్పాలి. చెప్పడం కాదు. ఇంకోటి ఏంటంటే, పాపము చేయు వారిని అని ఉంది కదా.
ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. నిజానికి ఆ చేయు వారిని అనే మాట ఉంది కదా. అంటే ఇంకా అర్థం ఏంటి? అతనికి పాపం చేస్తున్నాడు అని నిరూపించబడిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యాడు అనుకోండి.
అప్పుడు మాత్రం ఇంకా చెప్పడం కాదు, గద్దించాలి. చెప్పడం చెప్పడంతో సరిపోదు. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ఆ గద్దించాలి.
గద్దించడం అంటే మీకు తెలుసు కదా. గద్దించడం అనేటువంటిది ఆ మరి మీరు మందలించడం, గద్దించడం, కోపగించడం, కోప్పడటం, ఇవన్నీ మాటలు ఉన్నాయి కదండీ.
ఈ మాటలన్నీ కూడా చెప్పాలి. చెప్పి అతను ఫస్ట్ డిస్క్వాలిఫైడ్ చేయాలి. ఆ పెద్దగా ఉండటానికి అనర్హుడు అని తీసేసేయాలి.
మిగిలిన డిస్కషన్ అన్ని తర్వాత, ఆ ముందు అతను పెద్దగా ఉండటానికి యోగ్యుడు కాదు. ఎందుకని యోగ్యుడు కాదు? వెంటనే మీరు ఏమంటారు?
పాస్టర్ గారు, అలా ఎలా తీసేస్తారు? మీరు పెద్దగా, మీరు అవకాశం ఇవ్వాలి కదా. ఒకసారి ఏదో తప్పు చేశాడు. ఒకసారి తప్పు చేస్తే, మీరు అవకాశం ఇవ్వకుండా ఎలా తీసేస్తారు?
ఒకవేళ మారతాడేమో, ఒకవేళ మారుమనసు వస్తదేమో, పశ్చాత్తాప పడతాడేమో, మీరు యాక్షన్ ఎలా తీసుకుంటారు? పాస్టర్ గారు అంటే, నేను యాక్షన్ ఎలా తీసుకుంటాం అంటే, యాక్షన్ తీసుకోవడానికి బేసిస్ ఏంటంటే, అర్హత పోగొట్టుకున్నాడు.
ఏం పోగొట్టుకున్నాడు? అర్హత పోగొట్టుకున్నాడు. అర్హతలు ఉన్నాయి కదా. మూడవ అధ్యాయంలో అర్హత పోయినప్పుడు డిస్క్వాలిఫై అయిపోతాడా? అయిపోడా, అయిపోతాడు.
డిస్క్వాలిఫై చేసుకున్నాడు తన నిర్ణయాల వల్లనే. తనే డిస్క్వాలిఫై చేసుకున్నాడు. ఇంకా ఇంకా కొన్ని అంటే కొన్ని పాపాలు అనుకోండి, అసలు మళ్ళీ లైఫ్ లో పరిచర్యలోకే రాలేడు.
అంటే అలాంటి పాపాలు కూడా ఉన్నాయి. సో మళ్ళీ వచ్చి పరిచర్యలో నేను నిలబడతాను. చూడండి, అక్రమ సంబంధం అనేటువంటిది ఉందనుకోండి.
అతను ఏకపత్ని పురుషుడు ఎప్పటికీ అవ్వలేడు. అయిపోయింది. ఇంకా లాస్ట్ డే, అది అక్రమ సంబంధం పెట్టుకున్న పాస్టరు మళ్ళీ పాస్టర్ అవ్వడం అనేటువంటిది ఇది జరగటం ఉండదు.
నేను పాస్టర్ గారు, నేను వెళ్లి ఒక మూడు సంవత్సరాలు ఎక్కడో ఎడారిలో పశ్చాత్తాప పడి వస్తాను అన్నా కూడా కుదరదు. ఎందుకంటే మళ్ళీ నువ్వు ఏకపత్ని పురుషుడివి ఎప్పటికీ కాలేవు నువ్వు.
సో వెరీ ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? అండి, మీరు యాక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే, అతన్ని తీసేయాలి. పాస్టర్ గా ఉండటానికి అనర్హుడు అని తీసేసేయాలి.
సంఘంలో, సంఘంలో ఉండొచ్చు. పశ్చాత్తాప పడ్డాడు, ఒక విశ్వాసిగా మళ్ళీ తిరిగి రావచ్చు. తిరిగి వచ్చి సంఘంలో అందరితో పాటు ఉండడు.
కానీ ఎప్పటికీ మళ్ళీ లీడర్షిప్ రోల్ లోకి రాలేడు. ఇంకొకటి ఏంటో తెలుసా? అండి, సంఘంలో పెద్ద పాపం చేసినప్పుడు చర్చికి ఇన్ఫార్మ్ చేయాలి.
అందరి ఎదుట చెప్పాలి. ఏం