📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

1 యోహాను 2:18-27 (P21) || ఏంటి ఈ అభిషేకం? || Daniel Surya Avula|| Grace Life Church ||

Daniel Surya Avula1:09:50

Transcription

యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయము, 18 వ వచనం నుండి 27 వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనము వింటూ ఉన్నాము. ఒకవేళ మీరు డైరెక్ట్ గా గనుక ఈ మెసేజ్ వింటుంటే, గనుక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మెసేజ్ నెంబర్ 21 ఫస్ట్ జాన్ లో.

దయచేసి, ముందు చెప్పినటువంటి 20 మెసేజెస్ కూడా మీరు వింటే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నాడు అనేటువంటిది మీకు అర్థమవుతుంది. సో, మేము సీక్వెన్షియల్ ఎక్స్పోజిషన్ చేస్తున్నాను, వచనం తర్వాత వచనము చెప్పుకుంటూ వస్తున్నాను.

దాంట్లో భాగంగానే, ఈరోజు మనము 18 వ వచనం నుండి 27 వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చూస్తా ఉన్నాము. ఈ వాక్యం, వాక్యాలను నేను లాస్ట్ సండే పరిచయం చేశాను. ఈ వాక్యాల యొక్క ప్రాముఖ్యతను కూడా నేను పరిచయం చేశాను.

క్రీస్తు నుంచి మనల్ని దూరం చేయాలని దుష్టుడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తా ఉంటాడు. వాడు ఏర్పరచుకున్న స్ట్రాటజీ ఏంటంటే, మనల్ని దేవుని నుంచి దూరం చేయటానికి, జీవం నుంచి దూరం చేయటానికి వాడు వాడేటువంటి స్ట్రాటజీ ఏంటంటే, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ క్రీస్తులను, అబద్ధ బోధను సంఘాలలోకి విడిచిపెడతాడు.

ఫాల్స్ అబద్ధం అనే మాటకు అర్థం ఏంటంటే, ట్రూత్ కి ఆపోజిట్. ట్రూత్ అంటే నిజము, ఆపోజిట్ ఏంటి? అబద్ధం. అబద్ధము ఎలాంటిది అంటే, విషం లాంటిది. అబద్ధము విషము లాంటిది. విషము ఎలాగైతే మనిషిని చంపగలదు, అబద్ధము ఒక వ్యక్తిని జీవము నుంచి పక్కకు నెట్టేయగలదు.

మీరు భిన్నమైన సువార్తకు ఇంత త్వరగా వెళ్ళిపోతారా అని చెప్పి, గలతీయులకు రాసిన పత్రికే రాశాడు. భిన్నమైన సువార్త నిజానికి సువార్త కాదు, అది అబద్ధ సువార్త. భిన్నమైన సువార్త అంటూ ఏమీ లేదు, సువార్త ఒకటే ఉంది. ఆ సువార్త కానిది ఏదైనా కూడా అబద్ధమే.

సో, న్యూ టెస్టమెంట్ లో అబద్ధ బోధకుల గురించి పుస్తకాలు, పుస్తకాలే ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంధంలో, నేను ఇందాక చెప్పినట్టుగా, గలతీయులకు రాసిన పత్రిక అబద్ధ బోధన ఖండిస్తూ రాసినటువంటి పత్రికే మొదటి తిమోతికి రాసిన పత్రిక.

ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి అధ్యాయంలో కూడా అబద్ధ బోధకులను, అబద్ధ బోధను చూస్తా ఉన్నాము. సెకండ్ తిమోతిలో కూడా మాట్లాడుతాడు, తీతులో కూడా మాట్లాడుతాడు అబద్ధ బోధకుల గురించి. రెండో పేతురు రాసిన పత్రిక మొత్తం అబద్ధ బోధకుల గురించే. అలాగే యోధా పత్రిక అంతా కూడా అబద్ధ బోధకుల గురించే.

ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో మరల మనతో మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలోకి బయలుదేరారు. మనల్ని ఎలాగైనా సత్యములో నుండి బయటకు లాగేస్తే గనుక, సత్యములో నుంచి బయటకు వచ్చేసామంటే, మనము క్రీస్తులో నుంచి, జీవములో నుంచి బయటకు వచ్చేసినట్టే కాబట్టి చాలా మంది ప్రయత్నం చేస్తారు.

ఇలాంటి అబద్ధ బోధన నుండి సంఘాన్ని ఎలా కాపాడాలో ఆత్మీయ దేవుడికి తెలుసు. ఆయన చక్కగా ఈ గ్రంధాన్ని రాయించి ఉంచాడు. మిగిలిన గ్రంథం ఎలాగైతే రాయించాడో, ఈ గ్రంధాన్ని కూడా రాయించి, దేవుని వాక్యంలో భద్రం చేసి పెట్టాడు.

అయన మన నిత్యజీవాన్ని చూడండి, ఎంత జాగ్రత్తగా భద్రం చేస్తున్నాడో. సో, ఇది సందర్భం. సందర్భము మనకు అర్థం కాలేదు అనుకోండి, సందర్భం విడిచిపెట్టి బైబిల్ లో ఏ వచనాన్ని కూడా మనం చదవకూడదు.

సందర్భానుసారంగానే అర్థం చేసుకోవాలి. ఆ సత్యాన్ని కాంటెక్స్ట్ అంటాం. ఇంగ్లీష్ లో మనం కాంటెక్స్ట్ విడిచిపెట్టేసాం అనుకోండి. ఆ వచనాలు మనం ఎలా మాట్లాడాలి అంటే, అలా మాట్లాడతాయి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, అది చెప్తాయి.

అలా చదవకూడదు బైబిల్ ఎప్పుడూ కూడా. సో, ఏ సందర్భంలో ఈ వచనాలు ఉన్నాయి, ఎందుకు ఈ వచనాలు మాట్లాడుతున్నాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. మనందరికీ తెలుసు 26 వ వచనంలో ఒక మాట అన్నాడు కదా. 20 వచనంలో ఏమన్నాడు? మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను.

ఎవరైనా మోసం చేసే వాళ్ళు ఉన్నారంట. ఆ మోసం చేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడటం కోసం, మిమ్మల్ని భద్రం చేయడం కోసం నేను ఈ సంగతులు రాస్తున్నాను అని చెప్పాడు. అంతేకాదు, 18 వ వచనంలో అన్నాడు, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా.

ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇది మనకి ఆ కడవరి గడియ అని తెలుసు. అంతేకాదు, నిజానికి వీళ్ళు ఎంత పవర్ఫుల్ గా పని చేస్తున్నారు అంటే, చర్చిలో ఉన్నటువంటి కొంతమందిని ఆల్రెడీ లాక్కెళ్ళిపోయారు అబద్ధ బోధకులు.

ఇక్కడ తెలుసు 19 వ వచనం చూడండి, వారు మనలో నుండి బయలు వెళ్ళిరు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉన్నారు. అయితే వారందరూ మన సంబంధులు కారు అని ప్రత్యక్ష పరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి.

సో, అంటే చర్చిని వదిలేశారు. చర్చిని వదిలేసి బయటికి వెళ్ళిపోయారు. ఆ ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? నిజమైన సంఘాన్ని, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అంటే అబద్ధ బోధ మొదలైంది.

సంఘాల్లో అబద్ధ బోధని కొంతమంది నమ్మారు. అబద్ధ బోధకులను నమ్మారు. అబద్ధ క్రీస్తులను నమ్మారు. వాళ్ళని నమ్మి ఆ బోధను నమ్మి, ఆఖరికి చర్చినే వదిలేసి వెళ్ళిపోయారంట. ఆయన అంటాడు యోహాను ఏమంటాడు అంటే, వాళ్ళు దేవుని సంబంధులు కారు.

వాళ్ళు దేవుని సంబంధులు అయితే మనతోనే ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మనకు తెలుసు, వాళ్ళు దేవుని సంబంధులు కారు అని ఆ మాట ఉంది కదండీ. వారందరూ మన సంబంధులు కారు అని ప్రత్యక్ష పరచబడినట్లు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటంటే, వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి?

సత్యం నుండి మంచి సంఘం నుంచి వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఎవరు అనేటువంటిది మీరు ఆలోచించాలి అనేటువంటిది ఇక్కడ చెప్తా ఉన్నాడు. అన్నమాట 22 వ వచనం యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి.

కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. ఇక్కడ బేసికల్ గా మనం మనకు అర్థమవుతుంది ఏంటంటే 18 వ వచనం నుంచి 27 వ వచనం వరకు మెయిన్ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరే వస్తుంది.

లార్డ్ జీసస్ క్రైస్ట్ ని దేవుడని అంగీకరించకపోయినా, లార్డ్ జీసస్ క్రైస్ట్ ని మనిషి అని అంగీకరించకపోయినా, ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనలో పూర్తిగా దైవత్వం ఉంది, ఆయనలో పూర్తిగా మానవ స్వభావం ఉందని ఎవరు అంగీకరించకపోయినా కూడా, వాళ్ళు అబద్ధ బోధను పట్టుకుంటున్నట్టే.

అయన దైవ స్వభావాన్ని కాదన్నా, వాళ్ళు అబద్ధ బోధకులే. ఆయన మానవ స్వభావాన్ని కాదన్న వాళ్ళు దేవునికి విరోధులే. వాళ్ళు అబద్ధ బోధకులే. సో అలాంటి బోధ చేసి వీళ్ళని దేవుని నుండి దూరం చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ మాటలు రాస్తున్నాడు.

నేను ఈ కాంటెక్స్ట్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మరల నేను చెప్పాను కదా, ఏ వచనాలనైనా దేంట్లో అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ట్, కాంటెక్స్ట్, సందర్భంలో అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు సందర్భం అంతా చెప్తూ ఎందుకు ఇదంతా రాస్తున్నాడు అనేటువంటిది మనము ఆయనలో నిలిచి ఉంటేనే మనకు నిత్యజీవం.

అయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండకుండా ఈ లోకంలో చీకటి శక్తులు బయటికి లాగాలని మనల్ని ప్రయత్నం చేస్తానే ఉంటారు కాబట్టే ఈ మాటలు ఇక్కడ రాశాడు. సో ఇది కాంటెక్స్ట్. కాంటెక్స్ట్.

లాస్ట్ సండే కొంత నేను చెప్పడానికి ప్రయత్నం చేసి చేశాను. ఇప్పుడు నేను చెప్పినవి కొంచెం మీకు రెపిటేషన్ గా ఉన్నా కూడా మంచిది. అట్లీస్ట్ మీకు లాస్ట్ వీక్ ఒకవేళ మిస్ అయినా కూడా, ఈ వీక్ ఓ ఈ సందర్భంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడా అనేటువంటిది మీకు అర్థమవుతుంది.

సో ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అంటే ఒకే ఒక అంశము మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వచనాలలో కష్టమైనటువంటి విషయము ఒకటి ఉంది. అది ఏంటంటే అభిషేకము. ఈ వచనాల్లో కష్టమైనటువంటిది ఏంటి? అభిషేకము.

అభిషేకము అనే మాట ఇక్కడ రెండు సార్లు ఉంది. మనం చదివినటువంటి వచనాల్లో ఒకసారి 20 వ వచనంలో ఉంది, ఇంకొకసారి 27 వ వచనంలో ఉంది. అభిషేకము, అభిషేకము అనేటువంటి మాట మీరు విన్నారు కదా, చాలాసార్లు అభిషేకము అనేటువంటి మాట విన్నారు.

ఆ అసలు ఈ అభిషేకము అంటే ఏంటి? ఈ అభిషేకము ఎవరు ఇస్తారు? ఈ అభిషేకము ఎవరికి ఇస్తారు? ఈ అభిషేకము ఉంటే ఏం జరుగుతది? ఈ అభిషేకము లేకపోతే ఏం జరుగుతది? సో మనము ఈ అభిషేకాన్ని జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి అర్థం చేసుకోవడానికి ప్రతి ప్రయత్నం చేద్దాము.

సో నేను ఈరోజు ఒక్కటే చెప్తాను, మిగిలినవి ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఈ వచనాల్లో కష్టమైనటువంటి పదము నౌన్, అది ఒక్కటే. సో దాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది అర్థమైంది అనుకోండి, నేను వచ్చి నెక్స్ట్ సండే ఈ వచనాలను మీకు సమ్మరైజ్ చేయగలను అంటే ట్రూత్ అంతా చెప్పగలను.

మధ్యలో ఈ మాట చాలా మందికి ఏంటంటే అసలు ఏంటి అభిషేకం అంటే ఏంటి అభిషేకం అంటే ఏంటి అనేటువంటిది ప్రశ్న ఉంది. కాబట్టి దీని మీద కొంచెం టైం స్పెండ్ చేయడం మంచిదని అనిపించింది. అందుకని నేను ఈరోజు ఆ ఒక్క మాటనే మీకు వివరిస్తాను.

సో ఆ ఒక్క పదాన్ని మాత్రమే నేను వివరిస్తున్నాను. సో అభిషేకము అనే మాట రెండు సార్లు ఉందండి. ఇక్కడ ఒకటి 20 వ వచనంలో ఉంది, రెండోది 27 వ వచనంలో ఉంది. నేను ఈ రెండు వచనాలను చదువుతాను.

20 వ వచనం అయితే, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు అనే మాట మనం అక్కడ చూస్తాం. ఆ నేను ఇంకా వివరించట్లేదు, వివరిస్తాను. మనం 27 కూడా చదువుదాం. 27 కూడా చదివి వెనక్కి వద్దాం.

27 వ వచనం అయితే, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు.

ఈ రెండు వచనాల్లో మాత్రమే మనము అభిషేకము అనేటువంటి మాటని మనం చూస్తాం. దీని వెనకాల ఉన్నటువంటి గ్రీకు పదము క్రిస్మ. సి హెచ్ ఆర్ ఐ ఎస్ ఎం ఏ, అభిషేకము అనే మాట వెనకాల ఉన్నటువంటి గ్రీకు పదము క్రిస్మ.

సి హెచ్ ఆర్ ఐ ఎస్ ఎం ఏ, అది పదము. సో ఈ పదము యొక్క బేసిక్ మీనింగ్ ఏంటంటే, మనందరికీ తెలుసు కదా, ఏమంటాము తైలం అంటామా? తైలము. తైలము లేకపోతే అంజనము. ఆ మీరు లేపనము. ఈ మాటలు వాడొచ్చు అన్నమాట.

బేసికల్ గా ఆయిల్ ఆర్ ఆయింట్మెంట్ అనేటువంటిది. దేన్నైతే మనము అప్లై చేస్తామో, రాస్తామో, దాన్ని మనము క్రిస్మ అనేటువంటిది. ది ఆక్ట్ ఆఫ్ అనాయింటింగ్. ఇది క్రయో అనేటువంటి మెయిన్ వెర్బ్ నుంచి వచ్చినటువంటిది. క్రయో మీన్స్ టు అనాయింట్ అండ్ క్రిస్మ మీన్స్ యాక్ట్ ఆఫ్ అనాయింటింగ్.

సో, అంక్షన్ అంటాం కదా మనము. అది అది అన్నమాట ఇక్కడ మనం వాడినటువంటి మాట అంటే ఏమంటామంటే తైలాభిషేకము లేకపోతే లేపనము. ఈ మాటలు వాడొచ్చు. అది దీని వెనకాల ఉన్నటువంటి ఆ మీనింగ్ బేసిక్ రూట్ మీనింగ్.

అదన్నమాట అంటే దేన్నైతే ఫిజికల్ గా అయితే, భౌతికంగా అయితే, దేన్నైతే ఒక వ్యక్తి మీద మనము రాస్తామో, అప్లై చేస్తామో, అప్లై చేసి దాని యొక్క ప్రత్యేకతను వివరిస్తామో, బేసికల్ గా దాన్నే అభిషేకము అంటే అన్నమాట.

మీరు చూడండి, పాత నిబంధన గ్రంధంలో దేవుడు కోసం ఏర్పరచబడినటువంటి ప్రతి పాత్ర కూడా, ప్రతి ప్రత్యేక పరచబడాలి. అంతేకాదు, యాజకులకు కూడా తైలాభిషేకంతో అభిషేకం చేసి వారిని దేవుడి కోసం వేరుపరిచే వాళ్ళు వేరు చేసేవాళ్ళు.

యాజకులను మాత్రమే కాదు, మనము మొదటి సమూయేలు గ్రంధంలో రాజులను కూడా అభిషేకించి ప్రత్యేక పరిచినట్టుగా మనము చూస్తాం. సో, అంటే బై అప్లైంగ్ ఆయిల్ అండ్ ఐదర్ యు ఆర్ సెట్టింగ్ ఇట్ అసైడ్. ఆర్ మనము ఏమంటారు? పరిశుద్ధ పరిచి వేరు చేస్తాం అంటాం కదా.

వేరు చేసి ప్రత్యేకమైన పని కోసము దానిని ఉంచాము అని అంటాం కదా. సో, బేసిక్ గా ఓల్డ్ టెస్టమెంట్ మీనింగ్ అయితే, అది ఓల్డ్ టెస్టమెంట్ ఇంటర్ప్రిటేషన్ మనం చూసేది. ఈ వర్డ్ కి అర్థం అది కానీ ఈ వర్డ్ ఎక్కడ కూడా బైబిల్ లో ఇంకెక్కడా లేదు.

క్రిస్మస్ అనేటువంటి వర్డ్ బైబిల్ లో రెండే రెండు చోట్ల ఉంది. ఆ రెండు కూడా ఇక్కడే ఉంది, 20 వ వచనము, 27 వ వచనం. ఈ గ్రీక్ పదం ఇంకెక్కడా లేదు, ఇంకెక్కడా వాడబడలేదు. సో మనం చూస్తున్నటువంటి వర్డ్ చాలా యూనిక్ వర్డ్. అది ఇక్కడ మాత్రమే ఉంది.

అంటే ఇక్కడ మనకు ఒకటి మాత్రం అర్థమవుతుంది, అది ఏంటంటే పరిశుద్ధుడగు దేవుడు మనలను అభిషేకించాడు అనేటువంటిది మాత్రం మనకు అర్థమవుతుంది. అవునా కాదా? ఆ అభిషేకము మనకు ఇచ్చాడు. మనము అభిషేకము కలిగినటువంటి వారము అనేటువంటిది మాత్రం మనకు అర్థమవుతుంది.

ఎలా అర్థమవుతుంది? చూడండి, ఎలా అర్థమవుతుందో చదువుతాను. నేను చూడండి 20 వ వచనంలో అంటాడు, ఏమంటాడు? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు అనే మాట ఉంది. అంటే అర్థం ఏంటంటే, అభిషేకం అయిపోయింది.

పొందారు అంటే అర్థం ఏంటి? యు హావ్. యు హావ్ అనాయింటింగ్ ఫ్రమ్ ది హోలీ వన్ కదా. అంతే నిజానికి అక్కడ వాడినటువంటిది పాసివ్ వెర్బ్ కాదు, ఆక్టివ్ వెర్బ్. ప్రెసెంట్ ఆక్టివ్ యాక్టివ్ వెర్బ్ అంటే అర్థం ఏంటంటే, నీ దగ్గర అభిషేకం ఉంది.

యు హావ్ ద అనాయింటింగ్. అక్కడ అక్కడ వాడినటువంటి పదం ఏంటంటే, యు హావ్ ద అనాయింటింగ్ అంటే దేవుడు పరిశుద్ధుడగు దేవుడు మనకు ఏమి ఇచ్చాడంట? అభిషేకము ఇచ్చాడంట. ఆ మాట అన్నారు, పొందిన వారు అని ఉంది కదండీ.

ఆ వెనకాల ఉన్న మాట గ్రీకు పదం ఏంటంటే హావ్ అంటే మీకు కలిగి ఉన్నారు. అంటే మీరు మీకు ఉంది. ఆ అభిషేకము మీకు ఉంది. ఆ అభిషేకం మీకు ఉంది. అంతేకాదు, అభిషేకాన్ని ఎవరు ఇచ్చారంట? మనకి ఎవరు ఇచ్చారంట? పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధుని వలన అని ఉంది.

పరిశుద్ధాత్ముడు అని లేదు. ఆ పరిశుద్ధాత్ముడు అని మీరే అంటున్నారు. అక్కడ లేదు. టెక్స్ట్ లో ఏముందంటే హోలీ వన్ అంటే పరిశుద్ధుడు అనేటువంటి మాట. హోలీ వన్ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు.

పరిశుద్ధుడు మనకు ఏమంటున్నాడు అంటే అభిషేకమును ఇచ్చాడు అని అంటున్నాడు. అంతే కదా? మీరు 27 వ వచనంలో చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. అంటే మనకు అభిషేకం ఆయన ఇచ్చాడంట.

అయన ఇచ్చినటువంటి అభిషేకము విశ్వాసుల్లో నిలిచి ఉందంట. నిలిచి ఉంది. ఇచ్చాడు అనేటువంటిది అంటే రెండు చోట్ల చెప్తున్నాడు కదండీ. ఇక్కడే చెప్పాడు, ఆయన వలన మీరు పొందారు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? 27 వ వచనంలో, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తుంది.

అయన వలన మీరు పొందారు అభిషేకాన్ని. అభిషేకాన్ని పొందటం మాత్రమే కాదు, అభిషేకం మీలో నిలిచి ఉంది. ఇట్ ఇస్ రిమైనింగ్ ఇన్ యు. ఇట్ ఇస్ అబైడింగ్ ఇన్ యు. అబైడింగ్ అనే మాట మనం వాడొచ్చు అన్నమాట.

ఇట్ ఇస్ ఇన్ యు. మీలో ఉంది. మీలోనే నిలిచి ఉంది. ఆ అభిషేకము అనేటువంటిది ఇక్కడ, అక్కడ కూడా చెప్పాడు అన్నమాట. సో, అభిషేకము దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధుడు ఇచ్చాడు.

మనకి ఒకటి నెంబర్ వన్, అది మన లోపల ఉంది. అది మనతోనే ఉంది, నిలిచి ఉంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ఇంతకీ ఆ అభిషేకం అంటే ఏంటో నేనేం చెప్పలేదు.

చెప్పకుండానే వచనాలు చదువుతూ ఓ అభిషేకము, అభిషేకం అని నేను కూడా మాట్లాడుతున్నాను. ఇట్స్ గుడ్, మీరు అర్థం చేసుకుంటున్నారు కొంచెం కొంచెంగా ఈ విషయం ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది మీకు.

సో ఇంతవరకు ఏం అర్థం చేసుకున్నాము? అభిషేకం అంటే తైలము లాంటిది. ఏదైనా రాసి ఆ వ్యక్తికి ప్రత్యేకంగా వేరుపరచటము లేకపోతే ఆ వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి కృప అనుగ్రహించటం అనేటువంటిది మనం చూసాం.

మొదటి సమూయేలు గ్రంధంలో మనందరికీ గుర్తుంది కదా, 16 వ అధ్యాయంలో సమూయేలు దావీదుని అభిషేకిస్తాడు. 16 వ అధ్యాయము 13 వ వచనం. ఆ ఇప్పుడు దానికి ముందు 12 వ వచనంలో ఏమంటాడు? యెహోవా అతడు రాగానే నేను కోరుకున్న వాడు, ఇతడే 12 వ వచనం.

ఆఖరిలో ఏముందండి? నేను కోరుకున్న వాడు, ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను.

నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చూడండి, ఇక్కడ తైలాభిషేకముకు పరిశుద్ధాత్ముని యొక్క రాకడకు కూడా సంబంధం ఉన్నట్టుగా కనపడుతుంది. అట్లీస్ట్ మనకి ఆ ఇన్స్టెన్స్ లో తైలము రాయటము తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా ఆయనను ప్రత్యేకంగా ఆయనతో ఉండటము, ఆయనను నింపటము, ఆయనకు తోడుగా ఉండటం, ఆయనకు బలం ఇవ్వటము అనేటువంటిది.

అంటే బలముగా వచ్చెను అంటే ఆ దేవుని ఆత్మ ఆయన మీదకు బలముగా వచ్చెను. అంటే ప్రత్యేక పరిచాడు కాబట్టి ప్రత్యేక పరచబడ్డాడు కాబట్టి దేవుని యొక్క అభిషేకము జరిగింది. కాబట్టి ఆయన ఆత్మ ఆయనకు అనుగ్రహించబడింది.

కాబట్టి మనము దగ్గర దగ్గర సో మీనింగ్ అంటే దీని వెనకాల ఉన్న మీనింగ్. అది చాలా మంది ఆ ఓల్డ్ టెస్టమెంట్ కాంటెక్స్ట్ లో చదవకూడదు. ఫస్ట్ జాన్ ని గ్రీక్ కాంటెక్స్ట్ లో చదవాలి అని అంటారు. కానీ నేను దాన్ని అసలు అంగీకరించట్లేదు.

ఎందుకంటే మనకి ప్రత్యక్షత అనేటువంటిది మనం ఇలానే చూసుకోవాలి. అంటే ఓల్డ్ టెస్టమెంట్ నుంచే దేవుని ప్రత్యక్షతను చూసుకోవాలి. వేరే కాంటెక్స్ట్ లో నుంచి వేరే సందర్భాలను తీసుకొచ్చి బైబిల్ లో పెట్టకూడదు అనేటువంటిది నేను నమ్ముతున్నాను.

సో ఇక్కడ ఈ అభిషేకము పరిశుద్ధుడు ఇచ్చాడంట. ఈ అభిషేకము మనకు ఆయన ఇచ్చాడని రెండు వచనాల్లో చెప్పాడు. 20 వ వచనంలో చెప్పాడు, 27 వ వచనంలో చెప్పాడు. అంతేకాదు, ఆ అభిషేకము దేవుని బిడ్డల్లో నిలుస్తుందంట, నిలుచుచున్నది అనే మాట కూడా ఇంపార్టెంట్.

సో నిలుస్తా ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఈ కరెక్షన్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆ చాలా నేను అనుకుంటాను కొంచెం ఇంపార్టెంట్ కరెక్షన్. అదేంటంటే 20 వ వచనం ఆఖరిలో, అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు అని ఉంది కదండీ.

అర్థమైందా? సమస్తమును ఎరుగుదురు. ఈ సమస్తమును ఎరుగుదురు అనేటువంటిది ఓన్లీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఒక్క ట్రాన్స్లేషన్ లోనే ఉంది. కేజెవి లో ఉంది. ఎన్ కేజెవి అండ్ కేజెవి లోనే ఉంది. యు నో ఆల్ థింగ్స్ అని మిగిలిన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఏవి కూడా యు నో ఆల్ థింగ్స్ అని లేవు.

నేను ఎందుకు చెప్తున్నానో చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ ఎస్ వి ట్రాన్స్లేషన్, నేను ఒక్కొక్క ఒక ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. కేజెవి ఎన్ కే జెవి ఏం చెప్పింది? ఏం చెప్పిందంటే యు నో ఆల్ థింగ్స్ అని చెప్పింది.

యు నో ఆల్ థింగ్స్. ఈ ఎస్ వి ఎల్ ఏ ఎస్ పి ఎన్ ఎస్ పి మిగిలినవన్నీ కూడా హోల్ మెన్ ఎన్ ఐ వి అవన్నీ అలా చెప్పట్లేదు. అవన్నీ ఎలా చెప్తున్నాయి అంటే ఈ ఎస్ వి ఏం చెప్తుంది అంటే యు ఆల్ హావ్ నాలెడ్జ్ అని చెప్తుంది.

యు ఆల్ హావ్ నాలెడ్జ్. కన్ను యు నో ఆల్ థింగ్స్ కి ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉంది? యు నో ఆల్ థింగ్స్ అంటే మీకు అన్నీ తెలుసండి. తెలుగు బైబిల్ లో ఏముంది? సమస్తము మీరు ఎరుగుదురు. దగ్గర దగ్గర కేజెవి ఎన్ కేజివి లాగా ఉంది.

ఇక్కడ మీరు మిగిలిన ట్రాన్స్లేషన్స్ అన్ని చదివారు అనుకోండి. ఏమని ఉందో తెలుసా? నిజానికి ఇక్కడ ఏముందంటే, అంటే ఈ ఎస్ వి లో యు ఆల్ హావ్ నాలెడ్జ్ అని ఉంది. ఎల్ ఎస్ బి ఎన్ ఎస్ బి లో యు ఆల్ నో అని ఉంది. హోల్ మెన్ హెచ్ సిఎస్ లో హోల్ మెన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్ లో ఆల్ అఫ్ యు హావ్ నాలెడ్జ్ అని ఉంది.

ఎన్ ఐ వి లో ఆల్ అఫ్ యు నో ద ట్రూత్ అని ఉంది. మీరు అర్థం చేసుకుంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, నిజానికి అక్కడ ఏమని ఉండాలంటే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక మీ అందరికీ తెలియును అని ఉండాలి.

మీ అందరికీ తెలియును. మీ అందరూ ఎరుగుదురు అని ఉండాలి. మీకు సమస్తము తెలుసు కాదు. మీ అందరూ ఎరుగుదురు. మీ అందరూ ఎరుగుదురు లేకపోతే మీ అందరికీ తెలుసు అనేటువంటి మాట ఉండాలి. అన్నమాట, మీకు అన్ని తెలుసు కాదు. మీ అందరికీ తెలుసు.

అందరికీ తెలుసు అనటానికి మీకు అన్ని తెలుసు అనటానికి చాలా తేడా ఉంది. అందరికీ తెలుసు అనేటువంటిది నేను అనుకుంటాను. రైట్ ట్రాన్స్లేషన్ అక్కడ ఏమని ఉండాలంటే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక మీ అందరికీ మీరందరూ ఎరుగుదురు లేకపోతే మీ అందరికీ తెలుసు.

అలా ఉండాలి. సమస్తము మీరు ఎరుగుదురు అనేటువంటిది నేను చెప్పినట్టుగా ఒకే ఒక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆ పాతులో వెళ్లారు. నేను అనుకుంటాను మిగిలిన ట్రాన్స్లేషన్స్ కరెక్ట్ ఇక్కడ నేను అనుకుంటాను. అందరికీ తెలుసు.

ఇప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? అండి కొంతమంది ఏమని నమ్ముతున్నారు అంటే, దేవుడు ఈ అభిషేకాన్ని ప్రత్యేకమైన వారి కోసమే ఇస్తాడు అని నమ్ముతున్నారు.

ప్రత్యేకింపబడిన వారు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు, గొప్ప సేవకులు, తెల్లని బట్టలు వేసుకొని తిరిగేటువంటి వాళ్ళు, ఎక్కువ ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు, ఎక్కువ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, ఎక్కువ ధ్యానించి చేటువంటి వాళ్ళు. వాళ్ళకు మాత్రమే ఈ అభిషేకం ఉంది. ఈ అభిషేకము అందరికీ లేదు అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.

కానీ యోహాను ఏం చెప్తున్నాడో తెలుసా? అండి ప్రతి విశ్వాసికి అభిషేకం ఉందని చెప్తున్నాడు. యోహాను ఏం చెప్తున్నాడు అంటే ప్రతి విశ్వాసికి కూడా అభిషేకము ఉంది. అభిషేకం ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఆ మాట నేను ఇందాక అదే 20 వచనం ఆఖరిలో ఉన్నాను కదా.

ఆఖరిలో ఏమని ఉంది అంటే మీరందరూ ఎరుగుదురు అని ఉంది. అంతేగాని మీలో కొంతమందికి తెలుస్తది, కొంతమందికే ఉంది. అలా లేదన్నమాట. చూడండి, ఇంకోటి కూడా, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందారు అంటే మీరు అంటే ఎవరు? ఆ మరి అక్కడే చెప్తుంది కదా.

విషయం ఏంటి అనేటువంటిది? ఈ అభిషేకము అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తికి ఇచ్చినటువంటిదో లేకపోతే పాస్టర్ గారి దగ్గర అభిషేకం ఉంటది, మిగిలిన వాళ్ళ దగ్గర అభిషేకం ఉండదు. అసలు ఆ ఇంటర్ప్రిటేషన్ మొత్తం రాంగ్. అలాంటి బోధే తప్పుడు బోధ.

మీరు అలాంటి బోధను మీరు అంగీకరించకండి. ఎందుకంటే ఇది కృపగల దేవుడు అందరికీ, విశ్వాసులందరికీ ఇచ్చినటువంటి అభిషేకం. ఇది మీరు ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ అభిషేకము లేకపోతే నిజంగా అతను విశ్వాసి కాదు.

ఈ అభిషేకం గనుక లేదనుకోండి, అతను విశ్వాసి ఎలా అవుతాడు? అవ్వడు కదా? విశ్వాసి అవ్వలేడు. దేవుడిలో నిలబడలేడు. సత్యంలో నిలబడలేడు. దేవునితో నడవలేడు. ఇదంతా జరగదు. ఇదంతా జరగదు. కాబట్టి ఈ అభిషేకము అనేటువంటిది ఒక వ్యక్తికి లేకపోతే కొంతమంది వ్యక్తులకు దేవుడు ఇచ్చాడు అని చెప్పి కొంతమంది బోధిస్తా ఉంటారు.

దయచేసి మీరు నమ్మకండి. ఒకాయన నాకు గుర్తుండి, 2012 ఆ సంవత్సరంలో నేను అబుదాబిలో ఉన్నప్పుడు, ఒకాయన అబుదాబి వచ్చాడు. ఒక బోధకుడు, బోధకుడు వచ్చి అభిషేకము, అభిషేకము, అభిషేకం అని కేకలు పెట్టాడు. చాలా సేపు అరిచాడు. దేవుని వాక్యం చెప్పలేదు.

ఈ పదము చాలాసార్లు వాడాడు. వాడాడు అటు ఇటు ఇటు తిరిగాడు. స్టేజ్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్వస్థతలు చేస్తాను అన్నాడు. అద్భుతాలు చేస్తాను అన్నాడు. మామూలుగా అసలు ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నేను అసలు అక్కడ కూర్చోలేకపోయాను.

అతను ఒక కారణం నేను ఉద్యోగం వదిలేయడానికి, నేను ఉద్యోగం విడిచిపెట్టి దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాలి అని నన్ను నెట్టినోళ్ళలో అతను ఒకడు. అతను వాడిన పదం ఇదే, ఏ పదము? అభిషేకం. అతను చెప్తున్న పాయింట్ ఏంటంటే, అభిషేకము ప్రత్యేకంగా దేవుడు అందరికీ ఇవ్వడంట. అందరికీ ఇచ్చేది కాదు, ప్రత్యేకంగా కొంతమందికే వస్తుందంట.

నిజానికి టెక్స్ట్ అలా చెప్పట్లేదు. అండ్ అబద్ధ బోధకులు అబద్ధం చెప్తున్నారు. ఇది అందరికీ దేవుడు ఇచ్చినటువంటి అభిషేకం. ఇది ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి అభిషేకం. అది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి.

27 వ వచనంలో కూడా చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అభిషేకాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్క లేయర్ మనం బయటికి తీయాల్సిందే.

సో, అభిషేకం ఏంటో తెలుసుకోవాలంటే, అభిషేకం ఉంటే మనకు సత్యం తెలుస్తుందంట. అభిషేకం ఉంటే మనకు అసత్యం అంటే ఏంటో తెలుస్తుంది అంట. అంతేకాదు, అభిషేకం ఉండటం వలన ఇంకేం తెలుస్తుందంట? మనకి ఎవరు బోధింపనక్కర్లేదు. ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏముంది? అభిషేకము.

మీరు వెంటనే ఏమంటారో తెలుసా? పాస్టర్ గారు మా అందరికీ లేదు అనుకుంటా, అభిషేకము ఎందుకంటే మీరు బోధిస్తున్నారు. మీరు వెంటనే ఏమంటారు? మాలో ఎవ్వరికీ నో వన్ హాస్ అనాయింట్మెంట్ బికాజ్ యు ఆర్ టీచింగ్ అస్.

బట్ ద వర్స్ సేస్ దట్ ఇఫ్ యు హావ్ అనాయింటింగ్, నో నీడ్ టు టీచ్ యు. బట్ ఐ యామ్ టీచింగ్ కాబట్టి, దేర్ ఫోర్ యు డోంట్ హావ్. యు డోంట్ హావ్. అంతేనా కదా? సో ఇక్కడ అభిషేకం మీలో నిలుచున్నది గనుక ఎవడు మీకు బోధింపనక్కర్లేదు.

ఓకే, ఓ అయితే నాలో గనుక అభిషేకం ఉంటే, నేను నాకు ఎవరు ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరం లేదు. బై ది వే, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారో లేదో. ఇప్పుడు ఇంతకీ యోహాను చేస్తుంది ఏంటి? యోహాను పత్రిక రాస్తున్నాడు కదా.

యోహాను ఏం చేస్తున్నాడు? మరి బోధిస్తున్నాడు కదా. మళ్ళీ ఏమో, ఆయన ఏమంటున్నాడు? మీకు అభిషేకం ఉంటే, మీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు అని చెప్పి మళ్ళీ ఒక లెటర్ రాస్తున్నాడు కదా. ఆ లెటర్ నేను నించుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా.

ఇప్పుడు ఆయన బోధిస్తున్నాడు మళ్ళీ లెటర్ ద్వారా. నేను నుంచొని మళ్ళీ నేను బోధిస్తున్నాను అంటే, ఇప్పుడు అంటే ఆయన చెప్తున్న దానికి ఆయన కాంట్రడిక్ట్ గా మాట్లాడుతున్నాడు. కాంట్రడిక్టింగ్ గా మాట్లాడుతున్నాడా అంటే, అభిషేకం మీలో ఉంది కాబట్టి మీకు బోధించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయనే లెటర్ రాస్తా.

మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఒక బోధకుడిని నుంచోబెట్టి మళ్ళీ దాని వివరణ ఇస్తా. ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆ అభిషేకం మీలో ఉంటది కాబట్టి మీకు బోధించాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఒకటి చెప్పాడు. ఇంకా ఇంకేం చెప్పాడు? ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు.

ఆ ఇప్పుడు ఆయన ఇచ్చిన అభిషేకము ట్రూత్ అంట. ఆయన ఇచ్చిన అభిషేకం అబద్ధం కాదంట. ఏంటి అసలు? నిజంగా ఇది ఆయన ఇచ్చిన అభిషేకం నిజమేనంట. ఆయన ఇచ్చిన అభిషేకం అబద్ధము కాదండి. అయితే ఎందుకు? ఏమై ఉంటది అంటారు?

అభిషేకం, ఆ అభిషేకం ఉంటేనేమో మనకు సత్యం తెలుస్తది. ఆ అభిషేకం ఉంటేనేమో మనకు అసత్యం కూడా తెలుస్తది. ఆ అభిషేకం ఉంటేనేమో మనకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. ఆ అభిషేకం ఏమో సత్యము. ఆ అభిషేకం ఏమో అబద్ధం కాదు. ఎందుకు? ఏంటి?

ఆ అభిషేకం అంటే మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా? థింకింగ్ ఫాలో అవుతున్నారా? థింకింగ్ ఇంకేమైనా ఉందా? ఇక్కడ అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను. అది అంటే ఏంటి? అది అనే స్థానంలో ఆయన ఇచ్చిన అభిషేకము అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను.

అయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆ అభిషేకం అంట అన్నిటిని గూర్చి మీకు బోధిస్తుందంట. ఆ అభిషేకము ఆయన ఇచ్చినటువంటి అభిషేకము అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్నది.

కాబట్టి అంతేకాదు, ఆయన కూడా బోధిస్తున్నాడు. అభిషేకం కూడా బోధిస్తుంది. దాంట్లో మీరు నిలుచుండి, ఆయనలో మీరు నిలుచుని ఉండండి. అది అభిషేకము ఉంటే మీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు అభిషేకమే మీకు బోధిస్తది.

ఆ అభిషేకం నిజమే. ఆ అభిషేకం అబద్ధం కాదు. అభిషేకం ఉంటే ఆ సత్యం తెలుస్తది. ఆ అభిషేకం ఉంటే అసత్యం కూడా మీకు తెలుస్తది. ఈ అభిషేకాన్ని దేవుడే ఇచ్చాడు. ఈ అభిషేకం అందరికీ ఉంది.

ఆ ఇప్పుడు ఇంతకు ఏంటది? ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పటివరకు మనం అట్లీస్ట్ టెక్స్ట్ లోనే అటు ఇటు చూడటానికి ప్రయత్నం చేశాం కదా. ఆన్సర్ చెప్తున్నాను. ఆన్సర్ చెప్పిన తర్వాత నేను లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏ అభిషేకం ఇస్తాడు అనేటువంటిది నేను ఎందుకు కంక్లూడ్ అయ్యానో కూడా నేను చెప్తాను.

అది చెప్తే మీకు ఇంకా అయిపోయింది. ఈరోజు డిస్కషన్ అంతా అయిపోయినట్టే మనం మాట్లాడాలి అనుకున్న పాయింట్ కి కంక్లూజన్ వచ్చేసింది. ఇది నేను మొదటిసారి బైబిల్ చదవట్లేదు. నేను మొదటిసారి బైబిల్ చదవట్లేదు.

మీరందరూ మొదటిసారి బైబిల్ చదవట్లేదు. మనకన్నా ముందు 2000 సంవత్సరాలు చర్చి ఈ పత్రికను చదివింది. చదివి వాళ్ళు దీన్ని ఈరోజు నేను ఎలాగైతే లైన్ ఆఫ్ రీజనింగ్ చేశానో, ఇలాంటి లైన్ ఆఫ్ రీజనింగ్ కొన్ని లక్షల మంది చేశారు. చరిత్ర, సంఘ చరిత్రలో ఈరోజు ఏమో నేను కొత్తగా చేసినటువంటి లైన్ ఆఫ్ రీజనింగ్ కూడా కాదు.

అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన ముందు చాలా మంది దైవజనులు దేవుని వాక్యాన్ని చదివారు. వాళ్ళందరి భుజాల మీద నిలబడి మనం వాక్యం నేర్చుకుంటున్నాము. సంఘ చరిత్రలో ఈ అభిషేకాన్ని, అభిషేకం ఏంటి అనేటువంటిది ప్రశ్నకు ప్రాముఖ్యంగా రెండు ఆన్సర్లు ఉన్నాయి.

ప్రాముఖ్యంగా ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి? రెండు ఆన్సర్లు ఉన్నాయి. ఈ రెండు ఆన్సర్లు, ఆన్సర్లు ఏంటో చెప్తాను. మెయిన్ అసలు అభిషేకము అంటే ఏంటంటే, సంఘము, సంఘ చరిత్రలో ఏం చెప్పింది అంటే, అభిషేకం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చేటువంటి అభిషేకము ఒకటి.

ఇది కొంతమంది చెప్పారు. ఇంకొకటి, ఇదని కొంతమంది చెప్పారు. వీళ్ళిద్దరూ ఈ రెండు దృక్పదాలు చెప్పి నేను ఏం నమ్ముతున్నానో చెప్తాను. చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్, ఫస్ట్ ఏమన్నారంటే, దేవుడు పరిశుద్ధుడు మనందరికీ విశ్వాసులందరికీ ఇచ్చినటువంటి అభిషేకము.

దేవుని సువార్త, గాస్పెల్ ఏంటండీ? ఫస్ట్ ది ఏంటి? గాస్పెల్. గాస్పెల్ సువార్త. సువార్త ప్రాముఖ్యంగా సువార్త దేవుని వాక్యము అని అనొచ్చు. మనము క్రీస్తు వాక్యము, దేవుని వాక్యము లేకపోతే సువార్త. ఆ ద గాస్పెల్.

గాస్పెల్ అనే మాట నేను అన్నాను. అనుకోండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ద గాస్పెల్ అంటే మీరు వెంటనే గాస్పెల్ మీటింగ్ లో అది అది కాదు. నేను మాట్లాడుతుంది గాస్పెల్ అంటే ఏంటంటే దేవుని కుమారుని గూర్చినటువంటి సువార్త.

దేవుని కుమారుని గూర్చినటువంటి సువార్త. దేవుని సువార్త రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో దేవుని సువార్త అంటాడు. మొదటి అధ్యాయంలోనే 10వ వచనంలో దేవుని కుమారుని గూర్చిన సువార్త, క్రీస్తును గూర్చిన సువార్త అంటాడు.

సువార్తలో ప్రాముఖ్యంగా మనము చెప్పాల్సింది మనిషి గురించి కాదు. చెప్పేది మనిషి గురించి కాదు. సువార్తలో మనం చెప్పాల్సింది దేవుడి గురించి. ప్రాముఖ్యంగా మనం చెప్పాల్సింది ద డివినిటీ అండ్ హ్యూమనిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్.

మనము సువార్తలో చెప్పాల్సింది క్రీస్తు యొక్క దైవత్వము, క్రీస్తు యొక్క మానవ స్వభావము. సువార్తకు అది గుండె. సువార్తకు గుండె ఏంటంటే, జీసస్ క్రైస్ట్ ఇస్ ద హార్ట్ అఫ్ ది గాస్పెల్. ఆయన సువార్తకు గుండె.

సో ఆయన ఎవరు అనేటువంటిది మనం చెప్పకుండా నేను సువార్త చెప్పాను అని అన్నాము. అనుకోండి, నిజానికి నువ్వు ఏం చెప్పలేదు. నువ్వు సువార్తే చెప్పలేదు. అసలు అసలు ఆయన ఎవరో చెప్పకుండా, ఆయన పర్సనే చెప్పకుండా, ఆయన వ్యక్తిగా ఎవరు? ఆయన వ్యక్తిగా ఆయన దేవుడు.

అయన వ్యక్తిగా ఆయన మానవ స్వభావం కలిగిన వాడు. రెండు నేచర్స్ ఉన్నటువంటి ఒక పర్సన్. ఆయన ఎందుకు దేవుడు హ్యూమన్ నేచర్ ని యాడ్ చేసుకోవాల్సి వచ్చింది అని నువ్వు చెప్పకుండా, నువ్వు సువార్త చెప్పావు అనుకోండి.

సువార్త చెప్పడం వల్ల వాళ్ళు నిత్యజీవానికి ఎవరు రాలేరు. పాప క్షమాపణ ఎవరికీ దొరకదు. సో గాస్పెల్ లో కోరు ఎవరు? అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరు అని చెప్పేదే కోరు. ఇక్కడ కూడా ఈ విషయం ఏంటి? ప్రాబ్లం ఏంటి?

18 వ వచనం నుంచి 27 వ వచనం వరకు ఫాల్స్ గాస్పెల్. ఫాల్స్ గాస్పెల్ అంటే అర్థం ఏంటంటే, జీసస్ క్రైస్ట్ గురించి తప్పు చెప్తున్నారు. తప్పు చెప్తున్నప్పుడు ఈయన కౌంటర్ చేస్తా. ఏమంటున్నాడు అంటే, యు నో ద ట్రూ గాస్పెల్.

గాడ్ గేవ్ యు ద ట్రూ గాస్పెల్. మీకు నిజమైన సువార్త దేవుడు ఇచ్చాడు. నిజమైన సువార్త మీకు తెలుసు అని చెప్పి చెప్తున్నాడు. చెప్తున్నాడు అని నిజానికి సంఘ చరిత్రలో చాలా మంది ఈ అభిషేకాన్ని ఏమన్నారంటే, ఓ దేవుడు వీళ్ళ కన్నులు తెరిచాడు.

మహిమ గల సువార్తను, క్రీస్తును గురించిన సువార్తను వినటానికి, అర్థం చేసుకోవడానికి దేవుడు వీళ్ళ కళ్ళు తెరిచాడు. ఈ యుగ సంబంధ దేవత మనోనేత్రం, మన మనుషుల మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేసిన కూడా క్రీస్తు యొక్క మహిమ సువార్తను అర్థం చేసుకోవడానికి వీళ్ళ కళ్ళు తెరిచాడు దేవుడు.

అది అదే అభిషేకము. ఈ అభిషేకం ఉన్నప్పుడు అంధకార హృదయములో వెలుగు కలుగుతది. కలగటం ద్వారా వాళ్ళు లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క మహిమను, ఆయన సిలువను, ఆయన మరణాన్ని, ఆయన విమోచనను, పాప క్షమాపణను వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటారు.

అయన అర్థమైతే మిగిలిందంతా అర్థమవుతుంది. మిగిలిందంతా ఒక్కసారి ఆయన గనుక మన హృదయాలను వెలిగించాడు అంటే సమస్తము వెలిగించబడుతుంది. కాబట్టి దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి అభిషేకము సువార్త అని కొంతమంది చెప్తారు.

సో దానికి కారణాలు ఏంటో చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇప్పటి వరకు వివరించానండి. మీకు సువార్త అనగానే అసలు కాదు. పాస్టర్ గారు మీకు సరిగ్గా అర్థం చేసుకోలేరు. బైబిల్ చదవటం మీకు రాదని అంటారేమో అని ఇంత ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను.

నేను సువార్త అంటే ఏంటి అనేటువంటిది మీరు అంత సింపుల్ గా తీసుకోవద్దు. దీన్ని అంత ఈజీ ఏం కాదు. సో ఎందుకు 20 వ వచనంలో ఫిట్ అవుతదా? సువార్త అనేటువంటిది అభిషేకం దగ్గర సువార్త అని పెట్టాను. ఫిట్ అవుతదా? అయితే మీరు పరిశుద్ధుని వలన సువార్తను పొందారు కాబట్టి మీకు సమస్తము తెలుసు.

ఫిట్ అవుతుంది కదా? ఫిట్ అవుతుందా? ఫిట్ అవ్వట్లేదా? ఫిట్ అవుతుంది. అంతే కాదు, 27 వ వచనంలో కూడా, అయితే ఆయన వలన మీరు పొందిన సువార్త లేకపోతే వాక్ వాక్యము మీలో నిలుస్తున్నది గనుక ఎవడు మీకు బోధించన అవసరం లేదు.

గాస్పెల్ మీకు క్లియర్ గా ఉంది కదా? గాస్పెల్ మీకు క్లారిటీ ఉంది కాబట్టి మీకు ఎవరు మళ్ళీ బోధించాల్సిన అవసరం లేదు. మీకు క్లారిటీ ఉంది. జీసస్ క్రైస్ట్ ఎవరో మీకు తెలుసు. ఆయన ఎవరో మీకు తెలుసు. మీకు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఓ జీసస్ క్రైస్ట్, అది కాదు, జీసస్ క్రైస్ట్, ఇది కాదు అని మీకు ఎవరు బోధించాల్సినటువంటి అవసరము లేదు.

ఫిట్ అవుతుంది కదా? సో తర్వాత ఇంకొకటి మనం ఏమన్నాము? అభిషేకం ఉంటే సత్యం తెలుస్తుంది అన్నాం కదా. అబద్ధం ఏంటో కూడా తెలుస్తుంది అన్నాం కదా. మరి సువార్త తెలిస్తే సత్యం తెలిసిందా లేదా? అసత్యం ఏంటో కూడా తెలిసిందా లేదా? అంటే అక్కడ కూడా సువార్త అనేటువంటిది లేకపోతే దేవుని వాక్యం అనేటువంటిది అభిషేకం దగ్గర అక్కడ కూడా పాస్ అవుతుంది.

ఇంకొకటి, అది మీలో నిలుస్తుంది అన్నాడు కదా. ఏంటది? అభిషేకం. అభిషేకం మీలో నిలుస్తుంది అన్నాడు కదా. మరి సువార్త మనలో నిలవదా? నిలుస్తుంది కదా. సువార్త కూడా మనలో నిలుస్తుంది కదా. ఎవరు బోధించనక్కర్లేదు అన్నాడు కాబట్టి ఎవరు బోధించనక్కర్లేదు.

మనము సువార్త సత్యమే కానీ అసత్యం కాదు. అది కూడా మనం మాట్లాడాము. తర్వాత ఇంకొకటి, దీనికి సపోర్ట్ చేయడం కోసం 24 వ వచనం కూడా కోట్ చేస్తారు. అంటే అభిషేకము, దేవుని వాక్యము, దేవుని సువార్త అని చెప్పేటువంటి వాళ్ళు సపోర్ట్ చేయడం కోసం 24 వ వచనాన్ని కూడా కోట్ చేస్తారు.

24 వ వచనంలో ఏముంది? చూడండి, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో, అది మీలో ఆ ఏంటది? వాళ్ళు మొదటి నుంచి వింది సువార్తే కదా. ఆ సువార్త కాబట్టి మీరు సువార్త దేన్నైతే విన్నారో, అది మీలో నిలిచి ఉండనివ్వండి అంటున్నారు.

మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన యెడల అంటే సువార్త మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉంటారు కాబట్టి మీరు సువార్తలో నిలిచి ఉండండి. సో కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి అభిషేకం సువార్త, క్రీస్తును గురించినటువంటి సువార్త, మహిమ గల సువార్త.

సో దాంట్లో మీరు నిలిచి ఉండండి. అది మీకు తెలిస్తే, లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ఆయన ఏం చేసాడో మీకు అంతా తెలుసు. మీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. అది సత్యము. అది కాకుండా ఇంకా ఎవరు ఏం చెప్పినా కూడా, అది భిన్నమైన సువార్తే, అది అబద్ధమే.

మీరు దాన్ని వినాల్సిన అవసరం లేదు అనేటువంటిది బేసికల్ గా ఇంకొక వచనం కూడా కోట్ చేస్తారు. అది యోహాను రాసిన రెండవ పత్రిక, తొమ్మిదవ అధ్యాయంలో ఈ మాట ఉంటది. అన్నమాట, క్రీస్తు బోధ అనేటువంటి మాట ఉంటది.

క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచిపెట్టిన ప్రతివాడును ఆయన దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. క్రీస్తు బోధ యందు అంటే అర్థము ప్రాముఖ్యంగా గాస్పెలే కదా.

కోర్ ఇస్ వాట్ గాస్పెల్? ఇఫ్ యు స్టాండ్ ఇన్ ద గాస్పెల్, యు స్టాండ్ ఇన్ క్రైస్ట్. సువార్తను వదిలిపెట్టేసావు అనుకో, అయిపోయినట్టే. సో, అభిషేకము సువార్త అని చెప్పి, ఆ చాలా మంది చెప్తారు.

ఇప్పుడు కూడా చాలా మంది దైవజనులు సువార్తే అని నమ్ముతారు. అభిషేకం, అభిషేకం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అభిషేకం. ఏంటంటే సువార్త అనేటువంటిది నిజమైన సువార్త, అబద్ధ సువార్త కాదు. నేను చెప్తున్నాను, నిజమైన సువార్త, నిజంగా క్రీస్తు ఎవరో తెలుసుకొని, నిజంగా ఆయన ఏం చేసాడో తెలుసుకునేటువంటిది నిజమైన సువార్త.

ఇంకా కొంతమంది అభిషేకం. ఇప్పుడు రెండో సైడ్ కి వస్తున్నాను. ఒక సైడ్ చెప్పేసాను. సెకండ్ సైడ్. ఇప్పుడు రెండో సైడ్ చెప్తున్నాను. ఈ అభిషేకము ఏంటంటే దేవుడు మనందరికీ, విశ్వాసులందరికీ దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు అంటారు.

రెండో సైడ్ ఇంకొక సైడ్ ఆర్గ్యుమెంట్ నేను చెప్తున్నాను. ఈ అభిషేకం ఏంటి? పరిశుద్ధాత్మ. గాడ్ ది హోలీ స్పిరిట్. సో దానికి కారణాలు ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి.

మొట్టమొదటిగా క్రీస్తు అంటేనే అర్థము అభిషక్తుడు. క్రీస్తు అంటేనే అభిషక్తుడు. ఈ అభిషక్తుడు పరిశుద్ధాత్మతో అభిషేకము పొందినటువంటి వాడు. మీరు అనుకుంటున్న అట్టుగా తైలాభిషేకం కాదు. ఇక్కడ మనము లిటరల్ అనాయింటింగ్ కాదు, స్పిరిట్ అనాయింటింగ్ అంటాం కదా.

మనము ఈయన, ఈయన ఎవరు? ఈయన అభిషేకించబడ్డాడు. ఎవరు అభిషక్తుడు? అభిషేకించబడ్డాడు. దేనితో అభిషేకించబడ్డాడు? ఎవరితో అభిషేకించబడ్డాడు? ఎవరితో? పరిశుద్ధాత్ముడితో అభిషేకించబడ్డాడు.

ఇప్పుడు మనము జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి వస్తున్నాం అన్నమాట. జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి వచ్చి టెక్స్ట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆయన పేరు అభిషక్తుడు. ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకము పొందినటువంటి వాడు.

మీరు యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనాలను చదువుదాము. ఇది చదువుతుండగా, దయచేసి మీరు దాని పార్లల్ లూక్ 418 కూడా పట్టుకొని ఉండండి. లూకా సువార్త నాలుగవ అధ్యాయము 18 వ వచనం. అది కూడా ఓపెన్ చేసి పెట్టండి. రెండు ఒక్కసారి చదివేద్దాం. చదివితే మనకి క్లారిటీ ఉంటది.

ఓకే, 21వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను.

ఆ ఆ ఈ అభిషేకము అనేటువంటిది పరిశుద్ధాత్ముడికి అభిషేకానికి కనెక్షన్ మనం ఇక్కడ చూస్తాం. దేవుడు ఆయన్ని ప్రత్యేకంగా, ఆయన ఆత్మను పంపించాడంట. పంపించి ఆయనను ప్రత్యేకంగా సువార్త, సువార్త కోసము, దీనిలోకి సువార్త ప్రకటించడం కోసం ఆయన అభిషేకించాడు అనేటువంటిది మనం చూస్తాం.

లూకా సువార్త నాలుగవ అధ్యాయం 18 వ వచనం సేమ్ కోట్ చేస్తాడు కదా. ఇక్కడ ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇది ఆత్మ అయిన దేవుడికి అభిషేకానికి ఉన్నటువంటి కనెక్షన్.

సో, పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు రావడం, ఆయన ప్రత్యేకంగా అభిషేకించబడటం, ఆత్మతో అభిషేకించబడటం అనేటువంటిది మనము చూస్తాం అన్నమాట. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 38 వ వచనంలో ఈ మాటను మనం చదువుతాం. 10వ అధ్యాయము 38 వ వచనం చేయండి.

మరల మీరు ఆయన బాప్టిజం దగ్గర మీకు అందరికీ తెలుసు. ప్రభువు యొక్క బాప్టిజం దగ్గర ఏం జరిగింది? ప్రభువు యొక్క బాప్టిజం దగ్గర, ఈ నా ప్రియ కుమారుడైన పరలోకం నుండి తండ్రి సాక్ష్యం ఇస్తా ఉండగా, పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం.

అయనను ప్రత్యేకంగా దేవుడు అభిషేకించాడు. దేనితో? పరిశుద్ధ పరిశుద్ధ యొక్క ఆత్మతో అభిషేకించాడు. 38 వ వచనం అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనుదియే. అభిషేకించాడా లేదా? దేనితో అభిషేకించాడు? దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మతో శక్తితో ఆయనను అభిషేకించాడు.

సో ఆయన అభిషక్తుడు. మనం ఆయన పేరు క్రీస్తు అంటేనే అభిషక్తుడు అని అర్థం. మెస్సయ్య అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. అభిషక్తుడిని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. కానీ దేనితో? అభిషేకించాడు పరిశుద్ధాత్మతో.

ఇస్ నాట్ ఆయిల్ అనాయింటింగ్ అంటే ఆయిల్ పూయలేదు కుమారుడి మీద. ఆయన ఆయిల్ పూయలేదు కదా. దట్స్ నాట్ తైలాభిషేకం కాదు. మనం కింగ్ చూసాం. డేవిడ్ కింగ్ డేవిడ్ చూసాం. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆ టాపిక్ లోకి నేను వెళ్ళట్లేదు.

బట్ నేను ఇక్కడ గాడ్ ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్ గురించే మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడితో ఈయనను అభిషేకించాడా లేదా? దేవుడు అభిషేకించాడు. అభిషేకించాడు కదా. సో ఆయన అభిషక్తుడు. ఆయనను క్రీస్తు, క్రీస్తు, క్రీస్తును పరిశుద్ధాత్మతో అభిషేకించాడు.

అంతేకాదు, దేవుడు మనలను కూడా అభిషేకించాడు. పరిశుద్ధాత్మతో మనము అంటే విశ్వాసులను కూడా దేవుడు అభిషేకించాడు అనేటువంటిది మనము చూస్తాం. కోరింథీయులకు రాసిన పత్రిక, రెండో కోరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము.

ఇక్కడ కూడా అభిషేకానికి ఆత్మకు ఉన్న రిలేషన్షిప్ మనం చూస్తాం. మొదటి అధ్యాయం 21 వ వచనం, 22 వ వచనంలో మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు ఆ దేవుడే.

అయన మనకు ముద్ర వేసి మన మన హృదయములలో మనకు ఆత్మ అను సంచి కరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన అభిషేకించాడు. అభిషేకించడంతో పాటు ఆయన ముద్ర వేసి మనకు ఆత్మ అను సంచి కరువును కూడా అనుగ్రహించాడు.

ఇక్కడ మనకి అభిషేకించాడు. ఆత్మతో అభిషేకించాడు అని డైరెక్ట్ గా లేదు. కానీ అభిషేకించాడు. ఆయన విశ్వాసులను అనేటువంటిది మనకు అర్థమవుతుంది. తర్వాత ఆయన ఆత్మ అనేటువంటి సంచి కరువును దేవుడు మనకు అనుగ్రహించాడు.

ముద్ర వేసాడు అనేటువంటిది కూడా మనకి ఆ అర్థమవుతుంది. అర్థమవుతుంది కదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మనల్ని నిజానికి ఇక్కడ రెండు, రెండు కలిసి వస్తాయి అన్నమాట.

మొదటి పాయింట్, రెండో పాయింట్ అంటే మొదటి వ్యూ, రెండో వ్యూ. రెండు వ్యూస్ ఒకే చోట కలిసి వచ్చినట్టుగా అనిపించింది నాకు. 13 వ వచనంలో మీరును సత్య వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి.

ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి? సువార్త ఉంది ఇక్కడ. పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు మనం అంటే ఫస్ట్ వ్యూ తీసుకున్న వాళ్ళకేమో ఈ వచనం ఎలా కనిపిస్తుంది అంటే ఓ సువార్తతో దేవుడు మనల్ని అభిషేకించాడు అన్నట్టు కనిపిస్తుంది.

ఈ వచనం ఇటువైపు తీసుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ వచనం చూడగానే ఓ కరెక్టే సువార్త విన్నారు. కానీ మనల్ని దేవుడు అభిషేకించింది దేనితో? ముద్రించింది దేనితో? పరిశుద్ధాత్మతో అని చెప్పి చాలా మంది ఇది నిజానికి ఇది విశ్వాసులకు సంబంధించింది. ఇది క్రీస్తుకు సంబంధించింది కాదు.

ఎఫెసీయులు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము, రెండో కోరింథీయులకు రాసిన పత్రిక చదువుతున్నటువంటిది. నేను క్రీస్తుకు సంబంధించింది. క్రీస్తును దేవుడు పరిశుద్ధ ఆత్మతో అభిషేకించాడు. కరెక్ట్. విశ్వాసులను కూడా దేవుడు, దేవుడు ఆత్మతో ముద్రించాడు అనేటువంటిది.

అయితే మనం చదివాము. తర్వాత అభిషేకించాడు అనేటువంటిది కూడా మనము చదివాము. అంతేకాదు, ఇంకొకటి చూడండి. పరిశుద్ధాత్ముడికి మనము పరిశుద్ధాత్ముడిని ఎప్పుడూ కూడా న్యూ టెస్టమెంట్ లో ఎలా చూస్తాం అంటే, ఆయనను సత్య స్వరూపిగా చూస్తాం.

సత్య ఆయన పేరే సత్య స్వరూపి అయిన ఆత్మ అంటే అర్థం ఏంటంటే, ఆయన ఏం చెప్తాడు? సత్యమే చెప్తాడు. సత్యమే సత్యములో నిలబెడతాడు. మనకు సత్యము చెప్తాడు. ఆయన నిజానికి మనము సత్యము దగ్గరికి రావటానికి కూడా కారణం ఆయనే కదా.

ఆయనే సత్య స్వరూపి అయిన ఆత్మ అని మనం మరల మరల చదువుతాం. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలోనే నాలుగవ అధ్యాయం, ఆరవ వచనంలో ఆయన గురించి ఏమని ఉంటుంది? సత్య స్వరూపి అయిన ఆత్మ అనే మాట మనం అక్కడ చూస్తాం.

ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో మీరు తెలుసుకొనుచున్నారు అంటాడు కదా. ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో ఆత్మ సత్యము గనుక అనే మాట ఉంది కదా. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే అనేటువంటి మాట.

మీరు యోహాను సువార్తలోకి వెళితే, మనం మరల మరల చూసేటువంటి సత్యము ఏంటంటే, ఆయన సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. 14 16 చదవండి. యోహాను సువార్త 14 వ అధ్యాయం 16 వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును.

ఇప్పుడు సత్య స్వరూపి అనేటువంటి మాట ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అభిషేకము ఉంటే మనకు సత్యం తెలుస్తది. అభిషేకం ఉంటే అసత్యం అంటే ఏంటో కూడా తెలుస్తది. సో, ఆ సత్యములోకి నడిపించగలిగిన వాడు, సత్య స్వరూపుడైనటువంటి దేవుని ఆత్మ, సత్యము మనకు తెలియజేయగలిగిన వాడు పరిశుద్ధాత్ముడే.

అందుకని నేను చెబుతున్నాను అన్నమాట. రీసన్ ఆ ఏంటని మీలో కొంతమందికి అనిపించొచ్చు. ఆ 15వ అధ్యాయం 26 వ వచనం. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణ కర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అనేటువంటి మాట మనం చూస్తాం.

16 వ అధ్యాయం 13 వ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. సో ఈ అభిషేకము పరిశుద్ధాత్ముడు అని ఎందుకు నమ్ముతున్నారు అంటే, పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపి అయినటువంటి వాడు. ఆయన ఎప్పుడూ సత్యమే చెప్తాడు. ఆ సత్యములో మనము నిలబడటానికి కారణం ఆయనే.

ఎందుకంటే మనకు సత్యము తెలుసు. మీకు అసత్యం ఏంటో తెలుసు అని అంటున్నాడు కాబట్టి, సత్యము ఇవ్వగలిగిన వాడు, చెప్పగలిగిన వాడు, ఆయన ఒక్కడే అనేటువంటి దానికి ఆ పాయింట్ నేను చెప్పడం జరిగింది.

ఇంకొకటి ఏంటో తెలుసా? అండి, ఆయనే అభిషేకం. అయితే గనుక ఆయన మనకు అన్ని బోధిస్తాడు అన్నాడు కదా. ప్రభువే చెప్పాడు కదా, ఆయన మీకు అన్ని బోధిస్తాడు. ఆ మీకు ఆయన అన్ని బోధిస్తాడు అని చెప్పాడా లేదా?

ప్రభువు ఎవరి గురించి? పరిశుద్ధాత్ముడు గురించి. మనం 14 వ అధ్యాయము 26 వ వచనం యోహాను సువార్త 14 వ అధ్యాయం 26 వ వచనం చదవండి. ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు, పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించును.

అంటే అన్ని విషయాలు మీకు ఆయన బోధిస్తాడు. గనుక ఎవడు మీకు బోధింపనక్కర్లేదు? ఆయన బోధిస్తాడు. ఆయన బోధిస్తాడు కాబట్టి, అది అన్నిటిని మీకు బోధించుచున్న ప్రకారం అన్నాడు కదా.

ఫస్ట్ జాన్ 27 వ వచనంలో ఏమని ఉంది? ఆ అది ఉంటే మీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు అన్నాడు. రెండు, ఆ అభిషేకం అన్నిటిని మీకు బోధిస్తుంది అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేస్తుంది. అదే కదా.

మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మరల యోహాను సువార్త 14 వ అధ్యాయం 26 వ వచనంకి వస్తున్నాను. ఆదరణ కర్త అనగా నా నామమును పంపబోవు, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును.

గనుక నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. అంటే పరిశుద్ధాత్ముడు అభిషేకముగా ఉంటే, అన్ని మనకు బోధిస్తాడు. అన్ని బోధిస్తాడు. అన్ని బోధిస్తాడు అని లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏ చెప్పాడు. అవునా కాదా?

16 వ అధ్యాయం 13 వ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.

అయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును. సో, అంటే ఆయన మనకు అభిషేకముగా ఉంటే, ఆయనే బోధిస్తాడు. అన్ని బోధిస్తాడు. కాబట్టి నిజంగా ఆయనకు కూడా ఈ వచనాలు మొత్తం, అంటే ఈ వచనాల్లో ఉంది.

ఇప్పుడు సత్యం తెలుసు మనకి కారణం ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ కాబట్టి. అసత్యం ఏంటో తెలుసు. ఎందుకంటే ఆయన అసత్యం ఏంటో మనకు చెప్తాడు కాబట్టి కదా. ఆయన మనలో ఉంటాడు. ఆయన ఉంటే ఎవరు ఏమి బోధించాల్సిన అవసరం లేదు.

తర్వాత ఆయన అన్నిటిని గూర్చి బోధిస్తాడు. సో కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం గాస్పెల్ ఫిట్ చేసిన ఫిట్ అవుతుంది. సువార్త వాక్యము ఫిట్ చేసిన ఫిట్ అవుతుంది. వీటన్నిటిలో పరిశుద్ధాత్ముడు అనేటువంటి అభిషేకం, పరిశుద్ధాత్ముడు అని చెప్పినా కూడా ఇక్కడ అన్ని వచనాల్లో మనకు తెలుస్తుంది అన్నమాట.

సో ఆయన బోధిస్తాడు. నిజమే, ఆయన బోధిస్తాడు. నేను మరల చెప్తున్నాను, నేను ఇప్పుడు మీకు ఇంతమందికి బోధిస్తున్నాను కదా. మీలో కొంతమందికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన బోధిస్తున్నాడు కాబట్టి మీకు అర్థం కావట్లేదు అనుకోండి.

నేను ఏం చెప్తున్నానో అంటే పరిశుద్ధాత్ముని అభిషేకం లేనట్టే కదా. అంతే కదా. మరి నేను బోధిస్తున్న కూడా మీకు అర్థం కావట్లేదు అంటే అర్థం ఏంటి? యా సో ఆ అంతేకాదు.

అయన నాలుగవ అధ్యాయంలో ఆయన సత్య స్వరూపి ఆత్మ కాబట్టి, నాలుగవ అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి నాలుగవ అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో ఆయన ఉంటే గనుక అభిషేకం ఉంటే గనుక మనకు సత్యం అంటే ఏంటో కూడా తెలుస్తది.

అబద్ధ ఆత్మలు ఏంటో కూడా తెలుస్తారు. సో, పరిశుద్ధాత్ముడే మనకు అభిషేకంగా ఉండటం వలన, ఇదంతా మనకి అర్థమవుతుంది. సో ఈ రెండు వ్యూస్ ఉన్నాయండి. ఒకటి గాస్పెల్, అభిషేకం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి నిజమైన క్రీస్తు సువార్త.

రెండోది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు అభిషేకం. ఇదన్న ఉండాలి లేకపోతే అభిషేకము ఇదన్న ఉండాలి. ఈ రెండు డామినెంట్ వ్యూస్ ఈ 2000 సంవత్సరాల్లో అందరూ ఈ వచనాలను చదివి అర్థం చేసుకోండి.

నేను చూశాను కదా, రెండు ఫిట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నేన