📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

#Varanasi Movie Climax Crazy Update ? | Mahesh Babu | SS Rajamouli | Priyanka Chopra | NTV ENT

NTV Entertainment 1:33

Transcription

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న అడ్వెంచరస్ విజువల్ వండర్ వారణాసి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరికెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే జెట్ స్పీడ్ లో జరుగుతుండగా, ఇక త్వరలోనే కీలకమైన క్లైమాక్స్ షూటింగ్ ను ప్రారంభించేందుకు సనహాలు చేస్తున్నారు.

ఈ క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల కోసం మేకర్స్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఒక భారీ సెట్ ను రూపొందించారట. ఈ సెట్ లోనే సినిమాకి హైలైట్ గా నిలిచే క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరించబోతున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా ఐదు విభిన్న పాత్రలో కనిపించనున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఇప్పటికే రుద్ర లుక్ రివీల్ కాగా, శ్రీరాముడి లుక్ ఊహకు కూడా అందకుండా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో మెరవబోతుంది. పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో కనిపించునున్నారు.

ఇక భారతీయ చలన చిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించేలా ఈ చిత్రాన్ని సుమారు 1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కర్ విజేత ఎంఎం కేరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది.

ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ కానుంది. మరి ఈసారి జక్కన్న ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో వెయిట్ చేయాల్సిందే.