📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

GST మాయాజాలం || గత 8 ఏళ్ళగా జరుగుతుంది ఇదే || పసిపిల్లలకు సైతం అన్యాయం

Vijay Calls 9:55

Transcription

ఎనిమిది సంవత్సరాలు పేదల పొట్టగొట్టి, వాళ్ళ శ్రమను దోచుకొని, మధ్య తరగతిని అతలాకుతలం చేసి, చిన్న చిన్న వ్యాపారులు ధ్వంసం చేసి, ఇంచుమించు 18 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈస్ చిన్న తరహ పరిశ్రమలను మూతపడేటట్టు చేసి, ఈరోజు దీపావళి పండుగ చేసుకోండి అని గౌరవ ప్రధానమంత్రి గారు, బీజేపీ మంత్రులు, నాయకులు ఊదరగొడుతూ ఉన్నారు.

మరి 2017 లో "వన్ నేషన్ వన్ టాక్స్" అని అత్యంత అట్టహాసంగా ఆ రోజు ప్రారంభం చేసి, ఈరోజు రిఫార్మ్స్ చేసాం, సంస్కరణలు తెచ్చాం అని చెప్తున్నారు. అని అంటే దేన్ని మనం సంస్కరణలు అంటాం? సంస్కరణ తెచ్చాము అంటే అంతవరకు అన్యాయం జరిగిందనే కదా? దుర్వినియోగం జరిగిందనే కదా? దుర్మార్గం జరిగిందనే కదా? అంటే మీరు తెచ్చిన చట్టం గొప్పగా చెప్పి, ఈరోజు సంస్కరించాము అని అంటే, ఈ ఎనిమిది సంవత్సరాలు ఎవరిని ఎవరిని మోసం చేశారు? ఎవరికి అన్యాయం చేశారు? ఎవరిని అణచి వేశారు? దానిని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా? ఈ సంస్కరణలు మీరు చెప్తున్నట్టుగా, అసలు దేన్ని మనం సంస్కరణ అంటాం? సమాజంలో ఉన్న అన్యాయాన్ని, దుర్వినియోగాన్ని తొలగించి, మెరుగైనటువంటి పరిస్థితి కల్పిస్తే దాన్ని మనం సంస్కరణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సతీష్ సహగమనం అనేది ఉంది. అది ఒక దురాచారం, అన్యాయం. భర్త చనిపోతే భార్యను చితిమంటల్లోకి నెట్టివేయడం. ఇది అమానుషం. అందుకనే ఇది నిషేధించాలని ఉద్యమిస్తే, అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఒక చట్టం తెచ్చి దీన్ని నిషేధించారు. అది సంస్కరణ. అయితే మీరు తెచ్చిన చట్టాన్నే, చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ దాన్ని సంస్కరణ అని మీరు చెప్తున్నారు. మీరు చేసింది సంస్కరణ కాదు, చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఎలాంటి తప్పులు చేశారు అంటే, ఉదాహరణకి ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ మీద టాక్స్ లేదని చెప్పారు. మరి ఈ ఎనిమిది సంవత్సరాలు ఆరోగ్యం కోసం అందరూ టాక్స్లు కట్టారు కదా? కనీసం వైద్యం కోసం టాక్స్లు కట్టారు కదా? ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళు ఇన్కమ్ టాక్స్ కడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, 15 లక్షలు ఇన్కమ్ వచ్చేవారు 30% టాక్స్ కట్టాలంటే 4 లక్షల పైనే టాక్స్ కట్టాలి. టాక్స్ కట్టగా ఒక 11 లక్షలు మిగిలితే, ఈ 11 లక్షలు ఖర్చు పెట్టాడు. అప్పుడు ఉప్పు కొన్న, పప్పు కొన్నా, కాఫీ షాప్ కి వెళ్లి తాగిన, సినిమాకి వెళ్ళిన అన్నిటిలోనూ టాక్స్ కట్టాలి. అంటే ఇంచుమించు 5%, 12%, 18%, 28%, 40% వరకు వీటి మీద టాక్స్ లు పెడుతున్నారంటే, టాక్స్ కట్టిన తర్వాత మిగిలినటువంటి డబ్బుని ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు మళ్ళీ ఇన్ని రకాల టాక్స్ లు. అంటే ఇంచుమించుగా ఉద్యోగం చేసుకునే, జాబ్ చేసుకునే ప్రతి ఒక్కరు 40% పైనే టాక్స్ రూపంలో చెల్లిస్తున్నారంటే, వాళ్ళు చేసిన కష్టానికి మిగిలేది కనీసం 60% కూడా లేదు.

ఈరోజు మీరు పాలు మీద 12%, 5% తగ్గించారు. మరి ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలు పుట్టి ఉంటారు? పుట్టినటువంటి ప్రతి బిడ్డ తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలనుకుంటే, పిల్లలకు పాలు ఇవ్వాలి అనుకుంటే, 50 రూపాయలకు దొరికేటువంటి వస్తువు 12% అంటే 60 రూపాయలు కట్టాలి. అంటే రోజుకి అరలీటర్ పాలు కొంటే 10 రూపాయలు. అంటే 30 రోజులకి 300 రూపాయలు. సంవత్సరానికి 3600 రూపాయలు అదనంగా చెల్లించినట్టే కదా? పేదవాళ్ళు పాలు, పిల్లలక ఇచ్చే పాలు కొనటానికి ఇన్ని సంవత్సరాలుగా, గత ఎనిమిది సంవత్సరాలుగా పుట్టిన ప్రతి పిల్లలకి సంవత్సరానికి 3000కు పైనే చెల్లించారంటే ఎంత భారం అది? ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎంత అన్యాయం జరిగింది పేదవాళ్ళకి? ఈ తప్పులు ఈరోజు మీరు సదిద్దుతున్నారు.

వాస్తవానికి రాజకీయ పార్టీలన్నీ, ప్రతిపక్ష పార్టీలన్నీ, ఈ విధానంలో తప్పుంది, సరి చేయండి, సరి చేయండి అని పదే పదే గగ్గోలు పెట్టిన వ్యాపారస్తులు, గగ్గోలు పెట్టిన సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ గగ్గోలు పెట్టిన మీరేమి చేయలే, ఇన్ని సంవత్సరాలు పట్టించుకోలే. కానీ ఈరోజు ఎందుకు పట్టించుకున్నారు? ఈరోజు ఎందుకు దీపావళి పండుగ చేసుకోమంటున్నారు అనింటే, ఈ బీజేపీ ఏ పని చేసినా రాజకీయ లబ్ది లేకుండా, ఓట్ల రూపంలో దాన్ని రీప్ చేసుకుని, అంటే హార్వెస్ట్ చేసుకోకుండా, అంటే పండిన పంటను ఎలా అయితే కోస్తామో అలా ప్రతి పనిని ఓట్లలాగా కోసుకునే అవకాశం లేకుండా, దండుకునే అవకాశం లేకుండా ఏ పని చేయదు.

2014 లో ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చినటి నుంచి ప్రతి సమయంలోనూ మొట్టమొదట పాచికగా మతాన్ని, ఇంకోవైపు పాకిస్తాన్ చూపించి, ఉత్తర భారతదేశంలో అనేక ఓట్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అనే దానితో మొదలైనటువంటి ప్రస్థానం ఎలా సాగుతూ వచ్చింది అంటే, ప్రతి ఎన్నికలకి ఏదో ఒక అంశాన్ని తీసుకురావడం. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉంటే, కర్ణాటకలో హిజాబ్ ఇష్యూని లేవనెత్తటం, దాన్ని ఇష్యూ చేసి అక్కడ గెలవడానికి ప్రయత్నం చేయడం. అయోధ్యలో రామ మందిరం కట్టేస్తే బంపర్ మెజారిటీతో గెలిసిపోతాం అనుకున్నారు కానీ, అదే అయోధ్యలో బీజేపీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయింది. సో ఇక ఒకవైపు ఈ మతం పాచిక పారడం లేదు. మరొకవైపు మోడీ ప్రభావం తగ్గిపోతుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఈ మధ్య వచ్చినటువంటి అంశం.

సో ఈ పరిస్థితిలో ఏం చేయాలని, ప్రజలకు సంబంధించిన పని ఏదో ఒకటి చేయకపోతే, అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ ఎన్నికలో గలవడం సాధ్యం కాదు. కాబట్టే 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా ఐదు సంవత్సరాల తర్వాత అనేటువంటిది ఒకటి. ఢిల్లీ ఎలక్షన్లు జరిగే సమయంలో అక్కడంతా కూడా ఎక్కువ డైలీ వేజ్ లేబర్, మధ్య తరగతి వాడు, శాలరీడ్ ఇన్కమ్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, ఇన్కమ్ టాక్స్ లో 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఇన్కమ్ టాక్స్ లో చేంజెస్ తీసుకొచ్చారు. 12 లక్షలకు వరకు ఆదాయం ఉంటే టాక్స్ లేకుండా మొదటిసారి ఢిల్లీ ఎలక్షన్ మని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ తర్వాత ఇంకా కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా మతం, మోడీ అంటే పని జరగదు, ఏదో ఒకటి చేయాలని ఎనిమిది సంవత్సరాలు ఇన్ని పార్టీలు గగ్గోలు పెట్టినా చేయని అంశం ఈరోజు జీఎస్టీ లో మార్పులు తీసుకొని వచ్చి, మేము సంస్కరణలు చేసేసాం, పండగ చేసుకోండి అని చెప్తున్నారు.

మీరు చేసింది తప్పు, ఇన్ని సంవత్సరాలుగా చేసింది అన్యాయం. దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని ఆలోచన వచ్చింది. కనీసం ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే తప్పు సరిదిద్దుకోవాలని ఆలోచన వచ్చి ఒక అడుగు ముందుకు వేసినందుకు. కానీ ఈరోజు 18 లక్షల ఎంఎస్ఎంఈస్ అంటే చిన్న సూక్ష్మ పరిశ్రమలు అంటే నిన్న కాక మొన్న కొత్త కొత్తగా కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేయటానికి ముందుకు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మధ్య తరగతి నుంచి వచ్చారు, పేద కుటుంబాల నుంచి వచ్చారు. వీళ్ళు కోవిడ్ సమయంలో నలిగిపోయారు. ఎందుకంటే సరైనటువంటి వ్యాపారం లేక, టాక్స్లు కట్టలేక మూతపడిపోయింది. సో అట్లాంటి వాళ్ళని ఎలా రివైవ్ చేస్తారు? చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని, స్టార్టప్ కంపెనీలు, బిజినెస్లు పెట్టుకున్న యూత్ ని ఏ విధంగా రివైవ్ చేస్తారు? వాళ్ళకి అడిషనల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తారా? లేకపోతే ఎట్లా తీసుకురావాలి అనేటువంటి రిఫార్మ్స్ ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది.

వీటితో పాటు ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది అనింటే, ప్రజల తరపున, ప్రజలు ఎదుర్కొనే కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోతే, వారి తరపున ప్రశ్నించకపోతే అన్యాయమే జరుగుద్ది. ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎలా అన్యాయం జరిగిందో, ఇట్లాంటి అన్యాయాలే జరుగుతాయి. రైతులకి బ్లాక్ లాస్ అంటే నల్ల చట్టాలు తెచ్చారు. రైతులు హర్యానా, పంజాబ్ నుంచి వచ్చినటువంటి రైతులు పోరాటం చేస్తున్న సమయంలో, మిగిలినటువంటి ప్రతిపక్షాలు మద్దతుని ఇచ్చిన సందర్భంలో ఆ చట్టాలు నిలుపుదల చేయడం జరిగింది. ప్రతిపక్షాలు నిరంతరంగా మాట్లాడుతుండటం వల్ల, రాజకీయ పార్టీలు, సోషల్ ఆర్గనైజేషన్స్ నిరంతరంగా మాట్లాడటం వల్లే ఈరోజు సెన్సస్ లో ఓబిసి కులగణన అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. అలా రాజకీయ పార్టీలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మాట్లాడటం వల్లే ఈరోజు జీఎస్టీ లో రిఫార్మ్స్ అనేటువంటి వాళ్ళు చెప్పే కరెక్షన్స్ ని తీసుకురావడం జరిగింది. అందుకు ప్రజల పక్షాన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ, మాట్లాడుతూ, ప్రశ్నిస్తూ ఉన్నది.

అయితే ఈ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఈ కరెక్షన్స్ చేసేటప్పుడు ప్రాధాన్యత అనేది ఎవరి వైపు ఉండాలంటే ప్రజల వైపు మొదటి ప్రాధాన్యత ఉండాలి. తర్వాత బిజినెస్ పీపుల్, ట్రేడర్స్, సెల్లర్స్, ముఖ్యంగా అదాని, అంబానీ లాంటి వారు కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళ కోసం ప్రాధాన్యతతో, వారికి బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఇంకా మార్పులు చేయాలి, కరెక్షన్స్ చేయాలి.

మరొకవైపు ఫెడరల్ స్ట్రక్చర్, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇచ్చి, వారికి రావలసిన వాటా నిధులు వాటా ప్రకారం ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేటువంటి సంస్కరణ కూడా, రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి. కరప్షన్స్ కూడా చేయాలి. అలాగే ఈ జీఎస్టి చట్టం ఎంతో కాంప్లికేటెడ్ గా ఉంది. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కాంప్లెక్స్ గా ఉంటుంది. లాస్, జిఎస్టి లాస్ ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. జీఎస్టి ఫామ్స్ చిన్న వ్యాపారస్తులు కూడా సులువుగా నింపుకునే విధంగా ఈ ఫార్మ్స్ అన్నీ కూడా రీ డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ లేకుండా, ప్రొఫెషనల్ సపోర్ట్ లేకుండా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఈ జీఎస్టి రిటర్న్స్ ని ఫైల్ చేయలేరు. వాళ్ళకి వచ్చే లాభం ఎంత, దానికోసం కట్టే టాక్స్ ఎంత, మళ్ళీ వీళ్ళందరినీ ఎంగేజ్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫీస్ ఎంత, ఇవన్నీ కూడా ఎంత కష్టంగా ఉంటాయి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి. కాబట్టి రిటర్న్స్ అన్ని సింపుల్ గా ఎవరికి వాళ్ళు ఫిల్ చేసుకుని సబ్మిట్ చేసే విధంగా, ఫైల్ చేసే విధంగా రిఫార్మ్ చేయడం, అలాగే లాస్ ని రిఫామ్ చేయడం, అలాగే ఈ చిన్న తరహ పరిశ్రమల్ని రివైవ్ చేయడానికి కావల్సినటువంటి చర్యలు తీసుకోవడం.

జీఎస్టి తో పాటు నాన్ జీఎస్టి సైడ్ కూడా. ఉదాహరణకి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, డైలీ వేజ్ లేబర్ ఉన్నారు. సంవత్సరాల తడబడి వాళ్ళ యొక్క వేజెస్, కూలి అనేటువంటిది ఇంతవరకు ఇన్ఫ్లేషన్ తో లింక్ చేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం అనేటువంటిది కూడా జరగడం లేదు. ద్రవ్యాలు బలంతో లింక్ చేసి ఈ వేతనాలని ఎప్పటికప్పుడు పెంచడం అనేటువంటి అంశం మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసేసి, మధ్య తరగతి, పేదలు, దినసరి కూలీలు, కార్మికుల కోసం ఈ కరెక్షన్స్ టేకప్ కంటిన్యూ కావాలని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.