📱

Get Our Mobile App

Take your business learning on the go!

Download on the App StoreGet it on Google Play

విలువలేని దానికొరకు విలువైనదానిని కోల్పోకు|ఎన్నడూ వినని సందేశం|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyd

Emmanuel Ministries Hyderabad1:20:50

Transcription

విలువలేని దాని కొరకు విలువైన దాన్ని పోగొట్టుకోకు. విలువలేని దాని కొరకు విలువైన నీ జీవితాన్ని కోల్పోకు. అసలు ఈ భూమి మీద మానవ బ్రతుకులో విలువైనది ఏది? డబ్బు విలువైనదా? అందం, బంగారం విలువైనవా? కులగోత్రాలు విలువైనవా? ఆస్తిపాస్తులు విలువైనవా? అందచందాలు విలువైనవా?

ప్రతి మనిషి తన బ్రతుకులో ఏది విలువైందో, ఏది విలువలేనిదో ఈ రెండిటికీ తారతమ్యం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు విలువైన దాన్ని మనిషి కోరుకోగలుగుతాడు. రెండు వేల రూపాయల ఆ చూడండి. ఇప్పుడు రెండు 2000 రూపాయల కాగితాలు లేవనుకుంటాం కదా! అందుకనే ఆగి బ్రేక్ వేసుకున్నాను. నాకు నేనే 500 రూపాయల కాగితం ఉంది. 500 రూపాయల కాగితాలు 500 అక్కడ పెట్టాం. చాక్లెట్లు పెట్టాం. పిల్లోడి ముందు అవి వేస్తే ఏం కోరుకుంటాడు చెప్పండి? సూపర్ చాక్లెట్లు కోరుకుంటాడు కదా! ఎందుకు? 500 రూపాయల విలువ ఎంతో ఆ పిల్లోడికి తెలియదు. తెలియదు. కొన్నిసార్లు మానవ జీవితంలో విలువలేని దాని కొరకు మనిషి విలువైన వాటిని కోల్పోతా ఉంటాడు. ఎందుకు కోల్పోతాడు? అయ్యా అంటే దీని విలువ ఇది అని మనిషికి తెలియక. దాని గూర్చి అపోస్తులుడైన పౌలు గారు పత్రికలో మాట్లాడుతూ, "సంఘమా! ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి విలువైనవో, ఏవి మాన్యమైనవో (మాన్యము అంటే ఘనమైనవి అని) ఏవి మాన్యమైనవో, ఏవి మీకు గౌరవాన్ని తీసుకొస్తాయో గ్రహించి, మాన్యమైన వాటిని మీరు చేపట్టండి. ఘనమైన వాటిని పరీక్షించి మీరు చేపట్టండి" అని మాట్లాడుతాడు.

మానవ జీవితంలో అన్నిటికంటే అత్యంత విలువైనది ఏది? ఎన్నో ఉన్నాయి. ఓ పర్యాయం పంజాబ్ రాష్ట్రంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి ఒక యవ్వనస్తుడు లండన్ దేశానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి లండన్ దేశానికి వెళ్ళాడు అంటే గొప్ప కుటుంబం అందమా? మధ్యతరగతి కుటుంబం అందమా? డెఫినెట్‌గా బహుసంపన్న కుటుంబం. ఆయన చదువుకునే ఆ రోజుల్లో ఎవరో ఆయనకు బైబిల్ గిఫ్ట్‌గా ఇచ్చారు. బ్రదర్ ఒకసారి చదవండి. ఈయన సిక్కు మతస్తుడు. తన మతవిశ్వాసాల విషయంలో చాలా నిష్ఠగా ఉంటాడు. అవును, మన భారతదేశమే మతవిశ్వాసాలకు బహునిష్ఠ కలిగింది. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల కంటే భక్తిమనసు కలిగిన దేశం ఏదైనా ఉన్నదంటే, దేవుడు మనకి ఇచ్చిన దేశం భారతదేశమే నేను అనుకుంటాను. మనం ఈ దేశంలో పుట్టడాన్ని బట్టే మనకి భక్తిమనసు ఉందేమో అనిపిస్తది. అఫ్‌కోర్స్ దేశం మనకి ఇచ్చింది అనే కంటే కూడా ఆ భక్తిమనసు దేవుడే మన గుండెల్లో పుట్టించాడు. ఆయనకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుదాం. సిక్కు మతస్తులు చాలా నిష్ఠగా ఉంటారు. చాలా నిష్ఠగరిష్టులు. చూడండి, సిక్కు మతస్తుల పురుషుల తల మీద ఏముంటది చెప్పండి? లోకంలో వేరే మతస్తులు తలకట్టుతో చిత్రవిచిత్రాలు చేస్తారేమో గాని సిక్కు మతస్తులు చేయరు. కొన్ని తలలు మీరు చూసి ఉంటారు. తల మీద పాము పడగొన్నట్టు, బల్లి ఉన్నట్టు, ఒసరి వెల్లుల్లి ఉన్నట్లు రకరకాల స్టైల్స్‌తో కటింగ్ చేస్తారు. ప్రపంచంలో యవ్వనస్తులు అందరూ అట్లా చేస్తారేమో కానీ మాక్సిమం సిక్కు మతస్తులు పొరపాటున చేయరు. అంత నిష్ఠగరిష్టులు అని చెప్పడానికి చెప్తున్నాను. అలాంటి నిష్ఠగరిష్ఠత కలిగిన కుటుంబంలో పుట్టిన ఆయనకు బైబిల్ గిఫ్ట్‌గా ఇస్తే ఏం చేశాడో తెలుసా? నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా చింపి, కళ్ళ ముందే అగ్గిపుల్లలు వెలిగించి తగలబెట్టేశాడట. "మేము సిక్కులం, మాకు మతగ్రంథాలు లేవా? మాకు ఎందుకు ఇస్తారు ఇది?" నో! ఈయన తక్కువ కులాలకు చెందిన దేవుడేదో తనకు తెలిసిన భాషలో ఆ బైబిల్‌ని ముక్కలు ముక్కలుగా చింపి, కళ్ళ ముందే చూస్తుండగానే తగలబెట్టేశాడు. అయితే బైబిల్ అయితే తగలబెట్టాడు, కానీ బైబిల్ అట్ట ఉంది చూశారా? ఆ అట్ట చాలా అందంగా ఉండేసరికి, "ఇది కాస్త అందంగా ఉంది. దీన్ని తగలబెట్టడం ఎందుకులే?" అని ఆ అట్ట సరిగ్గా చూడకుండా తన గదిలోకి తీసుకొచ్చి సెల్ఫ్‌లో పెట్టుకున్నాడట. కొన్ని దినాల తర్వాత ఆ సెల్ఫ్ సర్దుకుంటూ ఉంటే ఈ బైబిల్ అట్ట కనపడింది. "అరే! ఏంటి ఈ అట్ట? అదే నేను తగలబెట్టా కదా! బైబిల్‌కి సంబంధించింది కదా! అసలు ఈ అట్ట మీద ఏముందో చూద్దాం" అని ఆ అట్టను తదేకంగా చూస్తా ఉన్నాడు. చెప్పండి, బైబిల్ అట్ట మీద ఏమని రాసి ఉంటది? "పరిశుద్ధ గ్రంథం" అని రాసి ఉంది కదా! అలా చదివాడు. "పరిశుద్ధ గ్రంథమా! అరే! నా చిన్నతనం నుంచి నేటి వరకు కొన్ని వందల మతగ్రంథాలు చదివాను. ఏ మతగ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఆపాదించబడలేదే! ఈ గ్రంథానికే పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎందుకు ఆపాదించబడింది? అసలు ఈ గ్రంథంలో ఏముందో తెలుసుకుందాం" అని స్నేహితుడికి ఫోన్ చేసి బైబిల్ తెప్పించుకున్నాడు. కూర్చొని బైబిల్ చదవడం ప్రారంభించాడు. నాలుగు రోజుల్లో బైబిల్ అంతా చదివాడు. బైబిల్ చదివి పూర్తి చేసేలోపు ఏసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. అంగీకరించడం మాత్రమే కాదు, బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే కాదు, ఏ చేత్తో బైబిల్ చింపాడో అదే చేత్తో బైబిల్ పట్టుకొని ప్రపంచ దేశాలంతా తిరుగుతూ ఏసుక్రీస్తు సువార్తను చాటి చెప్తూ ఈ ఒక్క వ్యక్తి పదివేల సంఘాలు స్థాపించే శక్తిమంతుడిగా మార్చబడ్డాడు. ప్రైస్ ది లార్డ్! వారి పేరే ద గ్రేట్ బక్సింగ్ అయ్యగారు. ఆయన ఏసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించిన తర్వాత లండన్ దేశం నుంచి ఆయన పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళాడు. చేతిలో బైబిల్ ఉండటం, ఈ వాతావరణం చూసి తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, వాళ్ళందరూ అన్నారట, "నువ్వు తెల్లోల డబ్బుకు అమ్ముడుపోయినోడివి. నువ్వు బ్రిటిష్ వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు అలవాటుపడిన కుక్కవు. నువ్వు నీకు మేము కావాలంటే భార్య అంటాడు. నేను కావాలంటే తల్లిదండ్రులు అన్నారట. మేము కావాలంటే ఏసుక్రీస్తును వదిలిపెట్టు. మేము కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించి పెట్టాం. మేము సంపాదించిన ఆస్తి నీకు కావాలంటే ఆ ఏసుక్రీస్తును వదిలిపెట్టు. మేము విలువైన వాళ్ళమో, ఏసుక్రీస్తు విలువైన వాడో తేల్చుకో. సంపాదించిన ఆస్తిపాస్తులు విలువైనవో, ఏసుక్రీస్తు విలువైన వాడో తేల్చుకో. మన సిక్కు కులం విలువైందో, ఆ ఏసుక్రీస్తు విలువైన వాడో తెలుసుకో. ఒకవేళ ఏసుక్రీస్తే నీకు కావాలంటే ఆ చిల్లిగవ్వ కూడా మేము సంపాదించిన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వం" అని ఆ యవ్వనస్తుడికి చెప్తే, అగ్నిపరీక్ష! ఒకసారి చూడండి, అగ్నిపరీక్ష! ఏసుప్రభువును కాదన్నామా? తల్లిదండ్రులు దూరమైపోతారు. అన్నదమ్ములు దూరమైపోతారు. చివరికి కట్టుకున్న భార్య దూరమైపోతుంది. ఏసుప్రభువును కాదన్నామా? అప్పటివరకు కోట్లకు పరిగెత్తి కుబేరుడిగా కనపడుతున్న యవ్వనస్తుడు రెప్పపాటు కాలంలో ఆ క్షణంలో ఏమీ లేని నిస్సహాయ స్థితిలో దరిద్రుడిగా మారిపోతాడు. వినడానికి తేలికే, చెప్పడానికి తేలికే, కానీ అనుభవించడానికి ప్రసవవేదన! డబ్బు కావాలా? దేవుడు కావాలా? ఏది నీ బ్రతుకులో విలువైంది? అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? "నాకు డబ్బు కావాలి. అమ్మ, నాన్న కావాలి. భార్య కావాలి. కానీ వీటన్నిటికంటే విలువైన వాడు ఏసుక్రీస్తు ప్రభువు ఒక్కడే మాత్రమే. భార్య విలువైనదే. భార్య స్థానాన్ని నేను కించపరచను. అమ్మ, నాన్న నన్ను కనిపెంచారు. మీరు విలువైన వాళ్లే. మీ విలువను నేను కించపరచను. నా తోబుట్టువులు ఉన్నారు. అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఉన్నారు. వీరు విలువైన వాళ్లే. అయితే వీళ్ళందరికంటే నా బ్రతుకులో అత్యంత విలువైన వాడు ఏసుక్రీస్తు." "ఓహో! మాకంటే ఏసుక్రీస్తు నీకు విలువైన వాడా? కోట్ల రూపాయల డబ్బు కంటే ఏసుక్రీస్తు విలువైన వాడా?" "సరే, ఆ విలువైన ఏసుక్రీస్తు దగ్గరికే వెళ్ళు. చిల్లిగవ్వకు కూడా నీకు ఇవ్వను. ఇక మా కుటుంబానికి రావద్దు. మేము మీకు తల్లిదండ్రులం కాదు" అని వెలివేస్తే, ఆ దైవజనుడు వాక్యం పట్టుకొని, ఇందాక చెప్పా కదా, ఒక్క వ్యక్తి పదివేల సంఘాలు స్థాపించాడు. అద్భుతం! ఒక ఇంటిని విడిచిపెడితే లక్షల ఇల్లు ఆ దైవసేవకుడికి కానుకగా దేవుడు అనుగ్రహించాడు. ఒక తల్లిని, ఒక తండ్రిని, ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములను, అక్కచెల్లెలను విడిచిపెడితే లక్షల కొలది అన్న, అక్కాచెల్లెలను ఆ దైవసేవకుడికి దేవుడు వరంగా ప్రసాదించాడు. నేను అంటాను, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కంటే అంతకంటే విలువైన ఆత్మలను పరలోక రాజ్యం కొరకు సంపాదించే ఒక ధృవతారగా ఆ దైవజనుడు వెలిగాడు. ప్రైస్ ది లార్డ్! నేను చిక్కడపల్లిలో ఉద్యోగం చేసే రోజుల్లో ఆ దైవజనుడిని చూడటానికి రెండు మూడు పర్యాయాలు వెళ్ళాను. బక్సింగ్ అయ్యగారు మంచంలో, సారీ కుర్చీ మీద ఇలాగే కూర్చుని, ఆయనకు ఆ మెమొరీ పూర్తిగా లాస్ అయింది. ఇక ఇట్లాగే తలకాయ పెట్టి ఆ దైవజనుడిని చూశాను. ప్రభువు చిత్తమైతే ఎప్పుడైనా చూపిస్తాడు ఫోటో. ఆ దైవజనుడు చనిపోయినప్పుడు మెటాడోర్ వ్యాన్‌లో ఆయన దేహాన్ని పెట్టి నారాయణగూడ సిమిట్రీలో భూస్థాపన చేయడానికి వెళ్ళేటప్పుడు దాన్ని డ్రైవ్ చేయలేక తాడు కట్టి లాక్కుంటూ వెళ్లారు. దేవుని కృప! ఆ దైవసేవకుని సమాధికార్యక్రమంలో నేను పాలుపొందటానికి, నేను లాగటానికి ఈ అల్పుడికి దేవుడు ఆ గొప్ప కృప ఇచ్చాడు. సరిగ్గా అప్పుడే నారాయణగూడ ఫ్లైఓవర్ మీద జేమ్స్ గారు అని ఫోటోలు తీసే ఒకాయన ఉన్నాడు. ఎక్కడ చూశాడో ఏమో, మొత్తానికి ఫోటో కొట్టాడు. నాకు ఫోటో ఇచ్చాడు. భద్రంగా దాచిపెట్టుకున్నాను. లక్షల కొలది ప్రజలకు తండ్రిగా ఆయన ఎందుకు మారాడో తెలుసా? విలువైన దాని కొరకు విలువలేని వాటిని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆమెన్! అలాగని తల్లిదండ్రులు విలువలేని వాళ్ళు అని కాదు. ప్రభువుతో పోలిస్తే దైవజనమా! ఈ సృష్టి అంతటిలో దేవుని కంటే విలువైనది, దేవుని కంటే శ్రేష్టమైనది, ఆత్మీయత కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. ప్రపంచంలో ఏ సంపద అయినా నీ దేవుని ఎదుట బలహీనమే. ఆమెన్ చెబుదాం. ఆమెన్! గట్టిగా చెబుదాం. ఆమెన్! ఆమెన్! దేవుడు అంటాడు కదా, "ఇశ్రాయేలు! నీ భాగ్యం ఎంత గొప్పది?" చెప్పండి, చెప్పండి, చెప్పండి! ఏంటి వాళ్ళ భాగ్యం? హైటెక్ సిటీలో ఏడు అంతస్తులు భవంతి కట్టారా? కడితే హైదరాబాద్ వస్తుంది. జాగ్రత్త లేకపోతే మియాపూర్‌లో కట్టారా? ఏంటి నీ భాగ్యం? ఆ కోట్ల సిరిసంపద ఏంటి నీ భాగ్యం? దేవుడైన యెహోవాను దేవునిగా కలిగి ఉండటమే ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన భాగ్యం. దైవజనమా! దేవుని కొరకు, భక్తిజీవితం కొరకు, ఆత్మీయత కొరకు దేన్నైనా కోల్పోవడానికి నువ్వు ఇష్టపడు. ఎందుకంటే దీనికి మించి విలువైనది ఏది లోకంలో లేదు. నేను అంటాను, విలువైన దాని కొరకు విలువలేని వాటిని కోల్పోదాం. మరి విశేషంగా విలువలేని వాటి కొరకు విలువైన దాన్ని మనం కోల్పోకుండా ఉందుము గాక. బైబిల్‌లో కొంతమంది విలువైన వాటిని విలువలేని వాటి కొరకు కోల్పోయారు. జేష్ఠత్వం గొప్పదా? కాదా? జేష్ఠత్వం గొప్పదా? కాదా? తండ్రి తర్వాత రాజు ఆయనే. తండ్రి తర్వాత యాజకుడు ఆయనే. సంపాదించిన ఆస్తిలో రెండువంతుల భాగం జేష్ఠుడిదే. అవునా? కాదా? తండ్రి మూడు ఎకరాలు సంపాదించాడు. ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకుకి ఎకరం ఇస్తాడు. పెద్ద కొడుకుకి అబ్బా! ఎబినేజర్ అన్న ఆ ఛాన్స్ కాలంలో ఉంటే బాగుండు అంటారేమో! చిన్నోడు ఏం చేస్తాడో తెలుసా? బండరాయి తీసి దాని తలకాయ మీద వేస్తాడు. ఈ కాలంలో అందరికీ సమానం. కానీ ఆ రోజుల్లో జేష్ఠుడికి ఉండే అనుభవం ఏంటో తెలుసా? రెండు పాళ్ళ ఆశీర్వాదం. తానే రాజు. తానే రాజు. తానే యాజకుడు. రెండు పాళ్ళ ఆశీర్వాదం తానే అనుభవిస్తాడు. అలాంటి జేష్ఠుడిగా పుట్టించాడు ఒక వ్యక్తిని. అంత విలువైన ఆధిక్యత ఆ వ్యక్తికి ఇస్తే తత్వాన్ని ఎక్కడ అమ్ముకున్నాడో తెలుసా? చిక్కుడుకాయల కూరగాడ! కొన్నిసార్లు అనిపిస్తే థూ! అట్టా చేశాడురా! అదే ఏశావు స్థానంలో నేను ఉంటేనా? ఇరగదీయకపోదునా? నేను అంటాను, అక్కడున్న ఈ జనం అన్న చేసేది అదే బ్యాచ్ మీకు తెలుసా? చాలా చర్చెస్‌లో గంజికాడ కొట్లాడుకుంటారండి. మీకు తెలియదు. ఆదివారం మధ్యాహ్నం గంజి పోస్తే ఆకలితో వచ్చారని లేదు. సాంబార్ అన్నం పెడితే ఒక ముద్దాన్నం, పెడితే ముద్ద అన్నం కాడ, మాంసం ముక్కల కాడ గొడవపడి సంఘం మూడు ముక్కలు అయిందట! ఈ బ్యాచ్ అంతా వేసావు బ్యాచ్! ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు చూసినోళ్ళు, విన్నవాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి. ఎక్కడమ్మా? మీ ఊర్లో జరిగిందా? వీళ్ళంతా ఎవరో చెప్పమంటారా? విలువలేని దాని కొరకు విలువైన దాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు ఎందుకు? ఏశావు వల్ల చేశాడు. విలువలేని దాని కొరకు విలువైన తన జేష్ఠత్వాన్ని ఎలా కోల్పోయాడో చూడండి. ఆ మాటలు ఆదికాండం 25వ అధ్యాయం. అందరూ చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం నుంచి కొన్ని మాటలు, అవసరమైన మాటలు నేను మీతో జ్ఞాపకం చేస్తాను. ఎందుకు తాను అలా కోల్పోయాడు? 27వ వచనం నేను చదువుతాను. "ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై వేటాడు అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను." ఆ 29వ వచనం. "ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, 'నేను అలసి ఉన్నాను. ఎర్రఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని' అడిగెను. అందుచేత అతనికి ఎదోము అనబడెను. అతని పేరు ఎదోము అనబడెను." రైట్! 31వ వచనం. "అందుకు యాకోబు, 'నీ జేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని' అడగగా ఏశావు, 'నేను చావబోవుచున్నాను కదా! నేను చావబోవుచున్నాను కదా!' జేష్ఠత్వం చూడండి. ఎర్రఎర్రగా ఉన్న చిక్కుడుకాయల కూర చూశాడు. ఒక మాట అంటానండి. అరే! ఏదో చికెన్ కూర తిని చూసి కాస్తంత శోధించబడ్డాడు అంటే పోనీలే అనుకోవచ్చు. లేదా మటన్ బిర్యానీ చూసి శోధించబడ్డాడు అంటే పోనీలే అనుకోవచ్చు. దరిద్రం ఏంటి? చిక్కుడుకాయల కూర చూసినప్పుడు ఏమంటాడో తెలుసా? 'నేను చావబోవుచున్నాను.' నేను ఏశావుని అడుగుతాను. ఏశావా! ఒక పూట భోజనం చేయకపోతే చచ్చిపోతారా? పొట్టి శ్రీరాములు గారు 52 రోజులు భోజనం చేయకుండా ఉన్నాడు. ఒక్క పూట భోజనం చేయకపోతే చచ్చిపోతావు? ఏమంటాడో తెలుసా? 'నేను చనిపోబోవుచున్నాను. జేష్ఠత్వం నాకెందుకు?' జేష్ఠత్వం విలువ తెలియక ఒక్క పూట కూటి కోసం తన జేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. దైవజనమా! ఏశావు భ్రష్టుడు అవ్వటానికి, యాకోబు భాగ్యవంతుడు అవ్వటానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఒక మాటలో, లోకసహవాసం కంటే దైవసహవాసం విలువైనది అని యాకోబు ఎరిగాడు. యాకోబు ఎరిగింది ఏంటంటే, లోకస్నేహం కంటే దైవస్నేహం విలువైంది. ఏశావు ఏమి ఇచ్చాడో తెలుసా? "దేవునితో స్నేహం కంటే నాకు లోకస్నేహమే మేలు" అని. ఏశావు ఎప్పుడు అరణ్యవాసిగా ఉండేవాడట? చెప్పండి. యాకోబు ఎప్పుడు గుడారంలో? గుడారం దేనికి గుర్తు? దేవుని సన్నిధికి గుర్తు. గుడారం దేనికి గుర్తు? దేవునితో సహచర్యం చేసే జీవితానికి గుర్తు. గుడారం దేనికి గుర్తు? దేవుని పాదసన్నిధిలో గడిపే జీవితాన్ని గుర్తు. నేను అనుకుంటాను, గుడారంలో బ్రతికిన యాకోబు తాచగా ఉపవాసం ఉండేవాడు. ఇప్పుడు తాను వండుకుంటున్నాడు అంటే ఆకలి అయ్యే వండుకుంటున్నాడు కదా! సహజంగా బ్రదర్స్ కిచెన్ వైపు రారు కదా! అమ్మ గంగాధర్ గారు కిచెన్ వైపు వస్తారా? వచ్చినట్టు ఉన్నాడు గంగాధర్ అన్న. "నువ్వు కనపడండి, కనపడట్లా?" రైట్! అమ్మ కిచెన్ వైపు వస్తాడా? రాడు. ఎప్పుడైనా పొరపాటున కిచెన్ వైపు వచ్చాడు అనుకోండి. ఎప్పుడు వస్తారు చెప్పండి? అమ్మ బాగా ఆకలి అయితే. అలాంటిది యాకోబు వంట వండుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? బాగా ఆకలితో ఉండి ఉంటాడు. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగా లేదేమో. మొత్తానికి వండుకున్నాడు. అయిపోయింది. తినబోయేలోపు ఏశావు వచ్చాడు. యాకోబు ఆకలితో ఉన్నాడు. ఏశావు ఆకలితో ఉన్నాడు. దైవజనమా! ఒక్క పూట ఆకలికి ఆగలేకపోయాడు ఏశావు. ఎందుకో తెలుసా? ఏశావుకు ఉపవాసం అలవాటు లేదు. యాకోబు ఉన్నాడే! ఉపవాసం అలవాటు. ఆల్ నైట్ ప్రేయర్లు చేయటం అలవాటు. దేవుని సన్నిధిలో గడపటం అలవాటు. ఏసయ్యకు మహిమ కలుగును గాక! దైవజనమా! ఏది విలువైనదో, ఏది విలువలేనిదో గుర్తుంచుకో. ఏది విలువైంది? ఉపవాసంతో కడుపు చంపుకోవడం విలువైంది. దేవుని సన్నిధిలో ప్రతి శనివారం దేవుని మందిరానికి వచ్చి కడుపు చంపుకొని మోకాళ్ళు ప్రార్థన చేయటం. ఇది మన భక్తిజీవితానికి విలువైనది కదా? నిద్రపోవడం కంటే నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో యాకోబులాగా రాత్రులు పూట దేవుని పాదసన్నిధిలో గడపటం ఇది విలువైనది. నేను అడుగుతాను, తిండి విలువైందా? ఉపవాసం విలువైందా? కొంచెం గట్టిగా అనండి. వినపడలేదు నాకు. కొంచెం గట్టిగా! అలాగని వారమంతా ఉపవాసం ఉండి టిబి రోగం తెచ్చుకునేరు గాక! వారంలో ఒక రోజు ఉపవాసం ఉండండి. దేవుడు బలపరిస్తే రెండు రోజులు ఉపవాసం ఉండండి. దైవజనమా! దేవుడు బలపరిస్తే వారానికి ఒకసారి, వారానికి రెండు రోజులు కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు యాకోబు. తను పుట్టింది కనిష్ఠుడు కానీ తన ఉపవాసం ద్వారా కనిష్ఠుడు జేష్ఠుడు అయ్యాడు. ఆమెన్! దైవజనమా! నువ్వు పుట్టి పెరిగింది ఒక మాట, తాగుబోతుల కుటుంబంలో పుట్టిన, తిరుగుబోతుల కుటుంబంలో పుట్టిన, అక్రమ సంబంధాలు బ్రతికే వంశంలో నువ్వు పుట్టిన, అసలు దేవుడు అంటే ఏంటో తెలియక దైవము కాని వాటిని ఆరాధించే కుటుంబాల్లో పుట్టిన యాకోబులాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్. నీ మీద పడిన ముద్రలు దేవుడు మార్చి ఒక క్రొత్త పేరు దేవుడు మనకు అనుగ్రహించును గాక! చెబుదాం. ఆమెన్! ఆమెన్! యాకోబు ఎక్కడ బ్రతికాడు? ఆ యాకోబు ఎరిగింది ఏంటంటే,

చేశాడు. మరల ఫోన్ చేశాడు. నేను వెంటనే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి అని చెప్పాను.

ఆ టెక్స్ట్ మెసేజ్… ఆ టెక్స్ట్ మెసేజ్ పెట్టేటప్పుడు, "ప్రైస్ ది లార్డ్. నా పేరు కమలాకర్. కడుపులో క్యాన్సర్ గడ్డతో చాలా బాధపడుతున్నాను. నొప్పి భరించలేకపోతున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయించుకోవాలని ఫోన్ చేశాను" అన్నాడు. ఆ మెసేజ్ చూడటంతోటే నా గుండె అట్లా పిండినట్లు అయిపోయింది. ఆ మెసేజ్ చూసి చూడక మునుపే, క్షణాల్లో ఫోన్ చేశాను. 11 గంటల 18 నిమిషాలకు ఫోన్ వచ్చింది. అవతల నుంచి మూలుగుతూ, బాధతో మాట్లాడుతున్నాడు.

"అయ్యా, మీ పేరేంటి?" "కమలాకర్ అయ్యా." "అయ్యా, ఎక్కడ ఉంటారు?" "ఘట్కేశ్వర్లో అయ్యా." "అయ్యా, ఇప్పుడే మేము మెసేజ్ చదివాము. మీకు క్యాన్సరా? కడుపులో క్యాన్సర్? నొప్పితో బాధపడుతున్నారా? గడ్డ వచ్చిందా?" అని అన్నాను. అంటే… మాట్లాడుతా… మాట్లాడుతా… సడన్ గా ఏమన్నాడో తెలుసా? "అయ్యగారు, మీరు జెర్మియా పాస్టర్ గారు కాదు" అన్నాడు. "అవునయ్యా, నేను జెర్మియా పాస్టర్ గారిని" అన్నాను. అంటాడు, "మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారని అనుకోలేదు అయ్యా. నేను దేవా! నన్ను నువ్వు నా కడుపు నిప్పించినందుకై నీకు స్తోత్రం అయ్యా! నీకు స్తోత్రం అయ్యా! స్తోత్రం అయ్యా!" అంటున్నాడు.

"ఏం తమ్ముడా? కడుపు నొప్పి వచ్చినందుకు స్తోత్రం? కడుపు నొప్పి ఇచ్చినందుకు స్తోత్రం అంటావేంటి తమ్ముడా?" అన్నాను. "నాకు ఈ కడుపు నొప్పి రాకపోతే మీకు ఫోన్ చేసేవాడిని కాదుగా! మీకు మెసేజ్ పెట్టేవాడిని కాదు కదా! నాకు కడుపు నొప్పి వచ్చినా పర్వాలేదు అయ్యా! మీరు నాతో ఫోన్ లో మాట్లాడారు. అదే నా జీవితానికి ధన్యత అయ్యా!" అన్నాడు. ఆ మాట విని… ఓ రకంగా… ప్రభువా! ఈ మట్టి గట్టాల కోసం, ఈ పనికిమాలిన వాళ్ళ కోసం పలకరించి చాలు! చిన్న మాట మాట్లాడితే చాలు, ఇంత ఆరాటపడే ప్రజలు మా కోసం ఉన్నారా? ఎవడు ఒక పల్లెటూరులో పుట్టి పెరిగినోడు, అనామకుడు, దైవజనమా! దేవుడు ఇచ్చిన ఈ ఘనమైన పరిచర్యను నమ్మకంగా చేస్తూ వెళ్తూ ఉంటే… ఆ బిడ్డ చెప్పిన మాట విని… "అయ్యా, చాలయ్యా! ఎంత నొప్పి అయినా పర్వాలేదు అయ్యా! మీతో ఫోన్ లో మాట్లాడాను."

దైవజనమా! దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను ఎప్పుడూ విలువైనదిగా ఎంచుకో! ఒక సూచనగా, మహత్కార్యంగా, తన మహిమ కొరకు దేవుడు నిన్ను నిలబెట్టడం ప్రారంభిస్తాడు. ప్రైస్ ది లార్డ్ చెబుదాం! ప్రైస్ ది లార్డ్! పౌలు వారు ప్రాణం కంటే దేన్ని ఎక్కువగా ఎంచాడు? అమ్మ చెప్పాలి! చెప్పాలి! మందిరంలో దేవుడు నీకు ఏ పరిచర్య ఇచ్చాడో, నీకు అప్పగించిన పరిచర్య కొరకు నీ ప్రాణం కంటే దాన్ని ఎక్కువ ప్రేమించుదువు గాక! ఆ బిడ్డ కమలాకర్ ని దేవుడు స్వస్థపరచును గాక! ఆమెన్! క్యాన్సర్ వ్యాధితో లోకంలో ఎంతమంది బాధపడుతున్నారో, వారందరికీ ఒక గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెబుదాం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! స్తోత్రం! ఆమెన్!

రైట్! పౌలు గారు రాళ్ళతో చావగొట్టబడ్డాడు. లొస్త్ర అనే పట్టణంలో… ఈకోని అంతియోకియా నుంచి ప్రజలు వచ్చి చావగొట్టారు. చచ్చిపోయాడు. ఈడ్చుకొని వెళ్లారు. చుట్టూ శిష్యులు చేరి ప్రార్థన చేశారు. లేచాడు. బైబిల్ లో రాయబడిన మాట ఏంటో తెలుసా? "మరునాడు దిర్బేకు ప్రయాణమై వెళ్ళెను" అని రాసి ఉంటుంది. అరికాలు నుంచి నడినెత్తి వరకు రాళ్ళ వర్షం అండి! చచ్చాడు అని చెప్పి మున్సిపాలిటీ కుక్కను ఈడ్చుకొని వెళ్ళినట్లుగా ఈడ్చుకొని వెళ్ళారండి! ఇటు చూడండి! శరీరం అంతా దెబ్బలు! జరిగిన తర్వాత… తర్వాత దెబ్బలు కొట్టేటప్పుడు నొప్పి ఎంత ఉంటుందో! ఆ దెబ్బలు కొట్టిన తర్వాత సాయంత్రం ఆ పుండ్లు వాచి ఉంటాయి కదా! రాత్రి నుండి సలపరం పుడతాది! ఆ గాయాలు ఉబ్బిపోయి తట్టుకోలేనంత బాధ! అక్కడి నుంచి తెల్లారి దిర్బేకు 30… 30 కిలోమీటర్ల దూరం ప్రయాణమే వెళ్తున్నాడు అని ఉంటుంది.

"ఒళ్ళంతా గాయాలయ్యా! ఒళ్ళంతా గాయాలయ్యా! ఎందుకు నువ్వు అట్లా వెళ్తావు? ఇక్కడ ఉండు" పౌలు గారు అంటాడు, "ప్రభువైన యేసుక్రీస్తు వారు వలన పొందిన ఈ పరిచర్యను తుదముట్టించడానికి నా ప్రాణం, నా పరిచర్య కంటే నాకు ఎక్కువ ప్రియమైనది కాదు." ప్రైస్ ది లార్డ్! ఇలాంటి ప్రత్యక్షత ప్రతి సేవకుడు కలిగి ఉంటే ప్రపంచమే యేసయ్యకు సొంతమగును గాక! ఆమెన్! అలాంటి సమర్పణ దైవ సేవకులుగా దేవుడు మాకు దయచేయును గాక! ఆమెన్!

వీటన్నిటికంటే ఏది విలువైందో, ఏది విలువ లేదో చాలా వింటూ వచ్చాం కదా! దైవజనమా! ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే అత్యంత విలువైనది ఏదో తెలుసా? మన ప్రాణ విమోచన కొరకై క్రీస్తు చెల్లించిన యేసుక్రీస్తు రక్తానికి మించి, యేసుక్రీస్తుకు మించి, పరలోక రాజ్యానికి మించి విలువైనది సృష్టిలో మరొకటి ఏదీ లేదు. మరోసారి చెప్పమంటారా? ఈ సృష్టి అంతటిలో డబ్బు విలువైందా? అఫ్ కోర్స్ విలువైంది, అయి ఉండొచ్చు. దానికంటే విలువైనది యేసయ్య రక్తం. ఆస్తిపాస్తులు, కులం, గోత్రం, ధనం… ఓ! ఇవన్నీ విలువైనవి అయి ఉండొచ్చు. కాదు అన్నాం! వాటికంటే విలువైనది సిలువలో యేసయ్య చిందించిన పవిత్ర రక్త ధారలు. దానికంటే విలువైనది పరలోక రాజ్యం. దైవజనమా! వాటికంటే విలువైనది ప్రపంచంలో మరొకటి ఏదీ లేదని దేవుని లేఖనం స్పష్టంగా చెప్తుంది.

చూడండి! కీర్తనల గ్రంథం ఒక మాట… కీర్తనల గ్రంథం 49వ కీర్తన, ఆరవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు నేను చదువుతాను. కీర్తనల గ్రంథం 49వ కీర్తన, ఆరవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు… "నాతో కలిసి తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, ఆ తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొను వారికి నేనే ఎలా భయపడవలెను? వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకునట్లు ఆ ఏ సహోదరుడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. (ఎనిమిదవ వచనం) నాతో కలిసి వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. (తొమ్మిదవ వచనం) వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికిని తీరక అట్లు ఉండవలసిందే." చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెబుదాం! కొంచెం గట్టిగా! గట్టిగా కొడుతూ స్తోత్రాలు చెబుదాం! ఈ వచనాలు… ఈ నాలుగు వచనాలు ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి! ఇంకా ఎక్కువ సేపు చెప్పను. రైట్! "తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ విస్తార ధనమును బట్టి పొగుడుకొను వారికి నేను భయపడను."

ఈ కాలంలో ప్రజలను ఏలుబడి చేస్తుంది ఎక్కువ డబ్బు! డబ్బు! డబ్బు! డబ్బు! డబ్బు! డబ్బు! సామెత కూడా ఒకటి పుట్టింది. "పైసా మే పరమాత్మ" అంట! ఎక్కడున్నాడంట? దేవుడు? పైసా మే పరమాత్మ? పైసాలో పరమాత్ముడు లేడు! దేవుడు లేడు! మీకు తెలుసు కదా! కరోనా దినాల్లో ఇటలీ దేశంలో డబ్బు వీధుల మీద జల్లారు! వీధుల మీద జల్లారు! వీధుల మీద జల్లారు! కరోనా దినాల కంటే భయంకరమైన దినాలు లోకంలోకి రాబోతున్నాయి! ఉగ్రత దినాలు! ఏసుక్రీస్తు రెండవ రాకడ దినాలు! దైవజనమా! ఇప్పటి కాలంలో ప్రపంచం ఒకప్పుడు ఉన్నట్టు లేదు! ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఎలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తాదో! ప్రపంచమంతా బైపు గుప్పెట్లో! బైపు గుప్పెట్లో మనుషుడు నలిగిపోతున్నాడు! మొండదా! కరోనా! ఇప్పుడు కొత్తగా మంకీ ఫాక్స్! రేపు పిగ్ ఫాక్స్ వస్తది! ఇంకొకటి ఎలుక ఫాక్స్ వస్తది! రకరకాల మాయదారి రోగాలు! ఒకాయన ఎవరో నాకు YouTube లో పంపించారు. భయం అనిపించింది! భయం అనిపించింది! లోకం ఇంకా ఎక్కువ కాలం ఉండదు. నేను సంఖ్య చెప్పకూడదు. ఎందుకంటే ప్రభువు ఎప్పుడు వస్తాడో సమయం ఎవరికీ తెలియదు. చెప్పకూడదు అన్నాడు. కాబట్టి చాలా మంది చెప్తున్న మాట ఏంటో తెలుసా? లోకం ఇంకొక ఐదు ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు! ఓ 10, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వినాశనం రాబోతుంది! మనుషుని శరీరం తట్టుకోలేని వైరస్ లోకంలోకి రాబోతుంది! కోట్ల రూపాయల ధనం పెట్టిన ప్రాణాన్ని కాపాడుకోలేరు! మనం ఏ దినాల్లో బ్రతుకుతున్నామో తెలుసా? చివరి దినాల్లో బ్రతుకుతున్నాం! నీ ప్రాణం పోక యేసయ్య రాక ఎవ్వడికీ… ఎవ్వడికీ తెలియదు! మనం సంపాదించిన ఆస్తిపాస్తులలో నూలు పోగు కూడా మనతో పాటు రాదు అని వాక్యం కరాకండిగా చెప్తూ ఉంది.

నిజమే! వాక్యం చెప్పేది ఏముందండి? చనిపోయిన తర్వాత… చనిపోయి ఆఖరి క్షణాల్లో… 50, 60 సంవత్సరాలు నీతో కాపురం చేసిన భార్యను దగ్గరికి పిలిచి… లేదా కొంతమంది సస్తి పూర్తి చేస్తారు… 60 సంవత్సరాలు కలిసి భార్య కాపురం చేసిన భార్యను పిలిచి… భార్యను దగ్గరికి పిలిచి… "నేను చచ్చిపోబోతున్నాను కాంతం! ఒక్కడినే సమాధిలోకి వెళ్ళటానికి నాకు భయంగా ఉంది! నాతో పాటు నువ్వు కూడా రాగాక!" అన్నాడు. చూడండి! సమాధిలోకి ఒంటరిగా వెళ్ళటానికి నాకు కాస్త భయంగా ఉంది. కాంతం! నువ్వు కూడా నాతో పాటు రా అని భర్త అంటే భార్య ఏమంటుందో తెలుసా? "చచ్చేటప్పుడు ఇదే మాయదారి కోరికరా? మొదలు వస్తే కూడా సచ్చేటప్పుడు ఇదే మాయదారి కోరిక రా! నీకు వస్తా! సమాధి దాకా వస్తా! సమాధిలోకి రాను!" అరే! కట్టుకున్న భార్య రాదండి! నీ ఆస్తి ఎక్కడికి వస్తదండి? దైవజనమా! ఆ క్రయం కంటే అతి శ్రేష్టమైన విలువ కలిగిన క్రయం ఏదో తెలుసా? మనందరి ప్రాణ విమోచన కొరకై… కపాలు అని అర్థం ఇచ్చే గొల్గతా పర్వతం మీద యేసుక్రీస్తు కార్చిన రక్తధారలు! అన్ని క్రయాల కంటే, అన్ని ధనాల కంటే అతి శ్రేష్టమైనటువంటి ధనం అది! ప్రైస్ ది లార్డ్! ఈ సృష్టిలో యేసు రక్తం కంటే సమానమైన రక్తం మరొకటి… మరొకటి ఏమిటి? చెప్పాలి! చెప్పాలి! గొర్రెల రక్తం కంటే, మేకల రక్తం కంటే, వెండి కంటే, బంగారం కంటే అతి శ్రేష్టమైనది యేసుక్రీస్తు వారి రక్తం! ఆ రక్తంతో ఒక వ్యక్తి కడగబడితే… "నేను పాపినయ్యా! లోకంలో ఏమీ లేదయ్యా! ఈ ఆస్తిపాస్తుల కంటే, వెండి, బంగారాల కంటే, ధనధాన్యాల కంటే నువ్వు నాకు శ్రేష్టమైన వాడివయ్యా! నువ్వు కార్చిన రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందయ్యా!" అని నమ్మి ఆయన రక్తంతో కడగబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే విషయంలో… పాపంతో పోరాడే విషయంలో… ఆహా! పాపంతో పోరాడే విషయంలో రక్తం కారునంతగా ఎవడు పోరాడుతాడో వాడు చనిపోయిన తర్వాత వాని ఆత్మ కుళ్ళు పట్టకుండా… ఆ రక్తమే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించి కనానుకు నడిపించినట్లుగా… ఆ రక్తమే లోకంలో నుండి పరలోకానికి మనల్ని నడిపించడం ప్రారంభిస్తుంది. ప్రైస్ ది లార్డ్! మనందరి పాప… పాప ప్రాయశ్చిత్తార్థం కొరకు యేసయ్య తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. ఈ మాట క్రొత్త నిబంధనలో కాదండి! పాత నిబంధనలో కీర్తనకారుడు అంటాడు. ఆ మాటలు ఒకసారి చూపించుదాం! మరల నెక్స్ట్ వచనం… ఎనిమిదవ వచనం… "నాతో కలిసి వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు." ఉన్నాడా? లేడా? ఆ ఉన్నాడా? లేడా? చెప్పాలి! ఉన్నాడా? లేడా? మరొకసారి చదువుతాను. లైవ్ లో ఉన్న బిడ్డలారా చూడండి! నాతో కలిసి చెప్పండి! "వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు…" ఎంత కాలం బ్రతుకునట్లు? చనిపోయిన తర్వాత ఆ… ఆ నిత్యము బ్రతకాలంటే దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలిగే వాడు ఒకడు ఉండాలి. ఎవరు ఉండాలి? ఆ ప్రాయశ్చిత్తం చేసేవాడు ఉన్నాడా? వాడు చనిపోయినా వాడు కుళ్ళు పట్టడు! వాని ఆత్మ కుళ్ళు పట్టదు! వాని ఆత్మ నిత్య… ఆ మాట చెప్పాలి! గట్టిగా! ఆ… వాని ఆత్మ ఆ నిత్యము బ్రతుకుతుంది! నిత్యము బ్రతకాలంటే దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసేవాడు ఒకడు ఉండాలి. కానీ కీర్తనకారుడు అంటాడు… ఉండాలి గాని లేడయ్యా! ఉంటే ఎంత బాగుండు కదా! లేడు అంటాడు! మిమ్మల్ని అడుగుతాను! నా వైపు చూసి చెప్పాలి! ప్రాయశ్చిత్తం చేసేవాడు లేడు అని ఆయన అన్నాడు కదా! మిమ్మల్ని అడుగుతాను! ప్రాయశ్చిత్తం చేసేవాడు ఉన్నాడా? లేడా? పెద్దగా! ఉన్నాడా? లేడా? ఆ ప్రాయశ్చిత్తం చేసిన వాడే మన ప్రాణ విమోచన క్రీస్తుగా కల్వరి సిలువలో ప్రశస్తమైన రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు వారే! ప్రైస్ ది లార్డ్!

దైవజనమా! యేసు రక్తాన్ని గూర్చి… చూడండి! చూడండి! నా వైపు చూడండి! మనందరి పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం… తొమ్మిదవ వచనం… తమ్ముడు… మనందరి పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం యేసయ్య చిందించిన రక్తపు విలువ ఎంతో భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? "వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది!" పెద్దగా చెప్పాలి! ఎంత గొప్పది రా తల్లి! ఆ… కొంచెం పెద్దగా చెప్పాలి! "బహు గొప్పది! అది ఎన్నటికిని తీరక అట్లు ఉండాల్సిందే!" ఒకవేళ ఆ రక్తం యొక్క విలువ ఇంత అని చెబుదామా? అంటాడు… "అమూల్యమైన రక్తము!" అంటాడు! ఎలాంటి రక్తం? అమూల్యమైనది అంటే దానికి మూల్యం చెల్లించలేము! ఇక దానికి దీని విలువ ఎంత అని ప్రపంచంలో ఎవడు చెప్పలేడు! అమూల్యమైన రక్తం! దైవజనమా! ఈ సెల్ ఫోన్ పదివేల రూపాయలు పెడితే కొనొచ్చు. రైట్! ఈ సెల్ ఫోన్ ₹15000 రూపాయలు పెడితే కొనొచ్చు. ఈ కళ్ళజోడు ₹200 రూపాయలు పెడితే కొనొచ్చు. ఈ పాటల పుస్తకం వంద రూపాయలు పెడితే కొనొచ్చు. ప్రపంచంలో దేన్నైనా విలువతో కొనగలమేమో కానీ విలువతో కొనలేని ఒకే ఒక్కటి యేసుక్రీస్తు వారి రక్తం! అమూల్యమైన రక్తం! ఆ అమూల్యమైన రక్తమే మన బ్రతుకులో అమూల్యమైన కార్యం చేసింది! యేసయ్యకు మహిమ కలుగును గాక! ఎంత కార్యం చేసిందో తెలుసా? ఈ అమూల్యమైన రక్తంతో ఎవరైతే కడగబడతారో… యేసయ్య నా దేవుడని నమ్మి ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడి ఎందరైతే బాప్తిస్మం తీసుకుంటారో… చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ కుళ్ళు పట్టదు! చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళదు! చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ పరలోకానికి వెళ్లి… ఆ మాట చెప్పాలి! ఆ… ఎంత కాలం రా తల్లి! ఆ… ఇప్పుడు చెప్పండి! డబ్బు గొప్పదా? యేసు రక్తం గొప్పదా? నీ కులం గొప్పదా? యేసు రక్తం గొప్పదా? నీ గోత్రం గొప్పదా? యేసు రక్తం గొప్పదా? ఉద్యోగం గొప్పదా? యేసు రక్తం గొప్పదా? నీ శరీరం గొప్పదా? యేసు రక్తం గొప్పదా? చివరికి నువ్వు ఎలా దేవుని కొరకు తెగించాలి అంటే… ప్రభువు వారు అంటారు… ఏమంటారో తెలుసా? "పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించే నిమిత్తం, కుళ్ళు పట్టని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే నిమిత్తం, నిత్యము పరలోక రాజ్యంలో దేవునితో కూడా నువ్వు యుగాయుగాలు బ్రతుకు నిమిత్తం… నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిందా?" కొంచెం గట్టిగా! కొంచెం గట్టిగా! "నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిందా? ఆ… నీ కుడి కాళ్ళు నిన్ను అభ్యంతరపరిచిందా?" అంటాడు భక్తుడు! యేసు ప్రభువు వారు భక్తుడు కాదు! యేసు ప్రభువు వారు అంటారు… "నీ కన్ను పదే పదే ఆ చెడు చూడాలి! చెడు చూడాలి! చెడు చూడాలి! అని పదే పదే రేపుతుందా? నీ కంటిని పీకేయ్!" అంటాడు! అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? కన్నుని పీకేయాలని కాదు! అట్లా పీకేసి పాటికి అందరూ గుడ్డోళ్ళు అయిపోయి ఉండేవాళ్ళు! అట్లాగని పాపం చేయమని కాదు! సుమీ! పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే విషయంలో… నీ దేహంతో పాపంతో పోరాడే విషయంలో రక్తం కారునంతగా నువ్వు పోరాడాలి! శరీరపు దురాశల కంటే పరలోకం శ్రేష్టమైనది! ప్రైస్ ది లార్డ్! అపవిత్రమైన కోరికల కంటే పరలోక రాజ్యం శ్రేష్టమైనది! ఇది ఎరిగే పౌలు గారు ఏం చేశాడో తెలుసా? "నేను బెన్యామీను గోత్రికుడిని, పెంటతో సమానంగా ఎంచుకున్న పరిసయుడిని, పెంటతో సమానంగా ఎంచుకున్న… మా నాన్న ఇవ్వాలని చూపించిన ఆస్తిపాస్తులను పెంటతో సమానంగా ఎంచుకున్న… ధర్మశాస్త్ర విషయంలో నేను… అని దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్న… మరి ఇప్పుడు దేన్ని శ్రేష్టమైన దానిగా ఎంచావయ్యా?" అంటే… "వాటన్నిటిని నష్టపరుచుకొని క్రీస్తును సంపాదించుకోవాలని నేను ప్రాకులాడుతున్నాను!" ఆమెన్! ఏం సంపాదించుకోవాలని అయ్యా? క్రీస్తును సంపాదించుకోవాలి! నీకు వచ్చిన లాభం ఏంటయ్యా? "మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగుతుంది!" గట్టిగా చెబుదాం! ఆమెన్! ఆమెన్! కూర్చున్న లేచిన… ఒక్క మాట అడుగుతాను… దేవా! ఈ డబ్బు ఉంటే ఎంత పోతే… అంటే డబ్బు తీసేయమని ప్రార్థన చేయమనను! నేను చేయమన్నా మీరేం చేయరు! లేండి! ఒక మాట… డబ్బు ఇచ్చినా, నాకు ఇవ్వకపోయినా, ఈ దేహంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యవంతుడిగా బ్రతికినా, కడుపు ఎదవోడిగా బ్రతికినా, జీవితం నాకు ఏది దూరం చేసినా, పరలోకం మాత్రం దూరం చేయొద్దయ్యా! నీ రాజ్యాన్ని నాకు దూరం చేయొద్దయ్యా! నీతో యుగాయుగాలు పరలోకంలో బ్రతకాలి! నా బ్రతుకులో యేసయ్య ఏమి ఇవ్వకపోయినా పర్వాలే! ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్వాలే! సంతానం ఇవ్వకపోయినా పర్వాలే! ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలే! ఐశ్వర్యం ఇవ్వకపోయినా పర్వాలే! ఏది నాకు దూరం చేసినా పర్వాలేదు అయ్యా! ఆరోగ్యం దూరం చేసినా నేను బ్రతకగలను! పరలోక రాజ్యాన్ని మాత్రం నాకు దూరం చేయక! ఆ విలువైన దాని కొరకే నేను పోరాడుతున్నానయ్యా! పౌలు గారికి ఇచ్చిన దర్శనమే మనందరి దర్శనం అయి ఉండును గాక! విలువ లేని వాటి కొరకు విలువైన దాన్ని కోల్పోకు! పరలోకం కంటే విలువైనది ఏముంది? అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక!